ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ హైలెట్ ఫీచర్స్..

Written By:

ఆండ్రాయిడ్ వర్షన్ లో తరువాతి తరం వెర్షన్ ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ అదిరే ఫీచర్లతో హల్ చల్ చేస్తోంది. ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మల్లో కి అప్ డేట్ గా వస్తున్న నౌగట్ సరికొత్త ఫీచర్లతో వినియోగదారులను అలరిస్తోంది. ఇందులో ఉన్న హైలెట్ ఫీచర్స్ ఏంటో మీరే చూడండి.

10 కోట్లు దాటిన మై జియో డౌన్‌లోడ్స్, అయినా రెండో ప్లేసే..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

విఆర్‌ టెక్నాలజీ

వర్చువల్‌ రియాలిటీ టెక్నాలజీకి మరింతగా సహకరిస్తుంది. డేడ్రీమ్‌ ఫీచర్‌ అప్‌డేట్‌తో మరింత సరికొత్త అనుభూతితో వీడియోలు వీక్షించే వీలుంది.

డైరెక్ట్‌ రిప్లై టు నోటిపికేషన్స్‌

మన స్మార్ట్‌ఫోన్‌కు వచ్చే నోటిఫికేషన్స్‌కు ఈ అప్ డేట్ లో న్యూ టెంప్లెట్‌ ఉంటుంది. అందులో వాట్సప్‌ నోటిఫికేషన్‌, ఫేస్‌బుక్‌ లైక్‌, ట్వీటో కనిపిస్తే.. ఆ టెంప్లెట్‌ను ఓపెన్‌ చేసి అక్కడి నుంచే డైరెక్ట్‌గా రిప్లై ఇవ్వవచ్చు.

మల్టీ విండో

ఈ కొత్తవెర్ష్షన్‌లో మల్టీ విండో ప్రధాన ఆకర్షణ. సిస్టమ్‌లో లాగా ఒకటి కంటే ఎక్కువ విండోలను ఓపెన్‌ చేసుకునే వీలుంటుంది. ముఖ్యంగా ఒకేసారి రెండు యాప్స్‌ను ఓపెన్‌ చేసి పక్క పక్కన ఉంచి చూసుకునే అవకాశం కల్పించారు.

క్విక్‌ సెట్టింగ్స్‌

ఐకాన్స్‌ సెట్టింగ్స్‌ విషయంలో ఈ ఫీచర్ మరింత మెరుగులతో వస్తోంది. ఒకే స్వైప్‌తో ఫ్లాష్‌లైట్‌, వైఫై, బ్లూటూత్ లాంటివే కాకుండా మనకు నిత్యం ఉపయోగపడే ఐకాన్స్‌ మనకి ఇష్టం వచ్చిన ఆర్డర్‌లో సెట్‌ చేసుకోవచ్చు.

బ్యాటరీలైఫ్‌

బ్యాటరీ లైఫ్‌ను మరింత పెంచేందుకు గతేడాది డోచ్‌ అనే ఫీచర్‌ను మార్స్‌మాలో వెర్షన్‌లో పరిచయం చేశారు. తాజా ఆండ్రాయిడ్‌ 7.0 లో ఇది మరోసారి అప్‌డేట్‌ అయింది. అనవసరమైన యాప్స్‌తో చార్జింగ్‌ ఖర్చుకాకుండా ఈ ఓఎస్‌ చూసుకుంటుంది. బ్యాటరీలైప్ ను పెంచుతుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Everything you need to know about Android 7.0 Nougat Read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot