మరో ‘మెరుపు’ రాబోతుంది?

Posted By: Super

మరో ‘మెరుపు’ రాబోతుంది?

ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణతో దూసుకుపోతున్నసామ్‌సంగ్ డ్యూయల్ సిమ్ స్మార్ట్‌‍ఫోన్‌ల విభాగంలోనూ తన చతురతను చాటుకుంది. ఈ బ్రాండ్ నుంచి ఇటీవల కాలంలో విడుదలైన ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు ‘గెలాక్సీ వై డ్యూయోస్’, ‘గెలాక్సీ ఎస్ డ్యూయోస్’లకు మార్కెట్లో అనుకూల స్పందన లభించింది. డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌ల విభాగంలో ఇదే దూకుడను కొనసాగించాలనే తపనతో సామ్‌సంగ్ ‘గెలాక్సీ ఎస్ డ్యూయోస్’ పేరుతో అధిక ముగింపు డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌ను డిజైన్ చేసింది.

ఈ హ్యాండ్‌సెట్ అగష్టు చివరి నాటికి అందుబాటులోకి రానుంది. డ్యూయల్ సిమ్ జీఎస్ఎమ్‌ నెట్‌వర్క్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది...

ఫోన్ కీలక ఫీచర్లు:

10.5 మిల్లీ మీటర్ల మందం,

బరువు 120 గ్రాములు,

డ్యూయల్ సిమ్,

జీఎస్ఎమ్ నెట్‌వర్క్ సపోర్ట్,

4 అంగుళాల టచ్ స్ర్కీన్ (రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్),

ఆండ్రాయిడ్ 4.0 ఐస్ క్రీమ్ శాండ్ విచ్ ఆపరేటింగ్ సిస్టం,

1గిగాహెట్జ్ కార్టెక్స్ ఏ5 ప్రాసెసర్,

అడ్రినో 200 గ్రాఫిక్ ప్రాసెసర్,

5మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఆటో ఫోకస్),

4జీబి ఇంటర్నల్ మెమెరీ,

32జీబి ఎక్స్ ప్యాండబుల్ మెమెరీ,

వై-ఫై, వై-ఫై హాట్ స్పాట్, 3జీ కనెక్టువిటీ, బ్లూటూత్,

ధర అంచనా రూ.21,000.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot