సులువైన మెసేజింగ్, ఈ - మెయిలింగ్ కొత్త ‘ఎల్‌జీ బీఎకాన్’తో.....

Posted By: Prashanth

సులువైన మెసేజింగ్, ఈ - మెయిలింగ్ కొత్త ‘ఎల్‌జీ బీఎకాన్’తో.....

 

అంతర్జాతీయ స్మార్ట్ ఫోన్ల తయారీదారు ఎల్‌జీ ( LG) ‘బీఎకాన్’(Beacon) వర్షన్ లో సరికొత్త స్మార్ట్ ఫోన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ఈ మొబైల్‌లో నిక్షిప్తంచ చేసిన క్వర్టీ (QWERTY) కీప్యాడ్ సులువైన మెసేజింగ్ మరియు ఈ - మెయిలింగ్ కు దోహదపడుతుంది. బిజినెస్ ప్రొఫెషనల్స్‌కు ఈ ఫోన్ మరింత ఉపయుక్తంగా నిలుస్తుంది....

ఫీచర్లు:

ఫోన్ చుట్టు కొలతలు (103 mm x 53 mm x 17 mm), బరువు 124 గ్రాములు, బ్లాక్ ఫినిష్, 2.8 అంగుళాల డిస్‌ప్లే, టచ్ స్ర్కీన్ సౌలభ్యత, రిసల్యూషన్ 240 x 400 పిక్సల్స్, 1.3 మెగా పిక్సల్ కెమెరా, సీడీఎమ్ఏ ఫోన్ సపోర్ట్ (ఫ్రీక్వెన్సీస్ 800, 1700/2100 , 1900) , క్వర్టీ కీప్యాడ్, స్లైడర్ డిజైన్, బ్లూటూత్, యూఎస్బీ కనెక్టువిటీ, ఇంటర్నల్ మెమరీ 90 ఎంబీ, మైక్రో ఎస్డీ టైప్ మెమరీ కార్డ్ సౌకర్యంతో మెమరీ జీబిని 16కు పెంచుకోవచ్చు, పటిష్ట 1000mAh బ్యాటరీ, బ్యాకప్ 480 గంటల స్టాండ్ బై టైమ్, 6 గంటల టాక్ టైమ్, ధర రూ.4,000 పై చిలుకు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot