‘డ్రోన్’ తక్కువ ధర డ్యూయల్ సిమ్ మొబైల్!!

Posted By: Prashanth

‘డ్రోన్’ తక్కువ ధర డ్యూయల్ సిమ్ మొబైల్!!

 

ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్‌లకు ప్రజాదరణ పెరుగుతున్న నేపధ్యంలో మరిన్ని కంపెనీలు వీటి ఉత్పాదనల పై దృష్టిసారిస్తున్నాయి. ఈ కోవకే చెందిన ‘యునెక్టో సంస్థ’ తక్కువ ధర డ్యూయల్ సిమ్ ఆండ్రాయిడ్ ఆధారిత ఫోన్‌ను ప్రవేశపెట్టనుంది. ‘డ్రోన్’గా విడుదలవుతున్న ఈ మొబైల్ ఫీచర్స్ అదేవిధంగా స్పెసిఫికేషన్స్..........

* ఆండ్రాయిడ్ 2.2 ఫ్రోయో ఆపరేటింగ్ సిస్టం,

* డ్యూయల్ సిమ్ సపోర్ట్,

* 3.2 అంగుళాల HGVA టచ్ స్ర్కీన్ డిస్‌ప్లే,

* 3 మెగా పిక్సల్ రేర్ కెమెరా,

* జియో ట్యాగింగ్,

* బ్లూటూత్ వర్షన్ 2.1,

* వై-పై 802.11 b/g/n.

వేగవంతమైన వెబ్ బ్రౌజింగ్‌కు ఈ ఫోన్ తోడ్పడుతుంది. ఉపయుక్తమైన ఫైల్ షేరింగ్ ఫీచర్లను నిక్షిప్తం చేశారు. తక్కువ డబ్బులు చెల్లించి ఎక్కువ పనితీరును ఈ డివైజ్ నుంచి ఆశించవచ్చు. సమంజసమైన ధరకే లభ్యంకానున్న ‘డ్రోన్’ డ్యూయల్ సిమ్ స్మార్ట్ మొబైల్ విద్యార్థులతో పాటు యువతను ఆకర్షిస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot