షియోమికి దిమ్మతిరిగేలా మోటో కొత్త ఫోన్లు !

Written By:

భారత్ లో అమ్మకాల్లో సంచలనాలు నమోదుచేస్తూ అపరిమిత వేగంతో దూసుకుపోతున్న షియోమి ఫోన్లను తలదన్నేలా మోటో కొత్త ఫోన్లు రానున్నాయి. ముఖ్యంగా షియోమి రెడ్ మి 4ఏ స్మార్ట్ ఫోన్ కు సవాల్ విసిరేందుకు మోటో కొత్త ఫోన్లు రెడీ అవుతున్నాయి. మోటో నుంచి త్వరలో మోటో సీ, మోటో సీ ప్లస్ స్మార్ట్ ఫోన్లు భారత్ లో లాంచ్ కానున్నాయి. అన్నీ కుదిరితే జూన్ నెలలో ఈ ఫోన్లు మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.

రెడ్‌మి 4A ఎక్స్‌క్లూజివ్ సేల్, గంట మాత్రమే..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

జూన్ నెలలో ఈ ఫోన్లు మార్కెట్లోకి

మోటో సీ, మోటో సీ ప్లస్ స్మార్ట్ ఫోన్ల లాంచింగ్ తేదీలను లెనోవో కంపెనీ అధికారికంగా నిర్ణయించనప్పటికీ, జూన్ నెలలో ఈ ఫోన్లు మార్కెట్లోకి రావచ్చని టెక్ వర్గాలు భావిస్తున్నాయి.

8000 రూపాయల లోపే

8000 రూపాయల లోపే ఈ ఫోన్లను మార్కెట్లోకి తీసుకొచ్చి, తాజాగా షియోమి లాంచ్ చేసిన బడ్జెట్ స్మార్ట్ ఫోన్ రెడ్ మి 4ఏ కు గట్టి పోటీ ఇవ్వాలని కంపెనీ భావిస్తున్నట్టు తెలుస్తోంది.

సంబంధిత వర్గాలు కూడా క్లారిటీ

ఇవాన్ బ్లాస్ ముందస్తు లీకేజీలను ధృవీకరిస్తూ మోటో సీ, మోటో సీ ప్లస్ స్మార్ట్ ఫోన్లు జూన్ లో భారత్ లో లాంచ్ అవుతాయనే దానిపై సంబంధిత వర్గాలు కూడా క్లారిటీ ఇచ్చేస్తున్నాయి.

ఆండ్రాయిడ్ నౌగట్ తో

ఈ రెండు స్మార్ట్ ఫోన్లు ఆండ్రాయిడ్ నౌగట్ తో రన్ అవుతాయని తెలుస్తోంది. రెడ్ మి 4ఏ రెండేళ్ల కిందటి ఆండ్రాయిడ్ మార్ష్ మాలోతోనే రన్ అవుతోంది.

5 అంగుళాల డిస్ ప్లే

గోల్డ్, సిల్వర్, బ్లాక్, రెడ్ రంగుల్లో ఈ ఫోన్ వినియోగదారులను అలరించనుందని, 5 అంగుళాల డిస్ ప్లేతో ఇది మార్కెట్లోకి వస్తుందని రిపోర్టులు పేర్కొంటున్నాయి.

ర్యామ్

మోటో సీ ఫోన్ కు 1జీబీ ర్యామ్, 16జీబీ స్టోరేజ్ ఉండగా.. మోటీ సీ ప్లస్ కు 2జీబీ ర్యామ్, 32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుందని టెక్ వర్గాలు చెబుతున్నాయి.

కెమెరా

8ఎంపీ రియర్ కెమెరా, 2 ఎంపీ సెల్ఫీ షూటర్, 3800 ఎంఏహెచ్ బ్యాటరీ మోటో సీ ఫోన్ కలిగి ఉంటుందని టెక్ వర్గాల టాక్.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడేEnglish summary
Exclusive: Moto C to launch in India in June, to take on Redmi 4A read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting