రూ.1000కే VoLTE సపోర్ట్‌ ఫోన్..?

VoLTE సపోర్ట్‌తో పనిచేసే ఫీచర్ ఫోన్‌లను రిలయన్స్ అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలియవచ్చింది.

|

ఊహించని రీతిలో 4జీ సర్వీసులను లాంచ్ చేసి దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోన్న రిలయన్స్ జియో మరో ప్రయోగానికి సిద్ధమవుతోంది. VoLTE సపోర్ట్‌తో పనిచేసే ఫీచర్ ఫోన్‌లను రిలయన్స్ అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలియవచ్చింది. ఈ విప్లవాత్మక 4జీ ఫోన్ లు ఈ ఏడాది చివరినాటికి లేదా వచ్చే ఏడాది ఆరంభంలో మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

Read More : బ్లాక్‌బెర్రీ చివరి ఫోన్ ఇదేనా..?

ప్రస్తుతం 4జీ స్మార్ట్‌ఫోన్‌లలో మాత్రమే

ప్రస్తుతం 4జీ స్మార్ట్‌ఫోన్‌లలో మాత్రమే

ప్రస్తుతం రిలయన్స్ ఆఫర్ చేస్తున్న జియో 4జీ సర్వీసులు కేవలం 4జీ స్మార్ట్‌ఫోన్‌లలో మాత్రమే పనిచేస్తోన్న విషయం తెలిసిందే. 

స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులో ఉన్నప్పటికి..?

స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులో ఉన్నప్పటికి..?

మార్కెట్లోకి స్మార్ట్‌ఫోన్‌లు కుప్పలు తెప్పలుగా అందుబాటులోకి వచ్చినప్పటికి ఇంకా ఎక్కువ శాతం భారత జనాభా ఫీచర్ ఫోన్‌ల పైనే ఆధారపడుతోందని సర్వేలు చెప్పకనే చెబుతున్నాయి.

50 శాతం మార్కెట్ వాటాతో..

50 శాతం మార్కెట్ వాటాతో..

50 శాతం మార్కెట్ వాటాతో ఫీచర్ ఫోన్‌లు ఇండియన్ మార్కెట్‌ను శాసిస్తోన్న నేపథ్యంలో, రిలయన్స్ జియో VoLTE ఎనేబుల్డ్ ఫీచర్ ఫోన్‌లను మార్కెట్లో తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

VoLTE ఎనేబుల్డ్ ఫీచర్ ఫోన్‌లు అందుబాటులోకి వస్తే..

VoLTE ఎనేబుల్డ్ ఫీచర్ ఫోన్‌లు అందుబాటులోకి వస్తే..

VoLTE ఎనేబుల్డ్ ఫీచర్ ఫోన్‌లు అందుబాటులోకి వచ్చినట్లయితే ఫీచర్ ఫోన్‌లలోనూ జియో డేటా ఇంకా వాయిస్ సేవలు అందుబాటులో ఉంటాయి. దీంతో జియో సేవలను పొందేందుకు ప్రత్యేకంగా స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేయవల్సిన అవసరం ఉండదు. అంతేకాకుండా అతితక్కువ ధరల్లోనే 4జీ సేవలను ఆస్వాదించవచ్చు.

 

Spreadtrum 9820 processor

Spreadtrum 9820 processor

రిలయన్స్ అందుబాటులోకి తీసుకురాబోతున్న VoLTE ఎనేబుల్డ్ ఫీచర్ ఫోన్‌లు Spreadtrum 9820 processorతో వస్తున్నట్లు సమాచారం. ఈ ప్రాసెసర్ VoLTE సాఫ్ట్‌వేర్‌ను సమర్థవంతంగా సపోర్ట్ చేస్తుంది.

ప్రముఖ బ్రాండ్‌లకు..

ప్రముఖ బ్రాండ్‌లకు..

సామ్‌సంగ్ జెడ్2, సామ్‌సంగ్ జే2, గెలాక్సీ టాబ్ 7.0 వంటి డివైస్‌లకు Spreadtrum కమ్యూనికేషన్స్ ఇప్పటికే చిప్‌సెట్‌లను డిజైన్ చేసింది.

2జీ అనేదే ఉండదేమో..?

2జీ అనేదే ఉండదేమో..?

రిలయన్స్ VoLTE ఎనేబుల్డ్ ఫీచర్ ఫోన్‌లు అందుబాటులోకి వచ్చినట్లయితే, ప్రస్తుతం 2జీ నెట్‌వర్క్‌తో సరిపెట్టుకుంటున్న గ్రామీణ ప్రాంతాల ప్రజలు పూర్తిగా జియో 4జీ వైపు మారిపోయే అవకాశం ఉంది.

కారు చౌక 4జీ డేటా రేట్లతో

కారు చౌక 4జీ డేటా రేట్లతో

కారు చౌక 4జీ డేటా రేట్లతో ఇతర నెట్‌వర్క్ ఆపరేటర్లకు ముచ్చెమటలు పట్టిస్తోన్న విషయం తెలిసిందే. రిలయన్స్ జియో రేపోమాపో అందుబాటులోకి తీసుకురాబోయే VoLTE ఎనేబుల్డ్ ఫీచర్ ఫోన్‌లు ఎంతటి ప్రభంజనాన్ని సృష్టిస్తాయో వేచి చూడాలి మరి.

 

Best Mobiles in India

English summary
Exclusive: Reliance to launch Feature Phones with VoLTE support in India soon. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X