ఎకనామిక్ స్మార్ట్‌పోన్ నోకియా సి7

Posted By: Staff

ఎకనామిక్ స్మార్ట్‌పోన్ నోకియా సి7

నోకియా భారతదేశంలో ఈ పేరు తెలియని మొబైల్ కస్టమర్ ఉండపోవచ్చు. భారతదేశం సామాన్యుడి మనసులోకి అంతలా చోచ్చుకుపోయింది. నోకియా అంతలా భారతదేశంలో క్లిక్ అవ్వడానికి కారణాలు. ఒకటి బ్యాటరీ బ్యాక్ అప్. రెండవది నోకియా మొబైల్ ఫోన్స్ ఎక్కువగా మద్యతరగతి కుటుంబాలను దృష్టిలో పెట్టుకోని రూపోందించడమే. వీటితో పాటు అన్ని రకాల వర్గాల వారికి సంబంధించి మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేస్తుంది. అందుకే ఇండియన్ మొబైల్ మార్కెట్లో నోకియాకు ఉన్న స్ధానం ప్రత్యేకం. దీనితోపాటు దేశం మొత్తం మీద ఎక్కువ కస్టమర్స్‌ని సంపాదించుకోవడమే కాకుండా సర్వీస్, సేల్స్‌లో కూడా ఉత్తమమైన సేవలను అందిస్తుంది.

ప్రస్తుతం మొబైల్ మార్కెట్లో ఉన్న పోటీ వాతావరణాన్ని తట్టుకోని నిలబడేందుకు నోకియా ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తులను విడుదల చేస్తుంది. అందులో భాగంగా నోకియా కొత్త స్మార్ట్ ఫోన్ నోకియా సి7ని మార్కెట్లోకి విడుదల చేస్తుంది. నోకియా విడుదల చేస్తున్నటువంటి ఈ స్మార్ట్ ఫోన్ మాస్ జనాలను దృష్టిలో పెట్టుకోని విడుదల చేయడం జరుగుతుంది. ఇక నోకియా సి7 ఫీచర్స్ విషయానికి వస్తే 3.5 ఇంచ్ AMOLED కెపాసిటివ్ టచ్ స్క్రీన్ సైజుని కలిగి ఉంటుంది. AMOLED టచ్ స్క్రీన్ వల్ల ఎండలో ఉన్న కూడా స్క్రీన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది.

ఇక మార్కెట్లో ప్రస్తుతం ఉన్నటువంటి అన్ని రకాలైన మీడియా ఫార్మెట్స్‌(MP3, MP4, WMV)ని ఇది సపోర్ట్ చేస్తుంది. మొబైల్‌లోకి ఏమైనా సాంగ్స్, వీడియోస్‌ని పోందుపరచాలనుకుంటే 3.5mm ఆడియో జాక్ ద్వారా మీ పర్సనల్ కంప్యూటర్‌కి కనెక్ట్ చేసి వాటిని మీ మొబైల్‌లో పోందుపరచుకోవచ్చు. వీడియో రికార్డింగ్ కోసం ఇందులో 8మెగా ఫిక్సల్ కెమెరా వెనుక భాగాన ఉంటుంది. దీని ద్వారా మీరు చక్కని వీడియోస్‌ని తీయవచ్చు. ఇక ముందు భాగాన విజిఎ కెమెరా ఉంటుంది. ఇక మొమొరీని ఎక్కువగా ఉపయోగించుకునేందుకు ఇందులో మైక్రో ఎస్‌డి కార్డ్ ద్వారా 32జిబి వరకు విస్తరించుకోవచ్చు.

ఇక కనెక్టివిటీ విషయంలో ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న లెటేస్ట్ టెక్నాలజీలు అయిన బ్లూటూత్, వై-పై, యుఎస్‌బి పిసి సింక్ లాంటి వాటిని సపోర్ట్ చేస్తుంది. అన్నిరకాలైన ఫీచర్స్ ఉన్నటువంటి నోకియా సి7 ధర కేవలం రూ 16500.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting