పెద్ద‌స్ర్కీన్ డ్యూయల్‌సిమ్ హ్యాండ్‌సెట్‌‌లు (2013)

|

5.3 అంగుళాల పెద్ద డిస్‌ప్లేతో సామ్‌సంగ్ నుంచి 2011లో విడుదలైన గెలాక్సీ‌నోట్, ఫాబ్లెట్‌ల సంస్కృతికి బీజం వేసింది. అలా మొదలైన ఫాబ్లెట్‌ల విస్తరణ నాటి నుంచి నేటి వరకు కొనసాగుతూనే ఉంది. అంతర్జాతీయ బ్రాండ్‌లు మొదలుకుని దేశవాళీ బ్రాండ్‌ల వరకు
పెద్ద‌స్ర్కీన్ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ పైనే దృష్టిసారిస్తున్నాయి.

తన తొలి గెలాక్సీ నోట్ ఫాబ్లెట్ విజయవంతమవటంతో సామ్‌సంగ్ రెండవ తరం ఫాబ్లెట్ గెలాక్సీ నోట్ 2ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఈ డివైజ్‌కు పోటీగా ఎల్‌జి ‘ఆప్టిమస్ వీయూ' పేరుతో సరికొత్త ఫాబ్లెట్‌ను తీసుకువచ్చింది. మరో బ్రాండ్ హెచ్‌టీసీ ‘జే బటర్ ఫ్లే', ‘డ్రాయిడ్ డీఎన్ఏ' మోడళ్లలో రెండు పెద్ద డిస్‌ప్లే హ్యాండ్‌సెట్‌లను వెలుగులోకి తెచ్చింది.

ఇండియన్
మార్కెట్ విషయానికొస్తే బడ్జెట్ ఫ్రెండ్లీ డ్యూయల్ సిమ్ ఫాబ్లెట్‌లకు ఆదరణ బాగుంది. మైక్రోమ్యాక్స్, వికెడ్‌లీక్, లావా, జింక్ వంటి దేశవాళీ బ్రాండ్‌లు ఇప్పటికే బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో ఫాబ్లెట్‌లను అందుబాటులోకి తెచ్చాయి. నేటి ప్రత్యేక కథనంలో భాగంగా 2013లో విడుదలైన ఉత్తమ ఫాబ్లెట్‌ల వివరాలను మీ ముందుంచుతున్నాం.

సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ (samsung galaxy grand):

సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ (samsung galaxy grand):

5 అంగుళాల మల్టీ-టచ్ ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,

- డిస్‌ప్లే రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్,

- డ్యూయల్ కోర్ 1.2గిగాహెట్జ్ ప్రాసెసర్,

- ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,

- 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,

- 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),

- మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 64జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

- వై-ఫై, బ్లూటూత్, యూఎస్బీ, హెచ్ డిఎమ్ఐ అవుట్, ఏ-జీపీఎస్, డీఎల్ఎన్ఏ,

- 2100ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ.

ప్రీలోడెడ్ అప్లికేషన్‌లు:

చాట్ ఆన్, గేమ్స్ హబ్, మై మూవీస్, మై మ్యూజిక్, మై మొబైల్ టీవీ, మై స్టేషన్. మై రీడర్, మై ఎడ్యుకేషన్.

ధర ఇతర వివరాలు:

ఎలిగెంట్ వైట్ ఇంకా మెటాలిక్ బ్లూ కలర్ వేరియంట్‌లలో సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ లభ్యం కానుంది. ఫిబ్రవరి మొదటి వారం నుంచి రిటైల్ మార్కెట్లో విక్రాయాలు ప్రారంభం కానున్నాయి. ధర రూ.21,500.

 

మైక్రోమ్యాక్స్ ఏ116 కాన్వాస్ హైడెఫినిషన్ (Micromax A116 Canvas HD):

మైక్రోమ్యాక్స్ ఏ116 కాన్వాస్ హైడెఫినిషన్ (Micromax A116 Canvas HD):

డిస్‌ప్లే: 5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, డిస్‌ప్లే రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్,

ప్రాసెసర్: 1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ మీడియా టెక్ ఎంటీ6589 ప్రాసెసర్,

ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,

కెమెరా: 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),

స్టోరేజ్: 4జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 1జీబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

కనెక్టువిటీ: 3జీ, వై-ఫై 802.11 బి/జి/ఎన్, బ్లూటూత్, జీపీఎస్/ఏ-జీపీఎస్ కనెక్టువిటీ,

బ్యాటరీ: 2100ఎమ్ఏహెచ్ బ్యాటరీ (బ్యాకప్ వివరాలు తెలియాల్సి ఉంది),

ప్రీలోడెడ్ అప్లికేషన్‌లు: ఎమ్ స్టోర్, ఎమ్ బడ్డి, ఎం ఎస్ఎమ్ఎస్, ఎమ్ జోన్, హుక్ అప్.

ధర ఇతర వివరాలు: మైక్రోమ్యాక్స్ ఏ116 కాన్వాస్ హైడెఫినిషన్ ఫాబ్లెట్ ధర అంచనా రూ.15,000. ఫిబ్రవరి నుంచి రిటైల్ మార్కెట్లో లభ్యంకానుంది.

 

వికెడ్‌లీక్ వామ్మీ టైటాన్ (Wickedleak Wammy Titan):

వికెడ్‌లీక్ వామ్మీ టైటాన్ (Wickedleak Wammy Titan):

5 పాయింట్ మల్టీ-టచ్ క్యూహైడెఫినిషన్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
డిస్‌ప్లే రిసల్యూషన్ 960 x 540పిక్సల్స్,
1.2గిగాహెట్జ్ ఎంటీకే6577 ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
8మెగా పిక్సల్ రేర్ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
4జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
1జీబి ర్యామ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
డ్యూయల్ సిమ్, వై-ఫై, బ్లూటూత్, 3జీ కనెక్టువిటీ,
2500ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
టాక్‌టైమ్ 8 గంటలు, స్టాండ్‌బై టైమ్ 260 గంటలు,
ధర రూ.13,000.

లావా ఐరిస్ 501 (Lava iris 501):

లావా ఐరిస్ 501 (Lava iris 501):

5 అంగుళాల డబ్ల్యూవీజీఏ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
డిస్‌ప్లే రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్,
ఆండ్రాయిడ్ 4.0.4 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),
4జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
డ్యూయల్ సిమ్, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్, మైక్రోయూఎస్బీ 2.0,
2300ఎమ్ఏహెచ్ లిపో బ్యాటరీ,
ధర రూ.9,999.

జింక్ క్లౌడ్ జడ్5 (Zync Cloud Z5):

జింక్ క్లౌడ్ జడ్5 (Zync Cloud Z5):

1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 4.0.3 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
5 పాయింట్ మల్టీ-టచ్ ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
డిస్‌ప్లే రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్,
డ్యూయల్ కోర్ 1గిగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
4జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
512ఎంబి ర్యామ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
డ్యూయల్ సిమ్, 3జీ, వై-ఫై, బ్లూటూత్ 2.0, జీపీఎస్ కనెక్టువిటీ,
2500ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ,
ధర రూ.11,990.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X