మరికొద్ది గంటల్లో వన్‌ప్లస్ 5టీ లాంచ్

|

వన్‌ప్లస్ 5 స్మార్ట్‌ఫోన్‌కు సక్సెసర్ వెర్షన్‌గా భావిస్తోన్న వన్‌ప్లస్ 5టీ మరికొద్ది గంటల్లో లాంచ్ కాబోతోంది. న్యూయార్క్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఈవెంట్‌లో ఈ ఫోన్‌ను వన్‌ప్లస్ సంస్థ అఫీషియల్‌గా విడుదల చేయబోతోంది. లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంతో పాటు టాప్ క్వాలిటీ హార్డ్‌వేర్ స్పెసిఫికేషన్‌లతో రాబోతోన్నఈ స్మార్ట్‌ఫోన్.. సామ్‌సంగ్, యాపిల్, ఎల్‌జీ వంటి దిగ్గజ బ్రాండ్‌లకు చెందిన ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లకు నెక్ టు నెక్ కాంపిటీటర్‌గా నిలిచే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

 

వన్‌ప్లస్ 5టీ ఇండియా సేల్ ఎప్పుడంటే?

వన్‌ప్లస్ 5టీ ఇండియా సేల్ ఎప్పుడంటే?

ఇండియన్ మార్కెట్లో వన్‌ప్లస్ 5టీ స్మార్ట్‌ఫోన్ ధర రూ.40,000లోపు ఉండొచ్చని ఓ అంచనా. ఈ ఫోన్‌లకు సంబంధించిన ‘ఎర్లీ యాక్సిస్ సేల్' నవంబర్ 21 సాయంత్రం 4.30 నిమిషాలకు అమెజాన్ ఇండియాతో పాటు వన్‌ప్లస్‌స్టోర్.ఇన్‌లో జరుగుతుంది.

ఈ సేల్‌లో లిమిటెడ్ ఎడిషన్‌లో మాత్రమే వన్‌ప్లస్ 5టీ స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులో ఉంటాయి. అఫీషియల్ సేల్ మాత్రం నవంబర్ 28 నుంచి ప్రారంభమవుతుంది. నవంబర్ 21న జరిగే సేల్‌లో అమెజాన్ ప్రైమ్ యూజర్లు పాల్గొనవచ్చు.

వన్‌ప్లస్ 5టీలో అదిరిపోయే స్పెసిఫికేషన్స్?

వన్‌ప్లస్ 5టీలో అదిరిపోయే స్పెసిఫికేషన్స్?

ఇంటర్నెట్ ద్వారా లీకైన స్పెసిఫికేషన్స్ ప్రకారం వన్‌ప్లస్ 5టీ స్మార్ట్‌ఫోన్ 6 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ స్ర్కీన్‌తో రాబోతోంది. 18:9 యాస్పెక్ట్ రేషియో ఫోన్‌ తెరను మరింత పెద్దగా చూపిస్తుంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 835 చిప్‌సెట్ పై ఫోన్ రన్ అవుతుంది. ర్యామ్ ఇంకా స్టోరేజ్ విషయానికి వచ్చేసరికి 6జీబి + 64జీబి, 8జీబి ర్యామ్ + 128 స్టోరేజ్ వేరియంట్‌లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. ఇక చివరిగా, ఈ స్మార్ట్‌ఫోన్ 3450ఎమ్ఏహెచ్ బ్యాటరీ‌తో రాబోతోందని తెలుస్తోంది. ఈ బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది.

అమెజాన్‌లో వింటర్ కార్నివాల్ పేరిట వివో ఫోన్లపై ఆఫర్లుఅమెజాన్‌లో వింటర్ కార్నివాల్ పేరిట వివో ఫోన్లపై ఆఫర్లు

అప్‌గ్రేడెడ్ కెమెరా యూనిట్...
 

అప్‌గ్రేడెడ్ కెమెరా యూనిట్...

వన్‌ప్లస్ 5 స్మార్ట్‌ఫోన్ తరహాలోనే వన్‌ప్లస్ 5టీ కూడా డ్యుయల్ కెమెరా సెటప్‌తో రాబోతోంది. వన్‌ప్లస్ 5టీ మోడల్‌లో అప్‌డేటెడ్ కెమెరా టెక్నాలజీని ఇన్‌బిల్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇమేజ్ సెన్సార్స్ నాణ్యత విషయంలోనూ వన్‌ప్లస్ 5టీ సుప్రీమ్‌గా నిలిచే అవకాశముంది.

వన్‌ప్లస్ 5టీ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన పలు కెమెరా శాంపిల్స్‌ ఇప్పటికే ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. ఈ శాంపిల్స్‌ను బట్టి చూస్తుంటే వన్‌ప్లస్ 5టీ కెమెరాలు ప్రొఫెషనల్ స్థాయి ఫీచర్లతో రాబోతున్నాయన్నది స్పష్టమవుతోంది.

లైవ్ స్ర్కీనింగ్, ప్రొడక్ట్ డెమో సెషన్స్..

లైవ్ స్ర్కీనింగ్, ప్రొడక్ట్ డెమో సెషన్స్..

భారత కాలమానం ప్రకారం ఈ రోజు రాత్రి 9.30 నిమిషాలకు ప్రారంభం కాబోతోన్న వన్‌ప్లస్ 5టీ లాంచ్ ఈవెంట్‌ను వన్‌ప్లస్ ఇండియా ఫ్యాన్స్ పీవీఆర్ థియేటర్స్ ద్వారా వీక్షించే వీలుంటుంది. ఢిల్లీ, ముంబై,బెంగుళూరు, హైదరాబాద్ ఇంకా పూణే నగరాల్లోని ఎంపిక చేసిన పీవీఆర్ సినిమా థియేటర్స్‌లో ఈ లాంచ్ ఈవెంట్‌ను వన్‌ప్లస్ ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది.

ఈ లైవ్ ఈవెంట్‌కు సంబంధించిన టికెట్లను బుక్‌మై‌షో వెబ్‌సైట్ ద్వారా విక్రయిస్తున్నారు. ఈ లాంచ్ ఈవెంట్‌కు వెళ్లే వారు వన్‌ప్లస్ 5టీకి సంబంధించిన ఎక్స్‌క్లూజివ్ డెమో సెషన్స్‌లో పాల్గొని ఫోన్‌ను ఎక్స్‌పీరియన్స్ చేసే వీలుంటుంది.

అక్కడి నుంచే ప్రీ-బుక్ చేసుకునే అవకాశం..

అక్కడి నుంచే ప్రీ-బుక్ చేసుకునే అవకాశం..

పీవీఆర్ లాంచ్ ఈవెంట్‌కు హాజరయ్యే వారికి నేరుగా అక్కడి నుంచే వన్‌ప్లస్ 5టీ స్మార్ట్‌ఫోన్‌ను ప్రీ-బుక్ చేసుకునే వీలుంటుంది. దీంతో వారికి అందరికంటే ముందుగానే వన్‌ప్లస్ 5టీ లభిస్తుంది. ఈ కార్యక్రమానికి హాజరుకాని వారు వన్‌ప్లస్ 5టీ కోసం నవంబర్ 28 వరకు వేచి చూడాల్సిందే.


Best Mobiles in India

English summary
OnePlus 5T will be unveiled today at an event in New York. The smartphone will be going on sale for the Amazon Prime members on November 21.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X