8 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరాతో జియోనీ ఇలైఫ్ ఇ7!

Posted By:

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ జియోనీ తన ఇలైఫ్ సిరీస్ నుంచి 8 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా సామర్ధ్యం గల ‘ఇలైఫ్ ఇ7' స్మార్ట్‌ఫోన్‌ను అంతర్జాతీయ మార్కెట్లో ఆవిష్కరించింది. ఈ స్మార్ట్ హ్యాండ్‌సెట్ ప్రొఫెషనల్ స్థాయి ఇమేజ్ సెన్సార్ వ్యవస్థను కలిగి డిజిటల్ కెమెరా తరహా ఫోటోగ్రఫీని అందిస్తుంది. ఈ ఫోన్‌లో ఏర్పాటు చేసిన 16 మెగా పిక్సల్ రేర్ ఇంకా 8 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా వ్యవస్థలు అత్యుత్తమ రిస్యూలషన్ క్వాలిటీతో కూడిన ఫోటోలను చిత్రీకరించుకునేందుకు తోడ్పడతాయి.

 8 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరాతో జియోనీ ఇలైఫ్ ఇ7!

జియోనీ ఇలైఫ్ ఇ7 ప్రధాన ఫీచర్లను పరిశీలించినట్లయితే:

5.5 అంగుళాల ఎఫ్‌హెచ్‌డి డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్),
401 పీపీఐ, 3వ తరం జనరేషన్ గొరిల్లా గ్లాస్,
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
2.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
3జీబి ర్యామ్,
16 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్,
2500ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

చైనా మార్కెట్లో డిసెంబర్ 5 నుంచి ఈ జియోనీ ఇలైఫ్ ఇ7 విక్రయాలు ప్రారంభం కానున్నాయి. ఇండియన్ మార్కెట్లో 2014 ఆరంభం నుంచి ఈ ఫోన్ లను విక్రయించనున్నారు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot