రూ.18,000కే 6జీబి ర్యామ్, 128జీబి స్టోరేజ్ ఫోన్?

తన స్టైలిష్ రేంజ్ స్మార్ట్‌ఫోన్‌లతో మార్కెట్లో ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతోన్న చైనా ఫోన్‌ల కంపెనీ నుబియా (Nubia) మరో సంచలన ఫోన్‌ను మార్కెట్లో లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

జూన్ 12 నుంచి సేల్...

Nubia Z17 mini పేరుతో రాబోతోన్న ఈ ఫోన్ జూన్ 6ను మార్కెట్లో అనౌన్స్ అయ్యే అవకాశం ఉంది. సేల్ జూన్ 12 నుంచి ప్రారంభమవుతుంది. రెండు వేరియంట్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది.

రెండు వేరియంట్‌లలో..

Nubia Z17 mini స్మార్ట్‌ఫోన్ ఇప్పటికే చైనాలో లభ్యమవుతుంది. ఈ ఫోన్‌ను రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంచారు. 4జీబి ర్యామ్ వేరియంట్ ధర CNY 1,699 (మన కరెన్సీలో రూ.15,914), 6జీబి ర్యామ్ వేరియంట్ ధర CNY 1,999 (మన కరెన్సీలో రూ.18,724).

నుబియా జెడ్17 మినీ స్పెసిఫికేషన్స్...

నుబియా జెడ్17 మినీ ఫోన్ మెటల్ బాడీతో వస్తోంది. 5.2 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్ ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), 2.5డి కర్వుడ్ గ్లాస్ ప్రొటెక్షన్.

రెండు రకాల ప్రాసెసర్లతో..

6జీబి ర్యామ్ ఆప్షన్‌తో వచ్చే ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 653 ఆక్టా కోర్ ప్రాసెసర్ పై రన్ అవుతుంది. 4జీబి ర్యామ్ ఆప్షన్‌తో వచ్చే ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 652 ఆక్టా కోర్ ప్రాసెసర్ పై రన్ అవుతుంది.

స్టోరేజ్ కెపాసిటీ..

6జీబి ఇంకా 4జీబి ర్యామ్ వేరియంట్‌లలో అందుబాటులో ఉండే ఈ ఫోన్‌లో ఇంటర్న్ స్టోరేజ్ కెపాసిటీ 64జీబి మాత్రమే. మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 200జీబి వరకు విస్తరించుకునే అవకాశం,

 

సాఫ్ట్‌వేర్..

సాఫ్ట్‌వేర్ విషయానికి వచ్చేసరికి నుబియా జెడ్17 మినీ ఫోన్ ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది.

కెమెరా విషయానికి వచ్చేసరికి

కెమెరా విషయానికి వచ్చేసరికి నోకియా జెడ్17 మినీ డ్యుయల్ కెమెరా సెటప్‌తో వస్తోంది. ఫోన్ వెనుక భాగంలో అమర్చిన రెండు 13 ఎంపీ కెమెరాలు పర్‌ఫెక్ట్ ఫోటోగ్రఫీని ఆఫర్ చేస్తాయి. 4కే క్వాలిటీ వీడియోలను ఈ కెమెరాల ద్వారా రికార్డ్ చేసుకోవచ్చు. ఫోన్ ముందు భాగంలో అమర్చిన 16 మెగా పిక్సల్ కెమెరా 80 డిగ్రీల్ వైడ్ వ్యూవింగ్ యాంగిల్‌తో బెస్ట్ క్వాలిటీ సెల్ఫీ ఇంకా వీడియో కాలింగ్‌ను ఆఫర్

చేస్తుంది.

 

బ్యాటరీ విషయానికి వచ్చేసరికి

బ్యాటరీ విషయానికి వచ్చేసరికి నోకియా జెడ్17 మినీ 2950mAh బ్యాటరీతో వస్తోంది. ఫాస్ట్ ఛార్జింగ్ ను ఈ బ్యాటరీ సపోర్ట్ చేస్తుంది. కనెక్టువిటీ ఫీచర్లు (డ్యుయల్ సిమ్, 4జీ వోల్ట్ సపోర్ట్, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్బీ టైప్-సీ పోర్ట్).

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Exclusive: Nubia Z17 mini to launch in India on June 6. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot