చిన్నారుల కోసం ఫోన్, ఇండియాలో మొదటిసారిగా..
చిన్నపిల్లల కోసమే మార్కెట్లోకి ప్రత్యేకంగా ఓ ఫోన్ వచ్చింది. ఇనోవస్ ఎంటర్‌ప్రైజెస్ అనే కంపెనీ కేవలం చిన్నారులను దృష్టిలో పెట్టుకుని ఈజీఫోన్ స్టార్ పేరిట ఓ ఫోన్‌ను విడుదల చేసింది.
చిన్నపిల్లల కోసమే మార్కెట్లోకి ప్రత్యేకంగా ఓ ఫోన్ వచ్చింది. ఇనోవస్ ఎంటర్‌ప్రైజెస్ అనే కంపెనీ కేవలం చిన్నారులను దృష్టిలో పెట్టుకుని ఈజీఫోన్ స్టార్ పేరిట ఓ ఫోన్‌ను విడుదల చేసింది. కాగా చిన్నారుల కోసం భారత్‌లో విడుదలైన మొదటి ఫోన్ ఇదే కావడం విశేషం. కాగా ఈ ఫోన్‌లో కేవలం నిర్దిష్టమైన ఫోన్ నంబర్లను మాత్రమే సేవ్ చేసుకునే సదుపాయం కల్పించారు. తల్లిదండ్రులు ఈ ఫోన్‌లో సేవ్ చేసిన కాంటాక్ట్‌లకే చిన్నారులు ఫోన్ చేసుకోగలుగుతారు. అయితే ఈజీఫోన్ స్టార్ ఫోన్‌లో ఇంటర్నెట్ సదుపాయం లేదు.

జీపీఎస్‌ను ఏర్పాటు..
ఈ ఫోన్ లో జీపీఎస్‌ను ఏర్పాటు చేశారు. దీని వల్ల తల్లిదండ్రులు తమ పిల్లలను ట్రాక్ చేయవచ్చు. ఈ ఫోన్‌లో ఎస్‌వోఎస్ కీ ని ఏర్పాటు చేశారు.

కేర్ టచ్ అనే స..దుపాయాన్ని
ఇందులో కేర్ టచ్ అనే సదుపాయాన్ని కల్పించారు. దీని వల్ల ఫోన్‌లో ఒకసారి సెట్టింగ్స్ చేస్తే మళ్లీ వాటిని మార్చడం కుదరదు.

అలారం, రిమైండర్స్
ఇక ఈ ఫోన్‌లో అలారం, రిమైండర్స్ పెట్టుకునే అవకాశం కల్పించారు. దీనివల్ల పిల్లలు తాము నిర్దిష్టమైన సమయంలో చేయాల్సిన పనిని రిమైండర్ ద్వారా గుర్తు పెట్టుకోవచ్చు.

ధర
ఈ ఫోన్ 5 కలర్ వేరియెంట్లలో రూ.3,490 ధరకు వినియోగదారులకు లభిస్తున్నది.


Click it and Unblock the Notifications