Lenovo నుంచి మరో సూపర్ ఫోన్ వచ్చేస్తోంది?
లెనోవో తన సరికొత్త Zuk బ్రాండ్ నుంచి మరో విప్లవాత్మక స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాలో లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. Z2 Plus పేరుతో రాబోతోన్న ఈ ఫోన్‌ను సెప్టంబర్ 20లోపు మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు లెనోవో సన్నాహాలు చేస్తుంది.

Read More : 52 కోట్ల కాల్స్ ఫెయిల్ అయ్యాయి, జియో సంచలన ఆరోపణ
లెనోవో మొబైల్స్ హెడ్ అనూజ్ శర్మ ఎక్స్‌క్లూజివ్‌గా వెల్లడించిన వివరాల ప్రకారం Lenovo Z2 Plus సెప్టంబర్ 20లోపు ఇండియన్ మార్కెట్లో లాంచ్ కానుంది.

#1
లెనోవో జెడ్2 ప్లస్ రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. 3జీబి ర్యామ్ 32జీబి ఇంటర్నల్ మెమరీ ఆప్షన్‌తో మొదటి వేరియంట్ ఉంటుంది. రెండవ వేరియంట్ వచ్చేసరికి 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ మెమరీ ఆప్షన్‌తో వస్తుంది.

#2
రూ.20,000లోపు ధర రేంజ్‌లో ఈ రెండు ఫోన్‌లు అందుబాటులో ఉంటాయి.

#3
లెనోవో సబ్సిడరీ బ్రాండ్ అయిన ZUK నుంచి కొద్ది నెలల క్రితమే ZUK Z1 పేరుతో ఓ స్మార్ట్‌ఫోన్‌ను లెనోవో భారత్‌లో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ధర రూ.13,3499గా ఉంది. Amazon ఈ ఫోన్‌లను ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోంది.

#4
త్వరలో మార్కెట్లో లాంచ్ కాబోతోన్న Lenovo Z2 Plus గురంచి తాజాగా రివీల్ అయిన పలు ఆసక్తికర విషయాలను ఇప్పుడు చూద్దాం..

#5
లెనోవో జెడ్2 ప్లస్ ఫైబర్ గ్లాస్ బాడీతో రాబోతోంది. ఇది మెటల్ బాడీతో పోలిస్తే 45% తక్కువ బరువుగాను 25% ఎక్కువ ధృడత్వాన్ని కలిగి ఉంటుంది.

#6
లెనోవో జెడ్2 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లో పొందుపరిచిని రీడిజైనిడ్ యూజర్ ఇంటర్‌ఫేస్ సరికొత్త అనుభూతులతో కూడిన క్విక్ టాగిల్ నోటిఫికేషన్ ప్యానల్‌ను అందుబాటులోకి తీసుకువస్తుంది.

#7
లెనోవో జెడ్2 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ స్మార్ట్‌ఫోన్ యూజర్ల కోసం ప్రత్యేకంగా రీడిజైన్ చేసారు. VoLTE ఫీచర్‌తో వస్తోన్న రిలయన్స్ జియో నెట్‌వర్క్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. గూగుల్ నౌను డీఫాల్ట్ లాంచర్‌గా అందిస్తున్నారు. లాంగ్ స్ర్కీన్ షాట్,
క్యారియర్ అగ్రిగేషన్, 3జీ ఫాల్ బ్యాక్ వంటి ప్రత్యేక ఫీచర్లు ఈ ఫోన్‌లో ఉన్నాయి.

#8
లెనోవో జెడ్2 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌కు స్మార్ట్‌ఫింగర్ ప్రింట్ స్కానర్ వ్యవస్థ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. 99.7శాతం ఖచ్చితత్వంతో పనిచేసే సెల్ఫ్ లెర్నింగ్ అల్గారిథమ్ వ్యవస్థను ఈ సెన్సార్‌లో ఏర్పాటు చేసారు.

#9
జెడ్2 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లో పొందుపరిచిన ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అనేక రకాలుగా ఉపయోగించుకోవచ్చు.

#10
లెనోవో జెడ్2 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లో పొందుపరిచిని రీడిజైనిడ్ యూజర్ ఇంటర్‌ఫేస్ సరికొత్త అనుభూతులతో కూడిన క్విక్ టాగిల్ నోటిఫికేషన్ ప్యానల్‌ను అందుబాటులోకి తీసుకువస్తుంది.


Click it and Unblock the Notifications








