ఈ ఫోన్ ధర రూ. 13 వేలు తగ్గింది

ఆండీ రూబిన్ తొలి స్మార్ట్‌ఫోన్‌ ఎసెన్షియల్‌పై ధరను భారీగా తగ్గించారు. ఇంతకుముందు 699 డాలర్లుగా(సుమారు రూ.45,460గా) ఉన్నది. తగ్గింపులో భాగంగా ఈ ఫోన్ 499 డాలర్లకు(సుమారు రూ.32,457కు) లభిస్తోంది.

By Hazarath
|

ఆండీ రూబిన్ తొలి స్మార్ట్‌ఫోన్‌ ఎసెన్షియల్‌పై ధరను భారీగా తగ్గించారు. గూగుల్ నుంచి వచ్చిన గూగుల్‌ పిక్సెల్‌ 2, గూగుల్‌ పిక్సెల్‌ 2 ఎక్స్‌ఎల్‌ స్మార్ట్‌ఫోన్ల షిప్పింగ్‌ ప్రారంభమైన నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని కంపెనీ తీసుకుంది. ఈ ఫోన్ ఇంతకుముందు 699 డాలర్లుగా(సుమారు రూ.45,460గా) ఉన్నది. తగ్గింపులో భాగంగా ఈ ఫోన్ 499 డాలర్లకు(సుమారు రూ.32,457కు) లభిస్తోంది. అంటే ఈ ఫోన్ దాదాపు రూ. 13 వేలు తగ్గింది.

పేలిన జియో ఫోన్ ఫోన్, కంపెనీ దిమ్మతిరిగే సమాధానం !పేలిన జియో ఫోన్ ఫోన్, కంపెనీ దిమ్మతిరిగే సమాధానం !

Essential Phone

ఈ తగ్గిన ఫోన్ కావాలనుకున్నవారు ఎసెన్షియల్‌.కామ్‌లో కొనుగోలు చేయవచ్చు. ఈ తగ్గింపు ఆపిల్‌ ఐఫోన్‌ ఎక్స్‌, గూగుల్‌ పిక్సెల్‌ 2 ఎక్స్‌ఎల్‌లను కొనుగోలు చేయాలనుకుంటున్న కస్టమర్లను ఆకట్టుకోవడంలో సాయపడుతుందని కంపెనీ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌, ప్రెసిడెంట్‌ నికోలో డే మాసి పేర్కొన్నారు. కాగా ఐఫోన్‌ ఎక్స్‌ ధర 999 డాలర్లు, గూగుల్‌ పిక్సెల్‌ 2 ఎక్స్‌ఎల్‌ ధర 849 డాలర్లు.

ఇక ఫోన్ బిల్లుల బాదుడు షురూ..ఇక ఫోన్ బిల్లుల బాదుడు షురూ..

Essential Phone

ఐఫోన్‌ ఎక్స్‌ నవంబర్‌ 3 నుంచి విక్రయానికి వస్తుండగా.. గూగుల్‌ పిక్సెల్‌ 2 ఎక్స్‌ఎల్‌ అమ్మకాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. అయితే ఎసెన్షియల్‌ స్మార్ట్‌ఫోన్‌ విక్రయాల పరంగా అంత ఆశించిన రీతిలో లేదని, గత నెలలో కేవలం 5000 యూనిట్లు మాత్రమే విక్రమమైనట్టు బేస్ట్రీట్‌ రీసెర్చ్‌ తెలిపింది.

లేటెస్ట్‌గా వచ్చిన బెస్ట్ మోటో ఫోన్లపై ఓ లుక్కేయండిలేటెస్ట్‌గా వచ్చిన బెస్ట్ మోటో ఫోన్లపై ఓ లుక్కేయండి

Essential Phone

ఎసెన్షియల్‌ స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్లు
ఇంటెలిజెంట్‌ హోమ్‌ స్మార్ట్‌ స్పీకర్‌, 360 కెమెరా ఈ మొబైల్‌ ప్రత్యేకతలు
5.7 అంగుళాల ఎడ్జ్‌ టు ఎడ్జ్‌ డిస్‌ప్లే
3040 ఎంఏహెచ్‌ బ్యాటరీ
వెనుకవైపు రెండు 13 ఎంపీ కెమెరాలు
ముందువైపు 8 ఎంపీ కెమెరా
టైప్‌సీ యూఎస్‌బీ పోర్టు
1.9 జీహెచ్‌జెడ్‌ ఆక్టాకోర్‌ ప్రోసెసర్
4 జీబీ ర్యామ్‌, 128 జీబీ అంతర్గత మెమొరీ
4కె రిజల్యూషన్‌లో వీడియోలు చిత్రీకరించొచ్చు
టైటానియం, సెరామిక్‌ మెటీరియల్‌తో ఈ మొబైల్‌ను రూపొందించారు.

Best Mobiles in India

English summary
Essential Phone Price Slashed From $699 to $499 more news at Gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X