4జీ స్పెక్ట్రమ్ కేటాయింపుకు గ్రీన్ సిగ్నల్!!

Posted By: Staff

 4జీ స్పెక్ట్రమ్ కేటాయింపుకు గ్రీన్ సిగ్నల్!!

 

న్యూఢిల్లీ : నాలుగోతరం (4జి) టెలికాం సేవల కోసం అవసరమైన 700 ఎంహెచ్‌జడ్ స్పెక్ట్రమ్‌ను కేటాయించాలని సాధికార మంత్రుల బృందం (ఇజిఒఎం) సోమవారం నిర్ణయంచింది. 4జి స్పెక్ట్రమ్‌కు సంబంధించిన నాలుగు అంశాలు ఈ కమిటీ భేటీలో

పరిశీలనకు వచ్చాయి. వీటిలో మూడు అంశాలు పూర్తిగా పరిష్కారమైనట్లు తెలసింది . ప్రాథమికంగా ఈ అంశాలు 700 ఎంహెచ్‌జడ్ బాండ్‌కు సంబంధించినవి. వీటిని మంత్రుల కమిటీ పరిష్కరించిందని టెలికాం మంత్రి కపిల్ సిబల్ విలేఖరుల సమావేశంలో వెల్లడించారు. 700 ఎంహెచ్‌జడ్ ఎంతో సమర్థ బాండ్. దీనిద్వారా ప్రభుత్వానికి గత ఏడాది 3జి స్పెక్ట్రమ్ అమ్మకాల ద్వారా వచ్చిన రాబడికన్నా ఎక్కువ వస్తుందని ఆయన అన్నారు. 700 స్పెక్ట్రమ్ బాండ్ వెకేట్ చేసేందుకు ఐ అండ్ బి శాఖ అంగీకరించిందని, దీంతో ఈ సమస్యకు పూర్తి పరిష్కారం లభించిందని మంత్రి చెప్పారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot