రంగంలోకి యోధానుయోధులు!

Posted By: Prashanth

రంగంలోకి యోధానుయోధులు!

 

సోషల్ నెట్‌వర్కింగ్ ప్రధానాంశంగా ఫేస్‌బుక్ ఓ స్మార్ట్‌ఫోన్‌ను రూపొందిస్తున్నట్లు న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. ఈ ఫోన్ రూపకల్పనలో భాగంగా టెక్నాలజీ విభాగంలో యోధానుయోధులైన ఆరుగురు మాజీ ఆపిల్ ఇంజనీర్లతో ఫేస్‌బుక్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఈ మీడియా పేర్కొంది. ఈ ఆరుగురు సభ్యుల బృందం ఐఫోన్, ఐప్యాడ్‌ల నిర్మాణంలో కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది.

స్మార్ట్‌ఫోన్‌లలో ప్రత్యేకమైన ఫేస్‌బుక్ అప్లికేషన్‌లను పొందుపరిచిన నాటి‌నుంచి సోషల్‌నెట్ వర్కింగ్‌ను వినియోగించే యూజర్ల సంఖ్య మరింత పెరగుతూ వస్తుంది. ఈ విషయాన్ని ఆదిలోనే పరిగణంలోకి తీసుకున్న ఫేస్‌బుక్ యాజమాన్యం హెచ్‌టీసీతో జతకట్టి ‘చాచా’, ‘సల్సా’ మోడళ్లలో రెండు ఆండ్రాయిడ్ ఆధారిత ఫేస్‌బుక్ ఫోన్‌లను విడుదల చేసింది. అయితే, ఆశించిన స్థాయిలో ఆదరణ దక్కలేదు. తాజాగా ఫేస్‌బుక్ , వొడాఫోన్‌తో జతకట్టి వొడాఫోన్ ఫేస్‌బుక్ ఫోన్‌ను అందుబాటులోకి తెచ్చింది. పేరు ‘బ్లూ 555’.

హెచ్‌టీసీ ‘చాచా’ ఇప్పుడు తగ్గింపు ధరతో..

స్టైలిష్ బ్రాండ్‌గా గుర్తింపుతెచ్చుకున్న హెచ్‌టీసీ 2011, ఆగష్టులో క్వీర్టీ కీప్యాడ్‌తో కూడిన ‘చాచా’ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. బ్రాండ్ నుంచి విడుదలైన తొలి క్యాండీ‌ బార్ ఫోన్‌గా హెచ్‌టీసీ చాచా గుర్తింపుతెచ్చుకుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రధాన విశిష్టతను పరిశీలిస్తే నేరుగా ఫేస్‌బుక్‌లోకి ప్రవేశించేవచ్చు. ఇందు కోసం ప్రత్యేక బటన్‌ను కీప్యాడ్ కిందభాగంలో అమర్చారు. సోషల్‌ నెట్‌వర్కింగ్ సైట్లతో అనుసంధానించబడిన ఈ ఫోన్ కమ్యూనికేషన్ బంధాలను మరింత బలపరుస్తుంది.

ఈ హ్యాండ్‌సెట్ ఆవిష్కరణ సమయంలో కంపెనీ నిర్ధేశించిన ధర రూ. 15,000. మారిన పరిస్థితుల నేపధ్యంలో ఈ ధరను 12,500కు తగ్గించారు. ప్రముఖ ఆన్‌లైన్ స్టోర్ Saholic.com, ఈ ఫోన్ కొనుగోలు పై రూ.3,000 రాయితీని ప్రకటించింది. అంటే ఈ రిటైలర్ ద్వారా ‘హెచ్‌టీసీ చాచా’ను రూ.9,699కి సొంతం చేసుకోవచ్చన్నమాట. బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నవారికి ఈ డివైజ్ ఉత్తమ ఎంపిక. ప్రత్యర్థి బ్రాండ్‌లకు పోటీనివ్వటంలో ‘హెచ్‌టీసీ చాచా’ వైఫల్యం చెందటం కారణంగానే ధర తగ్గింపు నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది.

హెచ్‌టీసీ చాచా ప్రధాన ఫీచర్లు:

2.6 అంగుళాల టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే,

రిసల్యూషన్ 480 x 320పిక్సల్స్,

5మెగా పిక్సల్ రేర్ కెమెరా,

వీజీఏ ఫ్రంట్ కెమెరా,

ఆండ్రాయిడ్ 2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటిగ్ సిస్టం.

హెచ్‌టీసీ సెన్స్ v2.1 యూజర్ ఇంటర్ ఫేస్,

800మెగాహెడ్జ్ ప్రాసెసర్,

ఫేస్‌బుక్ బటన్

512ఎంబీ ర్యామ్.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot