నోకియా సామాన్య భారతీయుడి బడ్జెట్ మొబైల్స్: నోకియా సి2-03, సి2-06

నోకియా సి2-03, సి3-06 రెండు మొబైల్స్ కూడా టచ్ ఫీచర్‌ని కలిగి ఉండి డిజైన్ విషయానికి వస్తే చాలా అందంగా రూపోందించబడ్డవి. ఇక స్క్రీన్ విషయానికి వస్తే రెండు కూడా 2.6ఇంచ్ స్క్రీన్ సైజు డిప్లే కలిగి ఉండి ఫిజికల్ కీప్యాడ్‌ని కలిగి ఉన్నాయి. నోకియా కంపెనీ నుండి వచ్చినటువంటి మొట్టమొదటి టచ్ ఫోన్స్ మాత్రమే కాకుండా రెండు సిమ్‌లు వినియోగించే విధంగా రూపోందించడం జరిగింది. ఇది మాత్రమే కాకుండా ఈ రెండు ఫోన్స్‌లలో కూడా నోకియా ఈజీ స్వాప్ సిమ్ ఎక్సేంజ్ ఫీచర్ కూడా ఉండడం వీటికి కలసివచ్చే అంశం.
ఈ రెండు కూడా మల్టీమీడియా(మ్యాజిక్ ప్లేయర్, వీడియా ప్లేయర్, ఆడియో రికార్డింగ్, వీడియో రికార్డింగ్)ని సపోర్టు చేస్తాయి. మ్యూజిక్ ఎక్స్ పీరియన్స్‌ని ఎంజాయ్ చేయ్యడానికి ఇందులో యఫ్‌ఎమ్ రేడియో, మల్టీ ఫార్మెట్ మీడియా సపోర్ట్ రింగ్ టోన్స్ తో పాటు, 3.5mm ఆడియో జాక్, హెడ్ ఫోన్స్ కూడా లభించనున్నాయి.
మీడియా ఫైల్ ఫార్మెట్ అయినటువంటి MP3, WMV, AVI, హైడెఫెనేషన్ వీడియో ఫార్మెట్స్ H263, H264 కూడా ఈ రెండు ఫోన్స్ సపోర్ట్ చేస్తాయి.
ఇక కనెక్టవిటీ విషయానికి వస్తే ఈ రెండు ఫోన్స్ కూడా బ్లూటూత్ వర్సన్ 2.1ని సపోర్టు చేస్తాయి. అంతేకాకుండా ఈ రెండింటిని మీ పర్సనల్ కంప్యూటర్‌కి అనుసంధానం చేసి పాటలు, వీడియోలు లాంటివి అప్ లోడ్ చేసుకోవచ్చు. లెటేస్ట్ 2జి ఇంటర్నెట్ యాక్సెస్ టెక్నాలజీస్ అయినటువంటి GPRS, EDGEలను కూడా ఇవి సపోర్ట్ చేస్తాయి. వీటితోపాటు హై స్పీడ్ 3జి, వై-పై టెక్నాలజీని కూడా ఈ రెండు మొబైల్స్ సపోర్టు చేస్తాయి. చివరగా వీటి ఖరీదు విషయానికి వస్తే నోకియా C2-03 ధర కేవలం రూ 4700, నోకియా C2-06 ధర రూ 5000గా నిర్ణయించడమైనదని నోకియా ప్రతినిధి తెలిపారు.


Click it and Unblock the Notifications