రోడ్డు పై ఈడ్చుకెళ్లారు..?

Posted By: Super

రోడ్డు పై ఈడ్చుకెళ్లారు..?

స్మార్ట్‌ఫోన్ ప్రపంచాన్ని శాసిస్తున్న సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3, ఆపిల్ ఐపోన్ 4ఎస్‌లు మరోసారి తలపడ్డాయి. ఈ రెండు గ్యాడ్జెట్‌ల మధ్య నిర్వహించిన ‘డ్రాగ్ రేస్ స్ర్కాచ్ టెస్ట్’కు సంబంధించిన వీడియోను ప్రముఖ వెబ్‌సైట్ ‘ఏ పర్‌ఫెక్ట్ గెలాక్సీ డాట్ కామ్’ యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసింది.

పోటీలో ఏం జరిగింది..?

బలాబలాల పరీక్షలో భాగంగా రెండు హ్యాండ్‌సెట్‌ల డిస్‌ప్లేలను నేలకు తాకే విధంగా తాళ్లతో కట్టివుంచి కాంక్రీట్ రహదారి పై వాహనం సాయంతో కొంత దూరం ఈడ్చుకెళ్లారు. ఈ రాపిడిలో ఐఫోన్ 4ఎస్ డిస్‌ప్లే పూర్తిగా దెబ్బతినగా, గెలాక్సీ ఎస్3 ఒత్తిడిని అధిగమించగలిగింది.

ఆపిల్ ఐఫోన్ 4ఎస్ ప్రధాన ఫీచర్లు:

8 మెగాపిక్సల్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా, 480p@30fpsవీడియో రికార్డింగ్, 3.7 అంగుళాల రెటీనా డిస్‌ప్లే, డ్యూయల్ కోర్ 1 గిగాహెట్జ్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్, ఆపిల్ ఏ5 చిప్‌సెట్,

సిరీ వాయిస్ కమాండ్స్, ఐవోఎస్5 ఆపరేటింగ్ సిస్టం, మెమెరీ సామర్ధ్యం 16జీబి, 32జీబి, 64జీబి, శక్తివంతమైన 1432ఎమ్ఏహెచ్ బ్యాటరీ (టాక్ టైమ్ 8 గంటలు), ప్రారంభ ధర రూ.35,000.

గెలాక్సీ ఎస్3 ప్రధాన ఫీచర్లు:

4.8 అంగుళాల మల్టీ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 720 x 1280పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం(త్వరలో ఆండ్రాయిడ్ జెల్లీబీన్ కు అప్ డేట్ అయ్యే అవకాశం) , క్వాడ్‌కోర్ 1.4గిగాహెడ్జ్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్, మాలీ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, Exynos 4212 క్వాడ్ చిప్‌సెట్, 8 మెగా పిక్సల్ కెమెరా (రిసల్యూషన్ 3264×2448పిక్సల్స్), 1.9మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, జియో ట్యాగింగ్, 1జీబి ర్యామ్, ఇంటర్నల్ మెమెరీ (16/32/64జీబి వేరియంట్స్), నెట్‌వర్క్ సపోర్ట్ (2జీ, 3జీ, 4జీ), ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, గేమ్స్, ఎఫ్ఎమ్ రేడియో, లియోన్ 2100ఎమ్ఏహెచ్ బ్యాటరీ, బరవు 133 గ్రాములు. పెబ్బిల్ బ్లూ, మార్బుల్ వైట్ రంగుల్లో లభించే గెలాక్సీ ఎస్-3 16జీబి మెమరీ వేరియంట్ ధర రూ.38400, 32జీబి మెమెరీ వేరియంట్ ధర రూ.41,500.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot