Home
Mobile

ఫోన్ ప్రాసెసర్స్ గురించి పూర్తి సమాచారం..

ప్రాసెసర్ అనేది ఫోన్‌కు గుండెకాయ లాంటిది. మీరు ఫోన్‌లో చేసే ప్రతి పని ఈ ప్రాసెసర్ మీదనే ఆధారపడి ఉంటుంది.

By Sivanjaneyulu Bommu

ప్రముఖ మొబైల్ చిప్‌సెట్‌ల తయారీ కంపెనీ మీడియాటెక్ ప్రాసెసర్ల విభాగంలో కొత్త ఒరవడికి నాంది పలుకుతూ 10 Coreలతో వచ్చే డెకా కోర్ చిప్‌సెట్‌లను ఈ మధ్య మార్కెట్లో లాంచ్ చేసింది.

ఫోన్ ప్రాసెసర్స్ గురించి పూర్తి సమాచారం..

హీలియో ఎక్స్ 20, హీలియో ఎక్స్ 30 వేరియంట్‌లలో అందుబాటులో ఉన్న ఈ ప్రాసెసర్లు వేగవంతమైన ప్రాసెసింగ్‌ను అందిస్తాయనటంలో ఏ మాత్రం సందేహం లేదు. ఈ సరికొత్త చిప్‌సెట్‌లు మరింత ఖరీదైనవి కావటంతో హై-ఎండ్ ఫోన్‌లలో మాత్రమే ఉపయోగించటం జరుగుతోంది.

Read More : 6జీబి ర్యామ్, 128జీబి స్టోరేజ్.. హడలెత్తిస్తున్న నోకియా ఫోన్?

ఫోన్‌కు గుండెకాయ లాంటిది

ఫోన్‌కు గుండెకాయ లాంటిది

ప్రాసెసర్ అనేది ఫోన్‌కు గుండెకాయ లాంటిది. మీరు ఫోన్‌లో చేసే ప్రతి పని ఈ ప్రాసెసర్ మీదనే ఆధారపడి ఉంటుంది. మీరు వేలకువేలు పోసి ఫోన్ కొన్నా కాని ప్రాసెసర్ సరిగా లేదంటే ఆ ఫోన్ సరిగా పనిచేయనట్లే. ఫోన్‌లో ప్రాసెసర్ సామర్థ్యం తక్కువుగా ఉంటే ప్రాసెసింగ్ అనేది చాలా నెమ్మదిగా ఉంటుంది. ఇదే సమయంలో ఒత్తిడి తట్టుకోలేక ఫోన్ తరచూ స్ట్రక్ అవుతుంటుంది. స్మార్ట్ ఫోన్ లలో ఉపయోగించే ప్రాసెసర్లు వాటి పనితీరును ఒకసారి పరిశీలిద్దాం..

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 డ్యుయల్ కోర్ ప్రాసెసర్..?

డ్యుయల్ కోర్ ప్రాసెసర్..?

డ్యుయల్ కోర్ ప్రాసెసర్‌తో వచ్చే సీపీయూలో ఒక్కో ప్రాసెసర్ రెండేసి కోర్‌లను కలిగి ఉంటుంది. ఈ రెండు ప్రాసెసర్లు ఒకదానితో మరొకొటి సింగిల్ సర్క్యూట్‌లో అనుసంధానమై పనులను చక్కబెడుతుంటాయి.

 క్వాడ్-కోర్ ప్రాసెసర్..?

క్వాడ్-కోర్ ప్రాసెసర్..?

క్వాడ్-కోర్ ప్రాసెసర్‌తో వచ్చే చిప్‌‌సెట్‌లో మొత్తం నాలుగు కోర్‌లు ఉంటాయి. ఇవి డేటాను రీడ్ చేస్తూ స్వతంత్రంగా తమ పనులను చక్కబెడుతుంటాయి. ఒక్కో కోర్ ఒక్కో విభాగాన్ని చూసుకుంటుంటుంది. క్వాడ్ కోర్ ప్రాసెసర్ లలో నిక్షప్తం చేయబడే ప్రతీ కోర్ ఫోన్ నిర్ధేశించిన ఆదేశాలను పూచా తప్పకుండా అమలు చేస్తూ సమాంతర ప్రాసెసింగ్‌ను చేపడతాయి.

హెక్సా-కోర్ ప్రాసెసర్..?

హెక్సా-కోర్ ప్రాసెసర్..?

హెక్సా-కోర్ ప్రాసెసర్‌తో వచ్చే చిప్‌‌సెట్‌లో మొత్తం 6 కోర్‌లు నిక్షిప్తమై ఉంటాయి. డ్యుయల్ కోర్, క్వాడ్ కోర్ ప్రాసెసర్‌లతో పోలిస్తే హెక్సాకోర్ ప్రాసెసర్లు మరింత వేగంగా స్పందించగలవు. ఈ చిప్‌సెట్‌లలో ఓ క్వాడ్-కోర్ ప్రాసెసర్‌తో పాటు డ్యుయల్ కోర్ ప్రాసెసర్‌ను నిక్షిప్తం చేయటం జరుగుతుంది.

ఆక్టా-కోర్ ప్రాసెసర్..?

ఆక్టా-కోర్ ప్రాసెసర్..?

ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో వచ్చే చిప్‌‌సెట్‌లో మొత్తం 8 కోర్‌లు నిక్షిప్తమై ఉంటాయి. క్వాడ్‌కోర్ ప్రాసెసర్‌లతో పోలిస్తే 200% వేగంతో ఇవి స్పందిస్తాయి. ఆక్టా కోర్ చిప్‌సెట్‌లలో రెండు క్వాడ్-కోర్ ప్రాసెసర్‌లను ఉపయోగించటం జరుగుతుంది. ప్రాసెసర్‌లలో నిక్షప్తం చేయబడే ప్రతీ కోర్ ఫోన్ నిర్ధేశించిన ఆదేశాలను పూచా తప్పకుండా అమలు చేస్తూ సిస్టం వేగాన్ని మరింతగా పెంచుతాయి.

డెకా-కోర్ ప్రాసెసర్..?

డెకా-కోర్ ప్రాసెసర్..?

డెకా-కోర్ ప్రాసెసర్‌తో వచ్చే చిప్‌‌సెట్‌లో మొత్తం 10 కోర్‌లు నిక్షిప్తమై ఉంటాయి. ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో పోలిస్తే మరింత వేగంగా ఈ ప్రాసెసర్ స్పందిచగలదు. డెకా-కోర్ ప్రాసెసర్‌ మరింత ఖరీదైనది కావటంతో పలు హై-ఎండ్ ఫోన్‌లలో మాత్రమే వీటిని అమర్చటం జరుగుతోంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Best Mobiles in India

English summary
Are Deca-Core Processors Better Than Quad-Core and Octa-Core Processors? Let's Find Out. Read More in Telugu Gizbot..
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X