తెరపైకి ఫేస్‌బుక్ హెచ్‌టీసీ ఫోన్?

Posted By:

గత కొన్ని సంవత్సరాలుగా ఫేస్‌బుక్ ఫోన్ పై పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఫేస్‌బుక్ ప్రకటించబోయే హెచ్‌టీసీ స్మార్ట్‌ఫోన్ పై మరోసారి ఉత్కంఠకు తెరలేచింది. సోషల్ నెట్‌వర్కింగ్ దిగ్గజం ఫేస్‌బుక్ ‘కమ్ సీ అవర్ న్యూ హోమ్ ఆన్ ఆండ్రాయిడ్' (Come See Our New Home on Android) పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏప్రిల్ 4న ఏర్పాటు చేసింది.

ఈ ప్రెస్ ఈవెంట్‌కు సంబంధించిన ఆహ్వాన పత్రాలు టెక్ మీడియాకు ఇప్పటికే అందినట్లు తెలుస్తోంది. గత కొద్ది వారాలుగా ఫేస్‌బుక్, హెచ్‌టీసీతో జతకట్టి ఒక ప్రచారం కార్యక్రమం నిమిత్తం పనిచేస్తున్నట్లు 9టూ5 గూగుల్ వెల్లడించింది. టెక్‌క్రంచ్ వెలువరించిన వివరాల మేరకు హెచ్‌టీసీ డిజైన్ చేస్తున్న ఫేస్‌బుక్ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ ఆధునిక వర్షన్ ఆపరేటింగ్ సిస్టం ఇంకా అంతర్నిర్మిత ఫేస్‌బుక్ కార్యాచరణ వ్యవస్థను కలిగి ఉండొచ్చని తెలుస్తోంది.

ఫేస్‌బుక్ ఫోన్‌కు సంబంధించి గత నెలలో బహిర్గతమైన పలు ఊహాజనిత స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే... 1.5గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ స్నాప్‌డ్రాగెన్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 4.3 అంగుళాల టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1.6 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

2011లో హెచ్‌టీసీ రెండు ఫేస్‌బుక్ ఫోన్‌లను విడుదల చేసింది. హెచ్‌టీసీ చాచా, హెచ్‌టీసీ సల్సా మోడళ్లలో విడుదలైన ఈ స్మార్ట్‌ హ్యాండ్‌సెట్‌లు ప్రత్యేకమైన ఫేస్‌బుక్ బటన్‌ను కలిగి ఉంటాయి. అయితే, ఈ ఫోన్‌లు అనుకున్నరీతిలో హిట్ కాలేదు. ఫేస్‌బుక్, హెచ్‌టీసీ ఆధ్వర్యంలో మరోసారి రూపుదిద్దుకుంటున్న స్మార్ట్‌ఫోన్ ఏ మేరకు విజయంసాధిస్తుందో వేచిచూడాలి. ఫేస్ బుక్ స్మార్ట్ ఫోన్ కాన్సెఫ్ట్ ఫోటోలను క్రింది ఫోటోగ్యాలరీలో చూడొచ్చు.

స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ఇంకా ట్యాబ్లెట్ పీసీలకు సంబంధించి మరిన్ని గ్యాలరీలను చూడాలనకుంటే క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

తెరపైకి ఫేస్‌బుక్ హెచ్‌టీసీ ఫోన్?

తెరపైకి ఫేస్‌బుక్ హెచ్‌టీసీ ఫోన్?

తెరపైకి ఫేస్‌బుక్ హెచ్‌టీసీ ఫోన్?

తెరపైకి ఫేస్‌బుక్ హెచ్‌టీసీ ఫోన్?

తెరపైకి ఫేస్‌బుక్ హెచ్‌టీసీ ఫోన్?

తెరపైకి ఫేస్‌బుక్ హెచ్‌టీసీ ఫోన్?

తెరపైకి ఫేస్‌బుక్ హెచ్‌టీసీ ఫోన్?

తెరపైకి ఫేస్‌బుక్ హెచ్‌టీసీ ఫోన్?

తెరపైకి ఫేస్‌బుక్ హెచ్‌టీసీ ఫోన్?

తెరపైకి ఫేస్‌బుక్ హెచ్‌టీసీ ఫోన్?

తెరపైకి ఫేస్‌బుక్ హెచ్‌టీసీ ఫోన్?

తెరపైకి ఫేస్‌బుక్ హెచ్‌టీసీ ఫోన్?

తెరపైకి ఫేస్‌బుక్ హెచ్‌టీసీ ఫోన్?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot