ఆధార్ ఉంటేనే కొత్త సిమ్ కనెక్షన్

Posted By:

కొత్త మొబైల్ సిమ్ కనెక్షన్‌ను తీసుకోవాలనుకునే వినియోగదారుల వద్ద నుంచి వారికి కేటాయించిన వ్యక్తిగత ఆధార్ నెంబర్లను ఇక పై తప్పనిసరిగా తీసుకోవాలని అన్ని టెలికాం ఆపరేటర్లకు టెలికాం శాఖ సూచించింది. ఇలా సేకరించిన ఆధార్ రుజువులను సంబంధిత టెలికాం ఆపరేటర్లు భద్రపరుచుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.

 ఆధార్ ఉంటేనే కొత్త సిమ్ కనెక్షన్

కొత్త సిమ్ కార్డ్ జారీ సమయంలో కస్టమర్ చెప్పే వివరాల ప్రకారం పూరించే ప్రాథమిక దరఖాస్తు ఫారంతో పాటు సంబంధిత వ్యక్తి ఆధార్ నెంబర్లను సేకరించి వాటిని జాగ్రత్తచేయలని టెలికాం శాఖ వెల్లడించింది.

ఈ నూతన విధానాన్ని అమలులోకి తీసుకురావటం ద్వారా మొబైల్ సిమ్ తీసుకుని ఆసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారికిచెక్ పెట్టవచ్చనేది కేంద్ర ప్రభుత్వం ముఖ్య ఉద్దేశ్యం. ఆధార్ ప్రాజెక్టుకు సంబంధించి ఇటీవల జరిగిన ఉన్నస్థాయి సమావేశంలో ఈ అంశం పై ప్రభుత్వం చర్చించింది. కొత్తగా సిమ్ కార్డులు తీసుకున్న వాటికే కాకుండా ఇప్పటికే వినియోగంలో ఉన్న సిమ్ కార్డులకు కూడా ఆధార్ లింక్ తప్పనిసరి చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
DoT makes Aadhaar number mandatory for issuing new Sim Cards. Read more in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot