టాటా డొకొమో స్పెషల్ ప్యాక్.. ‘20 గంటల ఫ్రీ కాలింగ్’!!

Posted By: Super

టాటా డొకొమో స్పెషల్ ప్యాక్.. ‘20 గంటల ఫ్రీ కాలింగ్’!!

 

టెలికాం ప్రొవైడర్ టాటా డొకొమా ఆంధ్రా ప్రీపెయిడ్ కస్లమర్లు కోసం 20గంటల అపరిమిత కాల్ ఆఫర్‌ను అందుబాటులోకి తెచ్చింది. డొకొమా రూ.123 విలువ గల రీఛార్జ్ పై రోజుకు 20 గంటల పాటు ఉచితంగా కాల్స్ చేసుకోవచ్చు. ఈ ప్యాక్ వాలిడిటీ 30 రోజులు.

In English

ఈ రీఛార్జ్ పై స్థానిక టాటా డొకొమో సీడీఎంఏ, జీఎస్‌ఎం, వర్జిన్ మొబైల్, టీ24 కస్టమర్లు రాత్రి 10 నుంచి మరసటి రోజు సాయంత్రం 6 వరకు ఇదే నెట్‌వర్క్‌లో ఉచితంగా కాల్స్ చేసుకోవచ్చు. అలాగే సాయంత్రం 6 నుంచి రాత్రి 10 మధ్య చేసే కాల్స్‌కు 6 సెకన్లకు ఒక పైసా మాత్రమే చార్జీ చేస్తారు.

వొడాఫోన్ బంపర్ టారిఫ్:

రాష్ట్ర వినియోగదారుల కోసం వొడాఫోన్ బంపర్ టారిఫ్ ను అందుదుబాటులోకి తెచ్చింది. ఎఫ్‌ఆర్‌సీ11, ఎఫ్‌ఆర్‌సీ57 పేరుతో రెండు రీచార్జ్ ప్లాన్లను ఈ లీడింగ్ టెలికం ప్రొవైడర్ ప్రవేశపెట్టింది. ఎఫ్‌ఆర్‌సీ11 కింద రూ.11తో తొలి రీచార్జ్, రూ.19తో రెండో రీచార్జ్ చేయిస్తే రూ. 60 విలువ చేసే టాక్‌టైమ్ లభిస్తుంది. నాలుగు నెలల పాటు (ప్రతి నెలా రూ. 15) ఇది వర్తిస్తుంది. అలాగే, 15 రోజుల పాటు 50 లోకల్/నేషనల్ ఎస్‌ఎంఎస్‌లు వినియోగించుకోవచ్చు. మరోవైపు, ఎఫ్‌ఆర్‌సీ57 కింద రూ. 57తో తొలి రీచార్జ్, రూ.3తో మలి రీచార్జ్ చేయిస్తే రూ.60 విలువ చేసే టాక్‌టైమ్ లభిస్తుంది. 3 నెలల పాటు (నెలకు రూ. 20) ఇది వర్తిస్తుంది. లోకల్ కాల్స్‌కి రెండు సెకన్లకు 1 పైసా చొప్పున ప్రత్యేక టారిఫ్ ఉంటుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot