సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5.. విడుదల తేదీ ఖరారు

Posted By:

మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2014 వేదికగా సామ్‌సంగ్ ఆవిష్కరించిన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ‘గెలాక్సీ ఎస్5'. ఈ ఆధునిక వర్షన్ స్మార్ట్ మొబైలింగ్ డివైస్‌ను ఏప్రిల్ 11 నుంచి 50 దేశాల్లో విక్రయించనున్నట్లు సామ్‌సంగ్ సదరు వేదికపైనే ప్రకటించింది. ప్రస్తుత గెలాక్సీ ఎస్5 ఇండియన్ మార్కెట్లో విడుదలకు సంబంధించి ఎక్స్‌క్లూజివ్ సమాచారాన్ని గిజ్‌బాట్ సేకరించటం జరిగింది.

 సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5.. విడుదల తేదీ ఖరారు

విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు... ఇండియన్ రిటైల్ మార్కెట్లో గెలాక్సీ ఎస్5ను ఏప్రిల్ 15, 2014 నుంచి విక్రయించనున్నారు. ధర అంచనా రూ.45,000 నుంచి రూ.50,000 వరకు.

గెలాక్సీ ఎస్5 ప్రభావం.. గెలాక్సీ ఎస్4 పై భారీ తగ్గింపు...

గెలాక్సీ ఎస్5 విడుదల నేపధ్యంలో గెలాక్సీ ఎస్4 పై సామ్‌సంగ్ భారీ ధర తగ్గింపును ప్రకటించింది. ఇండియన్ మార్కెట్లో గెలాక్సీ ఎస్4 ప్రస్తుత ధర రూ.30,000.

ఆన్‌లైన్ లిస్టింగ్స్‌లో గెలాక్సీ ఎస్5

ఇండియాకు చెందిన ప్రముఖ మొబైల్ ఫోన్ రిటైలర్ ద మొబైల్ స్టోర్ (The Mobile Store) గెలాక్సీ ఎస్5కు సంబంధించిన సమాచారాన్ని తన లిస్టింగ్స్‌లో పొందుపరిచింది.

గెలాక్సీ ఎస్5 కీలక స్పెసిఫికేషన్‌లు:

5.1 అంగుళాల డిస్‌ప్లే (1080 పిక్సల్ సూపర్ అమోల్డ్ ప్యానల్), ఐపీ67 సర్టిఫికేషన్ (వాటర్ ఇంకా డస్ట్ ప్రూఫ్), 16 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా సెన్సార్ (అల్ట్రా హైడెఫినిషన్ రికార్డింగ్, ఫోటోలు ఇంకా వీడియోలను రియల్ టైమ్ హైడెఫినిషన్ రికార్డింగ్‌తో క్యాప్చర్ చేసుకునే సదుపాయం), 2.5గిగాహెట్జ్ స్నాప్‌డ్రాగన్ 800 ప్రాసెసర్, 2జీబి ర్యామ్, ఐఆర్ రిమోట్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్ఎఫ్‌సీ), బ్లూటూత్ 4.0 బీఎల్ఈ/ఏఎన్‌టీ+, క్యాట్ 4 ఎల్టీఈ, ఇంటర్నల్ మెమరీ వేరియంట్స్ (16జీబి, 32జీబి), మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot