సెల్‌కాన్ నుంచి విండోస్ స్మార్ట్‌ఫోన్... త్వరలో

Posted By:

బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ల వ్యాపారంలోకి ఇటీవల అడుగుపెట్టిన సెల్‌కాన్ మొబైల్స్ విజయవంతంగా ముందుకుసాగుతోంది. తాజాగా, సెల్‌కాన్ తన బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ స్మార్ట్‌ఫోన్ క్యాంపస్ ఏ35కెను మార్కెట్లో విడుదల చేసి సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టింది. చవక ధరల్లో స్మార్ట్‌ఫోన్‌లను ఆఫర్ చేస్తోన్న మోటరోలా, మైక్రోమాక్స్ తదితర ప్రముఖ బ్రాండ్‌లకు చెక్ పెడుతూ సెల్‌కాన్ తన క్యాంపస్ ఏ35కె ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ స్మార్ట్‌ఫోన్‌ను కేవలం రూ.2,999కే విక్రయిస్తోంది. రానున్న 30 రోజుల వ్యవధిలో సెల్‌కాన్ మొబైల్స్ మరో 15 సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ మోడల్స్‌తో మార్కెట్ ముందుకు రానున్నట్లు సెల్‌కాన్ మొబైల్స్ డిజిటల్ మేనేజిమెంట్ హెడ్ వై. ప్రదీప్ సెల్‌కాన్ క్యాంపస్ ఏ35కె ఆండ్రాయిడ్ కిట్ క్యాట్ స్మార్ట్ ఫోన్ ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా వెల్లడించారు.

సెల్‌కాన్ నుంచి విండోస్ స్మార్ట్‌ఫోన్... త్వరలో

సెల్‌కాన్ మొబైల్స్‌కు సంబంధించిన మరో ఆసక్తికర సమాచారాన్ని గిజ్‌బాట్ మీకు ఎక్స్‌క్లూజివ్‌గా అందించే ప్రయత్నం చేస్తోంది. తమ భవిష్యత్ కార్యాచరణలో భాగంగా సెల్‌కాన్ మొబైల్స్ నుంచి వచ్చే అగష్టులో విండోస్ 8.1 స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు సెల్‌కాన్ మొబైల్స్ డిజిటల్ మేనేజిమెంట్ హెడ్ వై. ప్రదీప్ మా గిజ్‌బాట్ ప్రతినిధికి తెలిపారు. ఈ ఫోన్ ధర రూ.10,000లోపు ఉండొచ్చని ఆయన అన్నారు.

కాగా, క్యాంపస్ ఏ35కె ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ స్మార్ట్‌ఫోన్‌ను స్టైలిష్ ఇంకా పొదుపైనదిగా సెల్‌కాన్ అభివర్ణించింది. 3.5 అంగుళాల తాకేతెర, 3జీ వీడియో కాలింగ్, వేగవంతమైన 1గిగాహెట్జ్ ప్రాసెసర్, డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ, 3.2 మెగా పిక్సల్ కెమెరా, 512 ఎంబి ఇంటర్నల్ మెమెరీ, వై-ఫై, బ్లూటూత్,1400ఎమ్ఏహెచ్ బ్యాటరీ వంటి బడ్జెట్ ఫ్రెండ్లీ ఫీచర్లను ఈ ఫోన్‌లో నిక్షిప్తం చేసారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot