చేతులు కలిపిన హిరోలు!

By Super
|

 చేతులు కలిపిన హిరోలు!

 

జపాన్‌కు చెందిన బహుళ జాతి టెక్ దిగ్గజం ఫుజిట్సు, ప్రముఖ భారతీయ టెలికమ్ సర్వీస్ ప్రొవైడర్ టాటా డొకొమోతో చేతులు కలిపింది. ఈ ఇరువురి భాగస్వామ్యంతో సరికొత్త వాటర్ ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్ ‘ఎఫ్-074 3జీ’మార్కెట్లోకి అడుగుపెట్టనుంది. ఈ అల్ట్రాసిమ్ వాటర్ ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్‌ను రూ.21,900 ధరకు బెంగుళూరులోని ప్రముఖ రిటైల్ స్టోర్‌లలో టాటా డొకొమో యూజర్ల కోసం ప్రత్యేకంగా అందుబాటులో ఉంచినట్లు విడుదల చేసిన పత్రికా ప్రకటనలో కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి.

టాటా డొకొమో, ఫుజిట్సు ఎఫ్-074 3జీ స్మార్ట్‌ఫోన్ కీలక స్పెసిఫికేషన్‌లు:

అల్ట్రాస్లిమ్ (కేవలం 6.7మిల్లీమీటర్ల మందం),

బరువు 105 గ్రాములు,

పటిష్టమైన స్ర్కాచ్ రెసిస్టెంట్ గ్లాస్,

ఆమోల్డ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,

స్ర్కీన్ సైజ్ తెలియాల్సి ఉంది,

5మెగా పిక్సల్ కెమెరా,

ప్రత్యేకతలు:

ఈ ఫోన్ తన డిస్‌ప్లే కాంతిని వాతవరణాన్ని బట్టి తనకి తానుగా సర్దుబాటు చేసుకుంటుంది.

డివైజ్‌లో ఏర్పాటు చేసిన మోషన్ కాన్సియన్ ఆడియో వ్యవస్థ ఎటువంటి పర్యావరణంలోనైనా క్లియర్ వాయస్‌ను అందిస్తుంది.

డొకొమో స్పెషల్ డేటా ప్లాన్స్:

ఈ ఫోన్ కొనుగోలు పై డొకొమో ఆకర్షణీయమైన వాయిస్ ఇంకా డేటా ప్యాకేజీలను అందిస్తోంది. ఈ సందర్భంగా అందుబాటులోకి తెచ్చిన అన్ లిమిటెడ్ 899 జీఎస్ఎమ్ పోస్ట్‌‌పే ప్లాన్ ద్వారా యూజర్ 3జీ సామర్ధ్యం గల 1జీబి డాటాను మూడు నెలల పాటు ఉచితంగా వినియోగించుకోవచ్చు. అంతేకాకుండా, ఏ ఇతర నెట్‌వర్క్‌ల‌కైనా లోకల్ ఇంకా ఎస్టీడీ కాల్స్‌ను అపరిమితంగా నిర్వహించుకోవచ్చు.

Most Read Articles
Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X