Home
Mobile

16000mAh బ్యాటరీతో సరికొత్త స్మార్ట్‌ఫోన్, ఫీచర్లు చూస్తే..

బార్సిలోనాలో జరుగుతున్న మొబైల్‌ వరల్డ్‌ కాంగ్రెస్‌(ఎండబ్ల్యూసీ) 2018లో కొత్త కొత్త వింతలు, దిమ్మతిరిగే టెక్నాలజీతో కంపెనీలు యూజర్లను అలరిస్తున్నాయి.

By Hazarath Aiah

బార్సిలోనాలో జరుగుతున్న మొబైల్‌ వరల్డ్‌ కాంగ్రెస్‌(ఎండబ్ల్యూసీ) 2018లో కొత్త కొత్త వింతలు, దిమ్మతిరిగే టెక్నాలజీతో కంపెనీలు యూజర్లను అలరిస్తున్నాయి. కొత్త కొత్త గాడ్జెట్లను, మొబైల్స్ ను ప్రపంచానికి పరిచయం చేస్తూ ఎండబ్ల్యూసీ ముందుకు దూసుకువెళుతోంది. ఇప్పుడు అదే వరసలో మరో అద్భుతం చోటు చేసుకుంది. దాదాపు 16000 ఎంఏహెచ్‌ బ్యాటరీతో ప్రపంచపు తొలి స్మార్ట్‌ఫోన్‌‌ను ఎలక్ట్రిక్‌ దిగ్గజం ఎనర్జైజర్‌ లైసెన్సు బ్రాండు అవెనిర్‌ మొబైల్స్‌ ఆవిష్కరించింది. ఈ ఈవెంట్లో మొత్తం మూడు రకాల ఫోన్లను కంపెనీ ఆవిష్కరించింది. వాటి పూర్తి వివరాలు మీకోసం.

మూడు ఫోన్లు

మూడు ఫోన్లు

ఎనర్జైజర్‌ లైసెన్సు బ్రాండు అవెనిర్‌ మొబైల్స్‌ ఎండబ్ల్యూసీ వేదికగా ఎనర్జైజర్‌ పవర్‌ మ్యాక్స్‌ పీ16కే ప్రొ, ఎనర్జిజెర్‌ పవర్‌ మ్యాక్స్‌ పీ490ఎస్‌, ఎనర్జిజెర్‌ హార్డ్‌కేస్‌ హెచ్‌590ఎస్‌ అనే పేర్లతో మూడు స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి తీసుకువచ్చింది.

ఎనర్జైజర్‌ పవర్‌ మ్యాక్స్‌ పీ16కే ప్రొ

ఎనర్జైజర్‌ పవర్‌ మ్యాక్స్‌ పీ16కే ప్రొ

ఇందులో ఎనర్జైజర్‌ పవర్‌ మ్యాక్స్‌ పీ16కే ప్రొ స్మార్ట్‌ఫోన్‌కు 16000 ఎంఏహెచ్‌ బ్యాటరీతో దూసుకువచ్చి యూజర్లను షాక్ కు గురిచేసింది. కాగా ఈ స్థాయి బ్యాటరీతో రావడం అనేది చాలా అరుదే..అంతే కాకుండా ప్రపంచంలో తొలి స్మార్ట్‌ఫోన్‌ కూడా ఇదే కావడం విచిత్రం. ఈ ఫోన్లు అతి త్వరలోనే మార్కెట్లోకి వెళ్లే అవకాశం ఉందని కంపెనీ తెలిపింది.

ఎనర్జైజర్‌ పవర్‌ మ్యాక్స్‌ పీ16కే ప్రొ స్పెషిఫికేషన్లు

ఎనర్జైజర్‌ పవర్‌ మ్యాక్స్‌ పీ16కే ప్రొ స్పెషిఫికేషన్లు

ఆం‍డ్రాయిడ్‌ 8.0 ఓరియా
5.99 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ ఐపీఎస్‌ ఎల్‌సీడీ డిస్‌ప్లే
2160 x 1080 pixels resolution, aspect ratio of 18:9
ఆక్టా-కోర్‌ మీడియాటెక్‌ హిలియో పీ25 ఎస్‌ఓసీ
6‍ జీబీ ర్యామ్‌, 128 జీబీ ఇన్‌బిల్ట్‌ స్టోరేజ్‌
16 ఎంపీ, 13 ఎంపీతో డ్యూయల్‌ రియర్‌ కెమెరా
13 ఎంపీ, 5 ఎంపీతో డ్యూయల్‌ ఫ్రంట్‌ కెమెరా
ఫింగర్‌ప్రింట్‌ సెన్సార్‌
భారీ బ్యాటరీతో ఈ హ్యాండ్‌సెట్‌ బరువు 350 గ్రాములు

ఎనర్జైజర్‌ పవర్‌ మ్యాక్స్‌ పీ490ఎస్‌ స్పెషిఫికేషన్లు

ఎనర్జైజర్‌ పవర్‌ మ్యాక్స్‌ పీ490ఎస్‌ స్పెషిఫికేషన్లు

ఆండ్రాయిడ్‌ ఓరియో
4.95 అంగుళాల డిస్‌ప్లే
క్వాడ్‌-కోర్‌ మీడియాటెక్‌ ఎంటీ6739 ఎస్‌ఓసీ
2జీబీ ర్యామ్‌, 16జీబీ ఆన్‌బోర్డ్‌ స్టోరేజ్‌
32 జీబీ వరకే విస్తరణ మెమరీ
8 ఎంపీ, 0.3 ఎంపీతో డ్యూయల్‌ బ్యాక్‌ కెమెరా
5 ఎంపీ, 0.3 ఎంపీతో డ్యూయల్‌ ఫ్రంట్‌ కెమెరా
4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ
ఫింగర్‌ప్రింట్‌ సెన్సార్‌

Best Mobiles in India

English summary
Energizer Power Max P16K Pro With 16000mAh Battery Announced Ahead of MWC 2018: Specifications, Features More News at Gizbot telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X