Home
Mobile

తక్కువ బడ్జెట్‌లో, బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్ ఇదే

అన్ని రకాల క్వాలిటీస్‌తో వస్తోన్న ఈ డివైస్ మార్కెట్‌ను శాసిస్తుందనటంలో ఏ మాత్రం సందేహం లేదు..

By Sivanjaneyulu Bommu

OPPO Selfie Expert ఫ్యామిలీ నుంచి మరో లీడింగ్ క్లాస్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో లాంచ్ అయ్యింది. OPPO F3 పేరుతో ఇండియన్ యూజర్లకు పరిచయమైన ఈ మిడ్-రేంజ్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ధర రూ.19,999. డ్యుయల్ సెల్ఫీ కెమెరా ఈ ఫోన్‌కు ప్రధాన ఆకర్షణగా చెప్పుకోవచ్చు. బెస్ట్‌క్లాస్ మొబైల్ ఎక్స్‌పీరియన్స్‌ను కోరుకునే వారికి అన్ని రకాల క్వాలిటీస్‌తో వస్తోన్న ఈ డివైస్ మార్కెట్‌ను శాసిస్తుందనటంలో ఏ మాత్రం సందేహం లేదు..

16 మెగా పిక్సల్ + 8 మెగా పిక్సల్ డ్యుయల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా..

16 మెగా పిక్సల్ + 8 మెగా పిక్సల్ డ్యుయల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా..

OPPO F3 Plus మోడల్ తరహాలోనే OPPO F3 కూడా తన డ్యుయల్ సెల్ఫీ కెమెరా సెటప్‌తో సరికొత్త బెంచ్ మార్క్‌ను సెట్ చేసింది. ఫోన్ ముందు భాగంలో పొందుపరిచని 16 మెగా పిక్సల్ + 8 మెగా పిక్సల్ సెల్ఫీ కెమెరా కాంభినేషన్ వినూత్నమైన సెల్ఫీ ఎక్స్‌పీరియన్స్‌ను చేరువచేస్తుంది.

 ఫీల్డ్ వ్యూ పై ఎక్కువుగా ఫోకస్ ..

ఫీల్డ్ వ్యూ పై ఎక్కువుగా ఫోకస్ ..

16 మెగా పిక్సల్ రిసల్యూషన్‌తో స్పందించే స్టాండర్డ్ కెమెరా లెన్స్‌లో 1/3-ఇంచ్ సెన్సార్‌తో పాటు f/2.0 apertureను పొందుపరిచారు. దీంతో ఈ కెమెరా చిత్రీకరించే ఫోటోలు సహజసిద్ధమైన రంగులను కలిగి ఉంటాయి. 8 మెగా పిక్సల్ రిసల్యూషన్‌తో స్పందించే వైడ్ యాంగిల్ కెమెరాలో 6 పిక్సల్ లెన్స్‌ కీలక పాత్ర పోషిస్తాయి. ఈ లెన్స్ ఫీల్డ్ వ్యూ పై ఎక్కువుగా ఫోకస్ పెడుతుంది.

 HDR, vivid depth, minimized noise

HDR, vivid depth, minimized noise

స్టాండర్డ్ కెమెరా లెన్స్ ఫోటో సబ్జెక్ట్‌లోని HDR, vivid depth, minimized noise వంటి అంశాల పై ప్రధానంగా దృష్టిసారించగలుగుతుంది. ఇదే సమయంలో వైడ్ యాంగిల్ లెన్స్ ఫీల్డ్ వ్యూకు సంబంధించిన అంశాల పై ప్రధానంగా ఫోకస్ పెడుతుంది. ముఖ్యంగా సెల్ఫీ పానోరమా మోడ్‌ను ఉపయోగించుకునే సమయంలో ఈ వైడ్ యాంగిల్ లెన్స్ మరింత యాక్టివ్‌గా పనిచేస్తుంది.

స్మార్ట్ ఫేషియల్ రికగ్నిషన్, స్ర్కీన్ ఫ్లాష్, బ్యూటిఫై 4.0

స్మార్ట్ ఫేషియల్ రికగ్నిషన్, స్ర్కీన్ ఫ్లాష్, బ్యూటిఫై 4.0

స్మార్ట్ ఫేషియల్ రికగ్నిషన్, స్ర్కీన్ ఫ్లాష్, బ్యూటిఫై 4.0 వంటి ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌లను ఒప్పో ఈ కెమెరాలో పొందుపరిచింది. వీటిలో ఉపయోగించుకోవటం ద్వారా సెల్ఫీ క్వాలిటీ మరింతగా రెట్టింపు అవుతుంది. ఒకే ఒక్కమాటలో చెప్పాలంటే ఈ డ్యుయల్ సెల్ఫీ కెమెరాతో క్యాప్చుర్ చేసుకునే రెగ్యులర్ సెల్ఫీలతో పాటు గ్రూప్ సెల్ఫీలు అదరహో అనిపిస్తాయి.

ప్రీమియమ్ లుక్ ఈ ఫోన్ సొంతం...

ప్రీమియమ్ లుక్ ఈ ఫోన్ సొంతం...

స్టైల్ ఇంకా డ్యూరబులిటీ విషయంలో, ఏ మాత్రం రాజీ పడకుండా OPPO F3 ఫోన్‌ను రూపొందించినట్లు స్పష్టమవుతోంది. స్లీక్ మెటల్ యునిబాడీ డిజైన్ ఈ ఫోన్‌కు ప్రీమియమ్ లుక్‌ను తీసుకువచ్చింది.

మరింత స్మూత్‌ లుక్..

మరింత స్మూత్‌ లుక్..

మల్టీస్టేజ్ తయారీ ప్రాసెస్‌లో భాగంగా వివిధ దశల్లో ఈ ఫోన్‌లకు సాండ్ స్ప్రేయింగ్, స్టేజ్ పాలిషింగ్, అనేక రౌండ్ల సీఎన్‌సీ మిల్లింగ్ ఇవ్వటం జరుగుతుంది. దీంతో OPPO F3 ఫోన్‌ మరింత స్మూత్‌నెస్‌ను సంతరించుకుని ప్రీమియమ్ లుక్‌లో కనిపిస్తుంది.

స్మార్ట్ ఫింగర్ ప్రింట్ స్కానర్..

స్మార్ట్ ఫింగర్ ప్రింట్ స్కానర్..

ఫోన్ హోమ్ బటన్‌లో ఎంబెడ్ చేయబడిన స్మార్ట్ ఫింగర్ ప్రింట్ స్కానర్ మరింత స్మూత్ గా స్పందిస్తోంది. ఈ స్కానర్‌లో పొందుపరిచిన బయోమెట్రిక్ సెన్సార్ అలానే హైక్రోఫోబిక్ మెంబ్రేన్ వ్యవస్థలు స్కానర్ పై వేలును ఉంచిన ప్రతిసారి సహజసద్థమైన అనుభూతులకు లోను చేస్తాయి.

5.5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే

5.5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే

Oppo F3 ఫోన్ 5.5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ 2.5డి కర్వుడ్ గ్లాస్ డిస్‌ప్లేతో వస్తోంది. స్ర్కీన్ రిసల్యూషన్ వచ్చేసరికి 1920×1080 పిక్సల్స్. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 కోటింగ్ డిస్‌ప్లేకు అదనపు ప్రొటెక్షన్‌ను సమకూరుస్తుంది.

హార్డ్‌వేర్ అంశాలను పరిశీలించినట్లయితే..

హార్డ్‌వేర్ అంశాలను పరిశీలించినట్లయితే..

Oppo F3 ఫోన్‌లోని హార్డ్‌వేర్ అంశాలను పరిశీలించినట్లయితే.. ఆక్టా కోర్ MediaTek MT6750T చిప్‌సెట్ పై ఫోన్ రన్ అవుతుంది. Mali T86-MP2 జీపీయూ ఫోన్ గ్రాఫిక్ విభాగాన్ని చూసుకుంటుంది. 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం ఉంటుంది.

సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే..

సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే..

 ఇక సాఫ్ట్‌వేర్ విషయానికి వచ్చేసరికి Oppo F3 ఫోన్‌ ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మల్లో ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా డిజైన్ చేసిన ColorOS 3.0 స్కిన్ పై రన్ అవుతుంది. బ్యాటరీ విషయానికొస్తే Oppo F3 ఫోన్‌ 3,200mAh బ్యాటరీతో వస్తోంది.

డ్యుయల్ లెన్స్ సెల్ఫీ కెమెరా...

డ్యుయల్ లెన్స్ సెల్ఫీ కెమెరా...

Oppo F3 ఫోన్‌ ముందు భాగంలో డ్యుయల్ లెన్స్ సెల్ఫీ కెమెరాను ఏర్పాటు చేసారు. ఈ కెమెరా మాడ్యుల్ లో 16 మెగా పిక్సల్ + 8 మెగా పిక్సల్ లెన్స్ మాడ్యుల్స్ ఉంటాయి. వీటిలో ఒకటి స్టాండర్డ్ లెన్స్ కాగా, మరొకటి 120 డిగ్రీ వైడ్ యాంగిల్ లెన్స్. ఫోన్ వెనుక భాగంలో 13 మెగా పిక్సల్ కెమెరాను ఏర్పాటు చేయటం జరిగింది. OPPO F3 Plus మోడల్ తరహాలోనే OPPO F3 కూడా తన డ్యుయల్ సెల్ఫీ కెమెరా సెటప్‌తో సరికొత్త బెంచ్ మార్క్‌ను సెట్ చేయబోతోంది. F3 ఫోన్ లో ఏర్పాటు చేసిన డ్యుయల్ సెల్ఫీ కెమెరా ద్వారా స్టన్నింగ్ క్వాలిటీ సెల్ఫీలను క్యాప్చుర్ చేసుకోవచ్చు.

 Oppo F3 కనెక్టువిటీ ఫీచర్లు...

Oppo F3 కనెక్టువిటీ ఫీచర్లు...

హైబ్రీడ్ డ్యుయల్ సిమ్ సపోర్ట్, 4జీ వోల్ట్ సపోర్ట్, బ్లుటూత్ 4.1, ఫింగర్ ప్రింట్ స్కానర్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, జీపీఎస్ సపోర్ట్.

Best Mobiles in India

English summary
Experience wide-angle selfies in mid-range with the new Selfie Expert- OPPO F3. Read More in Telugu Gizbot...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X