రూ.2,999కే సెల్‌కాన్ ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఫోన్.. జూన్ 16న మార్కెట్లోకి!

Posted By:

రూ.2,999కే సెల్‌కాన్ ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఫోన్!

హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ సెల్‌కాన్ మొబైల్స్ అనూహ్యమైన ధర ట్యాగ్‌తో కూడిన సరికొత్త ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ స్మార్ట్‌ఫోన్‌ను జూన్ 16న మార్కెట్‌కు పరిచయం చేయబోతోంది. ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ వర్షన్ ఆపరేటింగ్ సిస్టం పై స్పందించే ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ మొబైలింగ్ డివైస్ పేరు సెల్‌కాన్ ఏ35కే (Celkon A35K).

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

3జీ వీడియో కాలింగ్, ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్, 3.5 అంగుళాల తాకేతెర వంటి అత్యాధునిక స్మార్ట్ ఫీచర్లను కలిగి ఉన్న ఈ ఫోన్ ధర రూ.2,999లోపు ఉండొచ్చని ఓ అంచనా. ఫీచర్ ఫోన్ ధరకే ఈ స్మార్ట్‌ఫోన్ లభ్యమవుతుండటం ఓ ఆస్తికర అంశం. ఇప్పటికే బడ్జెట్ ఫ్రెండ్లీ ధర శ్రేణిల్లో స్మార్ట్‌ఫోన్‌లను అందిసోన్న మోటరోలా, మైక్రోమాక్స్, కార్బన్ వంటి బ్రాండ్‌లు సెల్ కాన్ ఏ35కే నుంచి తీవ్ర‌మైన పోటీని ఎదుర్కొవల్సి ఉంటుంది. సెల్‌కాన్ ఏ35కే సంబంధించిన మరిన్ని అప్‌డేట్‌లను త్వరలోనే మీకసందిస్తాం.

సెల్‌కాన్ మొబైల్స్ తన నూతన ఆవిష్కరణకు సంబంధించి ఓ టీజర్ తన అధికారిక ఫేస్‌బుక్ ఫ్యాన్ పేజీలో పోస్ట్ చేసింది. ఆ టీజర్‌ను మీరు క్రింద చూడొచ్చు...

రూ.2,999కే సెల్‌కాన్ ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఫోన్!

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot