స్మార్ట్‌ఫోన్ లైటింగ్‌తో కళ్లకు ఒత్తిడే

ఓ సర్వే ప్రకారం సగటు స్మార్ట్‌ఫోన్ యూజర్ రోజు మొత్తం మీద 150 సార్లు తన ఫోన్ స్ర్కీన్ వైపు చూస్తాడట. స్మార్ట్‌ఫోన్ స్ర్కీన్‌లను అస్తమానం చూస్తూ ఉండటం వల్ల కళ్లు మరింత ఒత్తిడిని ఎదుర్కొవల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. టీవీ తెరలతో మొదలైన డిజిటల్ స్ర్కీన్‌ల ప్రస్థానం క్రమక్రమంగా ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు, టాబ్లెట్‌లు, స్మార్ట్‌ఫోన్‌ల పరిమాణలలో విస్తరించేసింది. స్మార్ట్‌ఫోన్ వెళుతురు కారణంగా సంభవించే కంటి ఒత్తిడికి దూరంగా ఉండేందుకు సలువునే సూచనలు..

సంచలనం రేపుతోన్న నోకియా 3310 కాన్సెప్ట్ వీడియో

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

టిప్ 1

ఫోన్ డిస్‌ప్లే బ్రైట్నెస్‌ను, పరిస్థితులకు అనుగుణంగా అడ్జస్ట్ చేసుకోవటం ద్వారా కంటి ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. కాంతికి అనుగుణంగా ఫోన్ బ్రైట్నెస్‌ను అడ్జస్ట్ చేసే యాప్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.

టిప్ 2

స్మార్ట్‌ఫోన్‌ను దూరంగా ఉంచి చూడటం మొదలు పెట్టండి. ఫోన్ తెరకు మీ కంటికి కనీసం 15 అంగుళాల దూరమైనా ఉండేలా చూసుకోండి.

టిప్ 3

స్ర్కీన్ ముందు నిరంతరాయంగా పనిచేస్తున్న సమయంలో ప్రతి 20 నిమిషాలకు ఒకసారి బ్రేక్ తీసుకోండి. తరచూ కళ్లను బ్లింక్ చేయటం వల్ల కంటి ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.

టిప్ 4

స్మార్ట్‌ఫోన్‌ను సుధీర్ఘంగా వినియోగించాల్సి వస్తే రీడింగ్ గ్లాస్‌‌ను దరించండి. లేని పక్షంలో మీ మొబైల్‌కు యాంటీ గ్లేర్ కోటింగ్స్‌ను వేయించండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Easy Ways to Save Your Eyes From Smartphone Strain. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot