త్వరలో పానాసోనిక్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్

By Super
|
Panasonic Android

కొంత కాలం విరామం తీసుకున్న తర్వాత ప్రముఖ ఎలక్ట్రానిక్స్ ఉపయోగకరణాల తయారీ సంస్ద పానాసోనిక్ ఆసియా, యూరోపియన్ మార్కెట్లోకి కొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్‌ని విడుదల చేయనుంది. ప్రస్తుతానికి పానాసోనిక్ నుండి ఎటువంటి అధికారిక సమాచారం లేకపోయినప్పటికీ 2012 సంవత్సరం మొదట్లో పానాసోనిక్ ఆండ్రాయిడ్ ఫోన్స్ మార్కెట్లోకి విడుదలవుతాయని మొబైల్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 2015 సంవత్సరం కల్లా పానాసోనిక్ మొబైల్ రంగంలో సాధ్యమైనన్ని మొబైల్ ఫోన్స్‌ని ప్రవేశపెట్టనుంది.

7.5మిలియన్ మొబైల్ ఫోన్స్‌ని మార్కెట్లోకి ప్రవేశపెట్టాలని యోచన. పానాసోనిక్ విడుదల చేయనున్న మొదటి ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ 'పానాసోనిక్ పి-07సి'. 4.3 ఇంచ్ కెపాసిటివ్ టచ్ స్క్రీన్ డిస్ ప్లే దీని సొంతం. మొబైల్ వెనుక భాగాన ఉన్న 5.1 మెగా ఫిక్సల్ కెమెరా సహాయంతో అందమైన ఫోటోలను తీయవచ్చు. కమ్యూనికేషన్, కనెక్టివిటీ ఫీచర్స్ విషయానికి వస్తే బ్లూటూత్, వై - పైలను సపోర్ట్ చేస్తుంది.

మొబైల్ పవర్‌పుల్ బ్యాటరీ బ్యాక్‌అప్‌ని అందిస్తుంది. టాక్ టైమ్ 300 నిమిషాలు రాగా, స్టాండ్ బై టైమ్ 340 గంటలుగా వస్తుందని భావిస్తున్నారు. ఇప్పటికే ఉత్తర అమెరికాలో మంచి బిజినెస్‌ని సాధించిన ఈ మొబైల్ త్వరలో ఆసియా, యూరప్ దేశాలలో విడుదల కానుంది. ఐతే ఈ స్మార్ట్ ఫోన్ పూర్తిగా జిఎస్‌ఎమ్, సిడిఎమ్ఎ నెట్ వర్క్‌ని సపోర్ట్ చేస్తుందా అన్న విషయాన్ని మాత్రం ప్రకటించ లేదు. 'పానాసోనిక్ పి-07సి' మొబైల్ ధరని కూడా మార్కెట్లో ఎక్కడా పానాసోనిక్ అధికారకంగా ప్రకటించ లేదు.

పానాసోనిక్ ఇల్యూగా యూ స్మార్ట్‌ఫోన్ (వీడియో రివ్యూ)

<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/AwnkYEgCvOw? feature=player_detailpage" frameborder="0" allowfullscreen></iframe></center>

Best Mobiles in India

English summary
Europe and Asia will see Panasonic Android phones shortly

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X