Honor స్మార్ట్‌ఫోన్లపై భారీ ధర తగ్గింపు, రూ.11,999కే 4జీబి ర్యామ్ ఫోన్
Honor బ్రాండ్ స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ డిస్కౌంట్‌లకు తెరలేపుతూ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో "Honor Gala" సేల్ ప్రారభమమైంది. నవంబర్ 7న ప్రారంభమైన ఈ సేల్ నవంబర్ 11తో ముగుస్తుంది.
Honor బ్రాండ్ స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ డిస్కౌంట్‌లకు తెరలేపుతూ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో "Honor Gala" సేల్ ప్రారభమమైంది. నవంబర్ 7న ప్రారంభమైన ఈ సేల్ నవంబర్ 11తో ముగుస్తుంది. హానర్ ఇండియా అఫీషియల్ ఆన్‌లైన్ స్టోర్‌లోనూ ఈ సేల్ అందుబాటులో ఉంటుంది. ఈ 5 రోజుల సేల్‌లో భాగంగా ఎంపిక చేసిన హానర్ స్మార్ట్‌ఫోన్‌లను భారీ ధర తగ్గింపు పై విక్రయిస్తున్నారు. వాటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

హానర్ 8 ప్రో పై రూ.3000 తగ్గింపు
ఈ సేల్‌లో భాగంగా హానర్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటైన 'హానర్ 8 ప్రో' రూ.3000 ధర తగ్గింపుతో ట్రేడ్ అవుతోంది. లాంచ్ సమయంలో ఈ ఫోన్ ధర రూ.29,999గా ఉంది. ఈ 5 రోజుల సేల్‌లో భాగంగా రూ.26,999కే ఈ ఫోన్ అందబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ పై అదనంగా రూ.20,000 వరకు ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ సౌకర్యాన్ని ఫ్లిప్‌కార్ట్ కల్పిస్తోంది. ఫోన్ కొనుగోలు చేసే సమయంలో అదనంగా రూ.149 చెల్లించినట్లయితే బుయ్ బ్యాక్ గ్యారంటీ కూడా లభిస్తుంది.

ఐడియా 4జీ డేటా ఇంకా అన్‌లిమిటెడ్ కాల్స్..
అమెజాన్ ఇండియా హానర్ 8 ప్రో పై రూ.9,600 వరకు ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ సౌకర్యాన్ని కల్పిస్తోంది. అదనపు ఆఫర్లు క్రింద ఈ ఫోన్‌ను కొనుగోలు చేసే వారికి రూ.343కే 64జీబి ఐడియా 4జీ డేటా ఇంకా అన్‌లిమిటెడ్ కాల్స్ అందుబాటులో ఉంటాయి. ప్యాక్ వ్యాలిడిటీ 56 రోజులు. హానర్ అఫీషియల్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసిన వారికి ఓ గిఫ్ట్ బాక్స్‌ను కూడా హానర్ అందిస్తోంది.

హానర్ 8 పై రూ.12,000 తగ్గింపు..
ఇక హానర్ 8 విషయానికి వచ్చేసరికి ప్రస్తుతానికి ఈ రెండు స్మార్ట్ ఫోన్ లు అమెజాన్ అలానే ఫ్లిప్‌కార్ట్ లలో రూ.17,000 ధర ట్యాగ్ తో ట్రేడ్ అవుతున్నాయి. లాంచ్ సమయంలో ఈ ఫోన్ ధర రూ.29,000గా ఉంది. ప్రస్తుతం రూ.17,000కు ట్రేడ్ అవుతుంది. రూ.12,000 తగ్గింపు ఈ ఫోన్ పై లభిస్తోంది.

గెలాక్సీ జే7 ప్రో పై రూ.1000 తగ్గింపు
ఫ్లిప్‌కార్ట్ ఈ స్మార్ట్ ఫోన్ పై రూ.17,000 వరకు ఎక్స్ ఛేంజ్ సౌకర్యాన్ని అందిస్తోంది. ఇక అమెజాన్ ఇండియా హానర్ 8 పై రూ.9,500 వరకు ఎక్స్ ఛేంజ్ సౌకర్యాన్ని ఆఫర్ చేయటంతో పాటు తయారీదారు వారంటీని ఒక ఏడాది పాటు పొడిగించింది.

హానర్ 6ఎక్స్ పై రూ.4000 వరకు తగ్గింపు..
ఈ 5 రోజుల సేల్‌లో భాగంగా హానర్ 6ఎక్స్ 3జీబి ర్యామ్ + 32జీబి స్టోరేజ్ వేరియంట్ పై రూ.3000 , 4జీబి ర్యామ్ + 64జీబి స్టోరేజ్ వేరియంట్ పై రూ.4000 తగ్గింపును హానర్ ప్రకటించింది. ప్రస్తుతం వీటి ధరలను పరిశీలించినట్లయితే.. హానర్ ఎక్స్ 4జీబి ర్యామ్ వేరియంట్‌ను రూ.11,999కే కొనుగోలు చేసే వీలుంటుంది. ఈ ఫోన్ వాస్తవ ధర రూ.15,999గా ఉంది.

మరిన్ని హానర్ స్మార్ట్‌ఫోన్ మోడల్స్ పై..
హానర్ ఎక్స్ 3జీబి ర్యామ్ వేరియంట్‌ను రూ.9,999కే కొనుగోలు చేసే వీలుంటుంది. ఈ ఫోన్ వాస్తవ ధర రూ.12,999గా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ పై రూ.11,000 వరకు ఎక్స్‌ఛేంజ్ సౌకర్యాన్ని అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు కల్పిస్తున్నాయి. వీటితో పాటు మరిన్ని హానర్ స్మార్ట్‌ఫోన్ మోడల్స్ పై "Honor Gala" సేల్ డిస్కౌంట్‌ల వర్షం కురిపిస్తోంది.


Click it and Unblock the Notifications








