ఫేస్‌‍బుక్ కొత్త ‘ట్విస్ట్’

Posted By: Prashanth

ఫేస్‌‍బుక్ కొత్త ‘ట్విస్ట్’

 

ప్రముఖ సామాజిక సంబంధాల వెబ్‌సైట్ ఫేస్‌బుక్ కొత్త ‘ట్విస్ట్’కు తెరలేపింది. టెక్నాలజీ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తూ జనవరి 15న ఓ ప్రత్యేక కార్యక్రమానికి ఫేస్‌బుక్ శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమంలో ఫేస్‌బుక్ చేపట్టబోయే ఆవిష్కరణకు సంబంధించి సర్వత్రా ఉత్కంఠ వాతావరణం నెలకుంది. ఈ వేదిక ద్వారా చేపట్టబోయే ఆవిష్కరణల పై భిన్న వాదనలు వ్యక్తమవుతున్నాయి.

ఇన్స్‌టాగ్రామ్ తరహాలో సరికొత్త సర్వీస్‌ను ఫేస్‌బుక్ పరిచయం చేయనుందని పలువురు అభిప్రాయపడుతుంటే మరి కొందరు మాత్రం ఓ ప్రత్యేక స్మార్ట్‌ఫోన్ ఈ వేదిక ద్వారా పరిచయం కాబోతుందని జోశ్యం చెబుతున్నారు. గతనివేదికలను పరిశీలించినట్లయితే ఫేస్‌బుక్ ఓ ప్రత్యేక స్మార్ట్‌ఫోన్‌కు రూపకల్పన చేస్తున్నట్లు వార్తలు వినిపించాయి. ఫోన్ ఊహాజనిత స్పెసిఫికేషన్‌లను పరిశీలిస్తే..... ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1.4గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్రాసెసర్.

హెచ్‌టీసీ ఈ ఫోన్‌ను డిజైన్ చేస్తున్నట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి. ఏదేమైనప్పటికి ఫేస్‌బుక్ చేపట్టబోయే ఆవిష్కరణకు సంబంధించి నెలకున్న సందిగ్ధతకు తెరపడాలంటే జనవరి 15వ తేది వరకు ఎదురుచూడక తప్పదు.

ఫేస్‌బుక్ ఆఫీసులు (వరల్డ్ వైడ్)

Read In English

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting