2జీబి ర్యామ్‌తో సెల్‌కాన్ మిలీనియమ్ అల్ట్రా క్యూ500

Posted By:

హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తోన్న ప్రముఖ దేశవాళీ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ సెల్‌కాన్ మొబైల్స్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ విభాగంలో తనదైన వ్యూహాలతో ముందుకుసాగుతోంది. ఇప్పటికే తన సిగ్నేచర్ శ్రేణి నుంచి వివిధ మోడళ్లలో ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఫోన్‌లను విడుదల చేసిన సెల్‌కాన్ తాజాగా ‘సెల్‌కాన్ మిలీనియమ్ అల్ట్రా క్యూ500' పేరుతో మరో శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి  తీసుకురాబోతోంది.

 2జీబి ర్యామ్‌తో సెల్‌కాన్ మిలీనియమ్ అల్ట్రా క్యూ500

ఆగష్టు 24న ఈ ఫ్లాగ్‌షిప్ మోడల్ ఫోన్‌ను విడుదల చేయుబోతున్నారు. ఈ వివరాలను సెల్‌కాన్ మొబైల్స్ ప్రముఖ ఎగ్జిక్యూటివ్ ఒకరు గిజ్‌బాట్‌కు తెలిపారు. 5 అంగుళాల హైడెఫినిషన్ తాకేతెరను కలిగి ఉన్న ఈ క్వాడ్‌కోర్ ప్రాసెసర్ ఫోన్ పటిష్టిమైన 2జీబి ర్యామ్ వ్యవస్థను కలిగి ఉంటుంది. ధర రూ.9,999. ఆగష్టు 14 నుంచి బుకింగ్‌లు ప్రారంభంకానున్నాయి. సెల్‌కాన్ మిలీనియమ్ అల్ట్రా క్యూ500 కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే:

5 అంగుళాల ఐపీఎస్ హైడెఫినిషన్ డిస్‌ప్లే (720 పిక్సల్ రిసల్యూషన్),
క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
13 మెగా పిక్సల్ కెమెరా,
పెద్దదైన బ్యాటరీ.


మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Exclusive: Celkon To Launch Millennium Ultra Q500 on August 24;Pre-Orders To Open Next Week. Read more in Telugu Gizbot.......
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot