ఫేస్‌బుక్ కోసం మొబైలా, ఐతే మోటరోలా లేదా హెచ్‌టిసి

Posted By: Super

ఫేస్‌బుక్ కోసం మొబైలా, ఐతే మోటరోలా లేదా హెచ్‌టిసి

ఇంటర్నెట్ ప్రపంచంలో సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్స్ ఉన్నంత గిరాకీ మరే ఇతర వెబ్ సైట్స్‌కు లేదు. రోజు మొత్తం మీద ఒక మనిషి 18 గంటలు ఇంటర్నెట్లో గడుపుతున్నాడని అనుకుంటే అందులో 15 గంటలు సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్స్‌కే టైమ్ కేటాయిస్తున్నాడని ఇటీవల ఓ సర్వేలో తేలింది. దీనిని ఆధారంగా చేసుకోని మొబైల్ తయారీ సంస్దలు కూడా తమయొక్క మొబైల్స్‌ని ఫేస్ బుక్ కోసం ప్రత్యేకంగా తయారు చేస్తున్నారు. ఫేస్ బుక్ కోసం ప్రత్యేకంగా మొబైల్స్‌ని తయారు చేసిన సంస్దలలో మోటరోలా, హెచ్‌టిసి కంపెనీలు ముందంజలో ఉన్నాయి. ఈ రెండు మొబైల్స్ యొక్క విశిష్టతలను క్షుణ్ణంగా పరిశీలించినట్లైతే ఈ క్రింది విధంగా ఉన్నాయి.

హెచ్‌టిసి చాచా ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అయ్యేటటువంటి స్మార్ట్ ఫోన్. అంతేకాకుండా 600 MHz ప్రాసెసర్‌ని కలిగి ఉండి ఫేస్ బుక్, ట్విట్టర్‌ని చాలా ఫాస్టుగా యాక్సెస్ చేసే అవకాశం ఉంది. హెచ్‌టిసి చాచా మొబైల్ ఐడెంటికల్ నెట్ వర్క్ టెక్నాలజీని సపోర్ట్ చేస్తుంది. మొబైల్ వెనుక భాగాన 5 మెగా ఫిక్సల్ కెమెరా ఉండడం వల్ల చూడచక్కని ఇమేజిలను, వీడియోలను తీయవచ్చు. అంతేకాకుండా వాయిస్, వీడియో రికార్డింగ్ ఫీచర్‌లను సపోర్ట్ చేస్తూ, ఎల్‌ఈడి ఫ్లాష్‌ని కలిగి ఉన్నాయి. ఇక ముందు భాగంలో ఉన్న విజిఎ కెమెరాతో వీడియో కాలింగ్ ఫీచర్‌ని సపోర్ట్ చేస్తాయి. హెచ్‌టిసి చాచా ఇంటర్నల్‌గా 512 ఎమ్‌బి ROMని కలిగి ఉంది.

మొబైల్స్‌తో పాటు ఇంటర్నల్‌గా కొంత మొమొరీ రాగా, అదే మొమొరీని 32జిబీ వరకు ఎక్పాండ్ చేసుకునేటటువంటి వెసులుబాటు కూడా ఉంది. ఇక కమ్యూనికేషన్, కనెక్టివిటీ టెక్నాలజీలైన బ్లూటూత్, వై-పైలను కూడా సపోర్ట్ చేస్తాయి. హెచ్ టిసి చాచాలో ఉండే మరికొన్ని ఫీచర్స్ ఏమిటంటే జిపిఎస్ నావిగేషన్ అప్లికేషన్స్ అయినటువంటి డాక్యుమెంట్ వివర్, జీమెయిల్, గూగుల్ మ్యాప్ డౌన్ లోడ్ అప్లికేషన్స్, పికాసా ఇంటిగ్రేడెడ్ గూగుల్ సెర్చ్ తోపాటుగా కొత్తదైన వై-పై 8.2.11 బ్యాక్ అప్ కూడా దీని ప్రత్యేకం. హెచ్ టిసి చాచా‌ని ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేయడం జరిగింది. దీని ఖరీదు సుమారుగా రూ 14,999గా నిర్ణయించడం జరిగింది.

మోటరోలా ఈఎక్స్ 225 మొబైల్ కీబోర్డ్‌ని ప్రత్యేకంగా పేస్‌బుక్ కోసమే తయారు చేయడమే కాకుండా కొన్ని బటన్స్ కూడా ప్రత్యేకంగా రూపోందిచడం జరిగింది. యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్‌ని అందించేందుకు గాను 2.4 ఇంచ్ టిఎఫ్టి డిస్ ప్లే దీని సొంతం. మోటరోలా ఈఎక్స్ 225 మొబైల్ ఫీచర్స్‌ని క్షుణ్ణంగా పరిశీలిద్దాం..

మోటరోలా ఈఎక్స్ 225 మొబైల్ ప్రత్యేకతలు:

డిస్ ప్లే
టైపు: TFT capacitive touchscreen, 256K colors
సైజు: 2.4 inches, QWERTY keyboard

సౌండ్
అలర్ట్ టైప్స్: Vibration, MP3 ringtones
లౌడ్ స్పీకర్: Yes
3.5mm ఆడియో జాక్: Yes

మొమొరీ
ఫోన్‌బుక్: Yes, Photocall
కాల్ రికాల్డ్స్: Yes
మొమొరీ కార్డ్ స్లాట్: microSD, up to 32GB

డేటా
జిపిఆర్‌ఎస్: Yes
ఎడ్జి: Yes
3జీ: No
వైర్‌లెస్ ల్యాన్: No
బ్లాటూత్: Yes, v2.1 with A2DP, EDR
ఇన్‌ప్రారెడ్ పోర్ట్: No
యుఎస్‌బి: Yes, microUSB v2.0, HS

కెమెరా
ప్రైమరీ కెమెరా: 3.15 MP, 2048x1536 pixels
వీడియో: Yes
సెకండరీ కెమెరా: No

సాప్ట్ వేర్
మెసేజింగ్: SMS, MMS, Email, IM
బ్రౌజర్: WAP 2.0/xHTML
రేడియో: Stereo FM radio with RDS
గేమ్స్: Yes
మొబైల్ లభించు కలర్స్: Black
జిపిఎస్: No
జావా: SNS integration, MP4/H.263 player, Organizer, Voice memo,YouTube

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot