క్లోజ్‌ఫ్రెండ్ లాంటి ఫీలింగ్!

Posted By: Super

క్లోజ్‌ఫ్రెండ్ లాంటి ఫీలింగ్!

 

మీ స్నేహితుల బృందంతో స్మార్ట్ కమ్యూనికేషన్‌ను ఏర్పరుచుకునేందుకు పటిష్టమైన సూపర్ ఫోన్‌ను మైక్రోమ్యాక్స్ డిజైన్ చేసింది. డ్యూయల్ సిమ్ సౌలభ్యతతో పాటు ఆధునిక ఫీచర్లతో సుసంపన్నమైన ఈ హ్యాండ్‌సెట్ పేరు మైక్రోమ్యాక్స్ ఏ50. ఆండ్రాయిడ్ వోఎస్ ఆధారితంగా పనిచేసే ఈ ఫోన్లో Aisha అనే వాయిస్ కమాండ్ అప్లికేషన్‌ను నిక్షిప్తం చేశారు. సిరీ వాయిస్ కమాండ్ అప్లికేషన్ తరహాలో రూపుదిద్దుకున్న ఈ ఫీచర్ క్లోజ్ ఫ్రెండ్ లాంటి ఫీలింగ్‌ను చేరువచేస్తుంది.

Aisha అంటే ‘ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్ స్పీచ్ హ్యాండ్‌సెట్ అసిస్టెంట్’. ఈ అప్లేకేషన్.. పదాలను చర్యలలోకి అనువదించగలదు. అంటే నోటీ ద్వారా మీరు ఇచ్చే కమాండ్‌లకు ఈ అప్లికేషన్ ప్రతిస్పందిస్తుంది. ఉదాహరణకు: ‘What is the weather in vijayawada’ అని మీరు వాయిస్ కమాండ్ ఇస్తే టక్కన ‘The weather will be hot and humid’అని సమాధానం ఇస్తుంది.

మైక్రోమ్యాక్స్ ఏ50 ఫీచర్లు:

డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్,

టచ్ స్ర్కీన్,

2మెగా పిక్సల్ రేర్ కెమెరా,

ఆడియో ప్లేయర్,

వీడియో ప్లేయర్,

ఇన్‌బుల్ట్ గేమ్స్,

లౌడ్ స్సీకర్స్,

ఆడియో జాక్,

నెట్‌వర్క్ సపోర్ట్ (2జీ,3జీ),

కనెక్టువిటీ ఫీచర్లు (జీపీఆర్ఎస్, వై-ఫై, బ్లూటూత్, యూఎస్బీ కనెక్టువిటీ, జీపీఎస్ సపోర్ట్, హెచ్ టిఎమ్ఎల్ బ్రౌజర్),

ఆండ్రాయిడ్ 2.3.6 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,

650మెగాహెడ్జ్ ప్రాసెసర్,

1200mAh బ్యాటరీ (స్టాండ్‌బై 240 గంటలు, టాక్‌టైమ్ 4 గంటలు),

ధర అంచనా రూ.5000.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot