కొత్త స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వోబీఐ మొబైల్స్

Posted By:

కొత్త స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వోబీఐ మొబైల్స్

యాపిల్ కంపెనీ మాజీ సీఈఓ జాన్ స్కల్లీ భారత్ లో వోబీఐ మొబైల్స్ (Obi Mobiles) పేరుతో సరికొత్త మొబైల్ కంపెనీని ప్రారంభించారు. గుర్గావ్ ముఖ్య కేంద్రంగా కార్యకలాపాలు సాగించే ఈ కంపెనీని జాన్ స్కల్లీ సహ వ్యవస్థాపకుడిగా వ్యవహరిస్తున్న ప్రముఖ ఐటీ ఇంకా టెలికామ్ కంపెనీ ఇన్‌ఫ్లెక్సియోన్‌పాయింట్  (Inflexionpoint) ప్రమోట్ చేస్తుంది. వోబీఐ మొబైల్స్ బృందానికి అజయ్ శర్మ నాయకత్వం వహిస్తారు. శర్మ గతంలో హెచ్‌టీసీ , మైక్రోమాక్స్ మొబైల్ డివిజన్‌లకు నాయకత్వం వహించారు. నీరజ్ చౌహాన్  ఇన్‌ఫ్లెక్సియోన్‌పాయింట్‌ కంపెనీకి సీఈఓగా వ్యవహరిస్తున్నారు.

ఇండియన్ మార్కెట్లో వోబీఐ మొబైల్ బ్రాండ్ స్మార్ట్‌ఫోన్‌‌లు మే 2014 నుంచి లభ్యంకానున్నాయి. వోబీఐ మొబైల్స్ తమ స్మార్ట్‌ఫోన్‌ల వ్యాపారాన్ని రానున్న కాలంలో వ్యాపారాన్ని ఆసియా పసిఫిక్, మధ్య తూర్పు మరియు లాటిన్ అమెరికా ప్రాంతాలకు విస్తరించనుంది. బ్రాండ్ విడుదల చేయబోయే ఫోన్‌లు వాటి ధరలకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడికావల్సి ఉంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot