నోకియా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ వచ్చేసింది

హెచ్‌ఎమ్‌డి గ్లోబల్ తన మొదటి Nokia ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను ఆదివారం తన అఫీషియల్ వెబ్‌సైట్ ద్వారా ప్రపంచానికి పరిచయం చేసింది. నోకియా 6 పేరుతో లాంచ్ అయిన ఈ మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ తొలత చైనా మార్కెట్లో అందుబాటులో ఉంటుంది.

Read More : స్మార్ట్‌ఫోన్‌కు పెన్‌డ్రైవ్ కనెక్ట్ చేయటం ఎలా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఎక్స్‌క్లూజివ్‌గా..

చైనాకు చెందిన JD.com నోకియా 6 ఫోన్‌లను ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయించబోతోంది. ధర 1699 CNY (మన కరెన్సీలో రూ.16,750).

Nougat ఆపరేటింగ్ సిస్టం

Android Nougat ఆపరేటింగ్ సిస్టం రన్ అవుతున్న ఈ ఫోన్ 5.5 అంగుళాల ఫుల్ హెచ్‌డి (1920x 1080పిక్సల్స్ ) డిస్‌ప్లేతో వస్తుంది.

ఫింగర్ ప్రింట్ స్కానర్‌...

మెటాలిక్ సైడ్స్‌తో వస్తోన్న ఈ ఫోన్ ముందు భాగంలో గుండ్రని దీర్ఘచతురస్రాకార ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను ఏర్పాటు చేసారు.

ఇతర స్పెసిఫికేషన్స్

నోకియా 6 ఫోన్‌కు సంబంధించి ఇతర స్పెసిఫికేషన్స్ పరిశీలించినట్లయితే... Qualcomm Snapdragon 430 సాక్, 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్ 4జీ,

కెమెరా

16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా. (ప్రత్యేకతలు : ఫేస్ డిటెక్షన్ ఆటోఫోస్, డ్యుయల్ టోన్ ఎల్‌ఈడి ఫ్లాష్, )

 

భారత్ సహా ప్రముఖ మార్కెట్లలో..

Foxconn సంస్దచే తయారు చేయబడిన నోకియా 6 ఫోన్‌లకు సంబంధించి మరిన్ని ఫీచర్లు వెల్లడికావల్సి ఉంది. ఫిబ్రవరి 27న నాలుగు రోజుల పాటు బార్సిలోనాలో జరిగే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ ట్రేడ్ ఎగ్జిబిషన్ పురస్కరించుకుని హెచ్‌ఎమ్‌డి గ్లోబల్ తన Nokia 6 ఫోన్‌తో పాటు మరిన్ని ఫోన్‌ను భారత్ సహా ప్రముఖ మార్కెట్లలో లాంచ్ చేసే అవకాశం ఉంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Nokia 6 Android Phone Launched. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot