మీ ఫోన్‌కి Tiny hole చుక్కాని అని తెలుసా,అసలెప్పుడైనా ఈ పదం విన్నారా ?

Written By:

మీరు స్మార్ట్‌ఫోన్ వాడుతున్నారా..అయితే ఓ సారి ఆ ఫోన్‌ను మీరు నిశితంగా పరిశీలించినట్లయితే కెమెరా దగ్గరలో అలాగే ఫ్లాష్ లైట్‌కి మధ్యలో ఓ చిన్న రంధ్రంలాగా కనిపిస్తుంటుంది. ఇంకొన్ని ఫోన్లలో కెమెరాకి ఫ్లాష్ లైటుకి పక్కన ఓ రంధ్రం ఉంటుంది. మరి ఆ రంధ్రం అక్కడ ఎందుకు ఉంది. దాని ఉపయోగాలు ఏంటనేది చాలామందికి తెలియదు. కొంతమందికి తెలిసినా తెలియని వారికి దాని గురించి చెప్పే ప్రయత్నం కూడా చేయరు. ఇంకా పచ్చి నిజం ఏంటంటే ఆ రంధ్రం ఉందన్న సంగతే చాలామంది పట్టించుకోరు. మరి దాన్ని అక్కడ ఎందుకు ఉంచారు. దాని వల్ల ఉపయోగాలేంటి అనే దాని మీద మీకు కొన్ని వివరాణాత్మకమైన అంశాలను అందిస్తున్నాం. ఓ స్మార్ట్ లుక్కేయండి.

మే నెలలో అదిరే ఫీచర్లతో రానున్న కూల్ స్మార్ట్‌ఫోన్లు,సెలక్షన్ మీదే

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Tiny hole

ఐఫోన్ కి అయితే కెమెరా దగ్గరలో అలాగే ఫ్లాష్ లైట్‌కి మధ్యలో ఓ చిన్న రంధ్రంలాగా కనిపిస్తుంటుంది, మోటో ఫోన్లకు ఇతర ఆండ్రాయిడ్ ఫోన్లకు ఇది వాటి పక్కన కనిపిస్తుంది. దీన్ని Tiny hole అని పిలుస్తారు. దీనితో చాలా ఉపయోగాలు ఉన్నాయి. క్లుప్తంగా చెప్పాలంటే ఈ చిన్న రంధ్రం ఫోన్ కి హార్ట్ లాగా పనిచేస్తుంది.

నాయిస్ క్యాన్సిలేషన్

మైక్ అది మాములుగా చిన్న రంధ్రం అని చాలామంది పొరపడుతుంటారు. అయితే అది రంధ్రం కాదు.ఓ చిన్నపాటి మైక్రోఫోన్..ఈ చిన్న పాటి రంధ్రాన్నే నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అంటారు.

బుడ్డ రంధ్రం ఇన్ని పనులు చేస్తుందా..

దీంతో మీరు ఎటువంటి కాల్స్ వినలేరు. అలాగే మాట్లాడలేరు.అయితే మరి అది అక్కడ ఎందుకుంచారనే డౌట్ రావచ్చు. దీని వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి. వాటిని తెలుసుకుంటే ఈ బుడ్డ రంధ్రం ఇన్ని పనులు చేస్తుందా అని ఆశ్చర్యపోతారు. 

ట్రాఫిక్ లో ఉన్నప్పుడు

మీరు అవతలి వ్యక్తితో బయట ట్రాఫిక్ లో మాట్లాడే సమయంలో ఫోన్ డిస్టబెన్స్ వస్తుంది. అటువంటి సమయంలో మీ వాయిస్ అవతలి వారికి సరిగా వినిపించదు.ఇలాంటప్పుడు ఈ రంధ్రం తన పని తాను చేసుకుని మీకు ఎటువంటి అంతరాయం లేకుండా ఫోన్ మాట్లాడుకునే సౌలభ్యాన్ని అందిస్తుంది. 

అవతలి వారికి క్లియర్ వాయిస్

మీరు ట్రాఫిక్ ఉన్న సమయంలో మాట్లాడుతున్నప్పుడు మీ వాయిస్ మాత్రమే అవతలి వారికి క్లియర్ గా వినిపించేలా ఈ మైక్రోఫోన్ తన పని తాను చేస్తుంది. అందుకోసమే ఈ మైక్రోఫోన్ ఏర్పాటు చేశారు. ఈ మైక్ దాని పరిసర ప్రాంతాల్లో ఏమైనా అవరోధాలు ఉంటే వెంటనే తొలగించి స్పష్టమైన వాయిస్ మాత్రమే మీకు అందిస్తుంది. 

మాటలను మాత్రమే..

మీరు ఆ శబ్దాలను గ్రహించకుండా కేవలం మాటలను మాత్రమే వినేలా ఈ మైక్రోఫోన్ మీ ఫోన్ ను రెడీ చేస్తుందన్నమాట. కారు హారన్ సౌండులు అలాగే బైకు శబ్దాలు చాలా తక్కువ స్థాయిలో వినబడేలా ఇది పనిచేస్తుంది. 

వీడియో రికార్డింగ్

అంతే కాకుండా ఈ రంధ్రంతో మరో బెనిఫిట్ కూడా ఉంది. మీరు మీ వీడియో రికార్డింగ్ అలాగే ఆడియో రికార్డింగ్ ను ఎటువంటి అవరోధ శబ్దాలు లేకుండా స్పష్టంగా రికార్డ్ చేసుకోవచ్చు.

మీకు తెలియకుండానే..

మీరు వీడీయో రికార్డింగ్ చేస్తున్పప్పుడు బ్యాక్ గ్రౌండ్ లో ఏమైనా శబ్దాలు ఉంటే వెంటనే వాటిని తొలగించి మీరు కోరుకున్న విధంగా మీకు వీడియోని అందిస్తుంది. అది మీకు తెలియకుండానే జరుగుతుంది.

మూసివేయడం కాని లేక ఏదైనా అడ్డుపెట్టడం లాంటి పనులు

కొన్ని ఫోన్లకు పైభాగంలో కాకుండా వెనుక భాగంలో కెమెరా పక్కన, అలాగే కొన్నింటికి సైడ్ లలో ఇస్తున్నారు. కాబట్టి మీ ఫోన్ కు రంధ్రం ఎటువైపు ఉందో ఓ సారి చూసుకోండి. దాన్ని మీరు మూసివేయడం కాని లేక ఏదైనా అడ్డుపెట్టడం లాంటి పనులు చేయకండి.

రెండింటి మధ్య తేడా..

ఈ సారి కాల్ మాట్లాడే సమయంలో ఆ మైక్ కు ఏదీ అడ్డు పెట్టకుండా మాట్లాడి చూడండి. అప్పుడు మీ వాయిస్ అవరోధాల సమయంలోనూ అవతలి వ్యక్తులకు క్లియర్ గా వినబడుతుంది.అలాగే దాన్ని మూసి వేసి మాట్లాడి చూడండి. రెండింటి మధ్య తేడా మీకు స్పష్టంగా తెలుస్తుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Ever Noticed The Small Hole Next To Your Phone Camera? It’s There For A Really Cool Reason More News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot