జడ్‌టీఈ గ్రాండ్ ఎస్.. దీపావళి కానుకగా!

Posted By:

ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ మూడు పువ్వులు, ఆరు కాయలుగా విస్తరిస్తోంది. ఇతర దేశాలతో పోలిస్తే స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు భారత మార్కెట్లో ఆశాజనకంగా ఉన్నాయి. ప్రముఖ అంతార్జతీయ స్మార్ట్‌ఫోన్ తయారీ బ్రాండ్‌‍లలో నాలుగో స్థానంలో నిలిచిన జడ్‌టీఈ కార్పొరేషన్ రానున్న  మరికొద్ది వారాల్లో ‘గ్రాండ్ ఎస్' (Grand S)పేరుతో అత్యాధునిక స్పెసిఫికేషన్‌లతో కూడిన అధిక ముగింపు స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో ప్రవేశపెట్టనుంది. గ్రాండ్ ఎస్  స్మార్ట్‌ఫోన్‌ను తొలిగా సీఈఎస్ 2103లో ఆవిష్కరించటం జరిగింది. ఈ ఫోన్ ప్రత్యేక డిజైన్‌కు గాను అనేక అవార్డులు లభించటం విశేషం.

జడ్‌టీఈ ఇండియా మార్కెటింగ్ డైరెక్టర్ అయిన అమిత్ సక్సేనా గిజ్‌బాట్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో భాగంగా గ్రాండ్ ఎస్ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి పలు కీలక వివరాలను బహిర్గతం చేసారు. జడ్‌టీఈ గ్రాండ్ ఎస్ దీపావళి నాటికి ఇండియన్ మార్కెట్లో విడుదల కాబోతోంది. ఇండియన్ హ్యాండ్‌సెట్ మార్కెట్లో ఈ అధిక ముగింపు స్మార్ట్‌ఫోన్ ధర రూ.30,000. రాబోయే నెలల్లో గ్రాండ్ ఎస్ తరహాలోనే మరిన్న ఫోన్‌లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు సక్సేనా వెల్లడించారు.  జడ్‌టీఈ గ్రాండ్ ఎస్ స్పెసిఫికేషన్‌లు క్లుప్తంగా.......

జడ్‌టీఈ గ్రాండ్ ఎస్ స్మార్ట్‌ఫోన్ ఫోటో గ్యాలరీ కోసం క్లిక్ చేయండి.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

డిస్‌ప్లే ఇంకా డిజైన్:  5 అంగుళాల ఐపీఎస్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్, హైడెఫినిషన్, ఫోన్ మందం 6.9 మిల్లీమీటర్లు. ఫోన్ డిస్‌ప్లే 16.7మిలియన్ల రంగులను ఉత్పత్తి చేయగలదు.

ప్రాసెసర్:  1.7గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 క్వాడ్-కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమెరీని 64జీబికి విస్తరించుకోవచ్చు.

ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్,

కెమెరా: 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా( ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, వీడియో రికార్డింగ్ (1080 పిక్సల్ హైడెఫినిషన్ రిసల్యూషన్).

డాల్బి డిజిటల్ సౌండ్: ఫోన్‌లో అమర్చిన డాల్బీ చిప్‌సెట్ అత్యుత్తమ సౌండ్ అనుభూతులను చేరువ చేస్తుంది.

బ్యాటరీ: 1780ఎమ్ఏహెచ్ లియోన్ నాన్ రిమూవబుల్ బ్యాటరీ.

కనెక్టువిటీ ఆప్షన్స్ ఇంకా ధర: 3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, ఏ-జీపీఎస్,

ఇండియన్ మార్కెట్లో ధర అంచనా: రూ.30,000.

పోటీ హ్యాండ్‌సెట్‌లు: ఎల్‌జి ఆప్టిమస్ ప్రో, లెనోవో కె900.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

జడ్‌టీఈ గ్రాండ్ ఎస్.. దీపావళి కానుకగా!

Exclusive: ZTE Grand S To Make Its Debut in India Around Diwali, To Be Priced Under Rs 30,000

జడ్‌టీఈ గ్రాండ్ ఎస్.. దీపావళి కానుకగా!

 

జడ్‌టీఈ గ్రాండ్ ఎస్.. దీపావళి కానుకగా!

Exclusive: ZTE Grand S To Make Its Debut in India Around Diwali, To Be Priced Under Rs 30,000

జడ్‌టీఈ గ్రాండ్ ఎస్.. దీపావళి కానుకగా!

 

జడ్‌టీఈ గ్రాండ్ ఎస్.. దీపావళి కానుకగా!

Exclusive: ZTE Grand S To Make Its Debut in India Around Diwali, To Be Priced Under Rs 30,000

జడ్‌టీఈ గ్రాండ్ ఎస్.. దీపావళి కానుకగా!

 

జడ్‌టీఈ గ్రాండ్ ఎస్.. దీపావళి కానుకగా!

Exclusive: ZTE Grand S To Make Its Debut in India Around Diwali, To Be Priced Under Rs 30,000

జడ్‌టీఈ గ్రాండ్ ఎస్.. దీపావళి కానుకగా!

 

జడ్‌టీఈ గ్రాండ్ ఎస్.. దీపావళి కానుకగా!

Exclusive: ZTE Grand S To Make Its Debut in India Around Diwali, To Be Priced Under Rs 30,000

జడ్‌టీఈ గ్రాండ్ ఎస్.. దీపావళి కానుకగా!

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot