Apple ఫ్యాన్స్‌కు పండగే పండగ.. పోర్టుల్లేని ఐఫోన్‌కు గ్రీన్ సిగ్నల్.. ఆపిల్ కల నెరవేరే దిశగా!
Portless iPhones: చాలా కాలంగా పోర్టులు లేని ఐఫోన్‌ను తయారు చేయాలని కలలు కంటున్న ఆపిల్‌కు శుభవార్త అందింది. ఆ విషయంలో యూరోపియన్ యూనియన్ (EU) మాత్రం ఆపిల్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. యూఎస్‌బీ టైప్ సీ పోర్టు లేని ఐఫోన్లు చట్టబద్ధంగ రిలీజ్ చేసుకోవచ్చని చెప్పేసింది. ఈయూ ఇంతకుముందు కామన్ ఛార్జర్ రూల్ పెట్టినా, పోర్టుల్లేని ఐఫోన్లకు మాత్రం ఏం అడ్డు చెప్పలేదు.
దీంతో ఆపిల్ సంతా చాలా సంతోషిస్తుంది. ఎందుకంటే పోర్టుల్లేకుండా స్లిమ్‌గా ఐఫోన్ తయారు చేయాలని ఆపిల్ ఎప్పటినుంచో కలలు కంటోంది. EU అందుకు పచ్చ జెండా ఊపడంతో ఆపిల్ కల నెరవేరబోతోంది. ఇది ఆ సంస్థకే కాదు సన్నగా ఉండే ఐఫోన్ కోసం చూస్తున్న వారందరికీ ఇది పెద్ద శుభవార్త.

* అవి ఈయూ నిబంధనలను ఉల్లంఘించవు..
ఎలక్ట్రానిక్ వ్యర్థాలను తగ్గించేందుకు ఈయూ 'కామన్ ఛార్జర్ డైరెక్టివ్' తీసుకొచ్చింది. దీని ప్రకారం వైర్డ్ ఛార్జింగ్ ఉన్న అన్ని డివైజ్‌లకు ఒకే ఛార్జింగ్ స్టాండర్డ్ (యూఎస్‌బీ-సీ) ఉండాలి. ఈ చట్టం వల్ల ఆపిల్ తన సొంత లైట్నింగ్ పోర్టును తీసేసి, ఐఫోన్ 15 సిరీస్‌లో యూఎస్‌బీ-సీ పోర్టును పెట్టాల్సి వచ్చింది.
అయితే, ఈ ఆదేశం కేవలం వైర్డ్ ఛార్జింగ్‌కు మాత్రమే వర్తిస్తుంది. ఈయూ ప్రెస్ ఆఫీసర్ ఫెడెరికా మిక్కోలి ప్రకారం, ఒక డివైజ్ కేవలం వైర్‌లెస్ ఛార్జింగ్‌ను మాత్రమే ఉపయోగిస్తే, దానికి యూఎస్‌బీ-సీ పోర్టు అవసరం లేదు. ఈ క్లారిటీతో ఆపిల్ యూరోపియన్ యూనియన్ నిబంధనలను ఉల్లంఘించకుండానే పోర్టులు లేని ఐఫోన్‌ను విడుదల చేయవచ్చు.
* పోర్టులు లేకుండా ఐఫోన్ 17 ఎయిర్..
గతంలో వచ్చిన వార్తల ప్రకారం, ఆపిల్ కంపెనీ ఐఫోన్ 17 ఎయిర్‌ను మొట్టమొదటి పోర్టులు లేని ఫోన్‌గా తీసుకురావాలని ప్లాన్ చేసింది. కానీ, ఈయూ చట్టాలకు విరుద్ధంగా ఉంటుందేమోనని ఆ ఆలోచనను విరమించుకుంది. అందుకే, రాబోయే ఐఫోన్ 17 ఎయిర్‌లో కూడా యూఎస్‌బీ-సీ పోర్టు ఉంటుందని భావిస్తున్నారు.
కానీ, ఇప్పుడు ఈయూ నుంచి వచ్చిన తాజా క్లారిటీతో భవిష్యత్తులో వచ్చే ఐఫోన్లు పూర్తిగా వైర్‌లెస్‌గా ఉండే అవకాశం ఉంది. పోర్టులు లేని ఐఫోన్ పూర్తిగా మ్యాగ్‌సేఫ్ వైర్‌లెస్ ఛార్జింగ్, క్లౌడ్ డేటా ట్రాన్స్‌ఫర్‌పై ఆధారపడుతుంది. దీనివల్ల ఫిజికల్ పోర్టులు ఉండవు. ఫోన్ చూడటానికి చాలా సన్నగా ఉంటుంది,
నీళ్లు, దుమ్ము వెళ్లకుండా మరింత సురక్షితంగా ఉంటుంది. కొంతమంది యూజర్లకు వైర్డ్ ఛార్జింగ్ లేకపోవడం కాస్త ఇబ్బందిగా అనిపించవచ్చు, కానీ ఆపిల్ మాత్రం వైర్‌లెస్ ఫ్యూచర్‌ను ప్రోత్సహిస్తోంది. మరి వీళ్లు చేస్తున్న ఈ ప్రయోగం హిట్ అవుతుందో లేదో చూడాలి. ఒకవేళ ఈ రకం ఫోన్లు హిట్ కాకపోతే ఆ ఐడియాను విరమించుకోవచ్చు.
ఐఫోన్ 17 ఎయిర్‌కు యూఎస్‌బీ-సీ పోర్టు ఉన్నా, పూర్తిగా పోర్టులు లేని ఐఫోన్ వచ్చే ఏడాదిలోపే వచ్చే అవకాశం ఉంది. పోర్టులు లేకుండా కేవలం గ్లాస్, మెటల్‌తో ఒక అద్భుతమైన డివైజ్‌ను తయారు చేయాలనే ఆపిల్ కల ఇప్పుడు ఈయూ చట్టాల ప్రకారం నిజం కావచ్చు. మ్యాగ్‌సేఫ్, క్లౌడ్ టెక్నాలజీతో వైర్‌లెస్ ఐఫోన్ అనుభవం కోసం ఇది ఒక పెద్ద ముందడుగు అని చెప్పవచ్చు.


Click it and Unblock the Notifications








