‘వెరీ వెరీ స్పెషల్’.. పెద్దలకు మాత్రమే?

Posted By: Super

‘వెరీ వెరీ స్పెషల్’.. పెద్దలకు మాత్రమే?

 

వృద్ధ వయస్కుల కోసం అనేక సాంకేతిక ఉపకరణాలను డిజైన్ చేసిన అమెరికా బ్రాండ్ డోరా, స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్‌లోకి ప్రవేశించింది. యూఎస్ మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు తన తొలి ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్‌ఫో‌న్‌ను వృద్ధి చేసింది. పేరు ‘డోరా ఫోన్ఈజీ 740’.ఈ హ్యాండ్‌సెట్లో నిక్షిప్తం చేసిన ఫీచర్లు వృద్థాప్యంలోకి ప్రవేశించింన వారికి మరింత ఉపయుక్తంగా నిలుస్తాయి. టచ్‌స్ర్కీన్, పెద్దవైన ఐకాన్స్, స్లైడ్ -డౌన్ డైలింగ్ కీప్యాడ్ వంటి ఫీచర్లు ఈ డివైజ్‌కు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.

ఫోన్ కీలక ఫీచర్లు:

ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం,

డోరా ఎక్స్పీరియన్స్ సాఫ్ట్‌వేర్,

రిమోట్ వెబ్ ఆసిస్టెన్స్,

5 మెగా పిక్సల్ కెమెరా,

ఉన్నతమైన కాంట్రాస్ట్ డిస్ ప్లే,

3జీ కనెక్టువిటీ,

వై-ఫై సౌలభ్యత,

బ్లూటూత్ కనెక్టువిటీ,

మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్స్.

హ్యాండ్‌సెట్‌లో ఏర్పాటు చేసిన డోరా ఎక్స్పీరియన్స్ సాఫ్ట్‌వేర్ ప్రత్యేక యూజర్ అనుభూతులను చేరువ చేస్తుంది. ముందుగానే లోడ్ చేసిన న్యూస్ అదేవిధంగా హెల్త్ అప్లికేషన్‌లు తాజా సమాచారంతో పాటు ఆరోగ్య సంబంధిత చిట్కాలను తెలియజేస్తాయి. అనేకమైన యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్లతో సమర్ధవంతంగా డిజైన్ కాబడిన ఈ ఫోన్ విడుదలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వయసు మళ్లిన వారికి ‘డోరా ఫోన్ఈజీ 740’ ఉత్తమ ఎంపికగా  భావించవచ్చు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot