ఫేస్‌బుక్ మిత్రుల కోసం ‘saythanks’ వీడియో టూల్

|

సోషల్ నెట్‌వర్కింగ్ దిగ్గజం ఫేస్‌బుక్ ‘saythanks' పేరుతో సరికొత్త వీడియో టూల్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఏడాది మొదట్లో కూడా ‘look Back' పేరుతో ఓ వీడియో టూల్‌ను ఫేస్‌బుక్ అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే.

 

ఫేస్‌బుక్ ఆవిష్కరించిన సరికొత్త ‘సేథ్యాంక్స్' వీడియో టూల్ ద్వారా మిత్రులకు కృతజ్ఞతలు తెలుపుతు వీడియో కార్డులను పంపవచ్చు. వారితో పంచుకున్న మధుర క్షణాలు, అనుభూతులను వీడియోగా మలిచి వారివారి టైమ్ లైన్స్ పై షేర్ చేసేందుకు ‘సేథ్యాంక్స్' వీడియో టూల్ ఉపకరిస్తుంది.

 
 ఫేస్‌బుక్ మిత్రుల కోసం ‘saythanks’ వీడియో టూల్

ఫేస్‌బుక్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన saythanks వీడియో టూల్‌ను వినియోగించటం ఏలా..?

- ముందుగా మీ ఫేస్‌బుక్ అకౌంట్‌ను ఓపెన్ చేసి https://www.facebook.com/thanks లింక్‌లోకి వెళ్లండి

- ఇప్పుడు ఓపెన్ అయ్యే సేథ్యాంక్స్ పేజీలో ‘Say Thanks Make a video for a friend' క్రింద సెర్చ్ బాక్స్ కనిపిస్తుంది. మీరు ఏ ఫ్రెండ్‌కు ‘Say Thanks' వీడియో కార్డును పంపాలనుకుంటున్నారో వారి పేరును సెలక్ట్ చేసుకోండి.

- క్రింద కనిపించే Choose a theme ఆప్షన్‌లో Old Friends, Friends అనే రెండు థీమ్‌లు కనిపిస్తాయి. వాటిలో మీకు నచ్చిన థీమ్‌ను సెలక్ట్ చేసుకోండి.

- క్రింద కనిపించే Choose photos and postsలో ‘Add Photos' అనే ఆప్షన్‌ను క్లిక్ చేసినట్లయితే వీడియో కార్డ్ పంపబోయే మిత్రునికి సంబంధించి మన కంప్యూటర్‌లో ఉన్న ఫోటోలను అప్‌లోడ్ చేసి వాటిని ‘Say Thanks' వీడియోలో ఉండేవిధంగా చూసుకోవచ్చు. (మీరు కంప్యూటర్ నుంచి అప్‌లోడ్ చేసే ఫోటోల సంఖ్య 5 కంటే తక్కువ ఉండకూడదు). లేదంటే అతని ప్రొఫైల్‌లో కనిపించే ఫోటోలను సెలక్ట్ చేసుకున్నట్లయితే అవి ‘Say Thanks' వీడియోలో జత అవుతాయి.

- పైన పేర్కొన్న ప్రక్రియ పూర్తి అయిన తరువాత ప్లే బటన్ పై క్లిక్ చేసి సదరు వీడియో ప్రివ్యూను చూసుకోవచ్చు.

- చిట్టచివరిగా వీడియో కార్డ్ పై కనిపించే ‘share video' ఆప్షన్ పై క్లిక్ చేసినట్లయితే ఆ ఫ్రెండ్‌కు ‘Say Thanks' వీడియో కార్డ్ షేర్ అవుతుంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

English summary
Facebook's Say Thanks lets you send video cards to your friends. Read more in Telugu Gizbot....

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X