TRENDING ON ONEINDIA
-
మంత్రి ఆదికి షాక్: జమ్మలమడుగు అభ్యర్ధిని తేల్చేసారు
-
మీ పాత కారుని కొత్తగా మార్చటం ఎలా.?
-
రూ.4999కే led hd smart tv, ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకోండి
-
వాళ్లంతా మహానుభావులు.. అమ్మాయిల క్లీవేజ్, తొడలు చూసేస్తారు.. నాగబాబు ఘాటు వ్యాఖ్యలు!
-
కోబ్రా దెబ్బకు షారుఖ్ కంపెనీ గింగిరాలు?
-
చీర కట్టుకోవడాన్ని అమితంగా ఇష్టపడుతారా ? ప్రయాణాలకు ఈ చీరలు
ఫేస్‌బుక్ చేతికి వాట్స్‌యాప్ కొనుగోలు విలువ 19 బిలియన్ డాలర్లు
సామాజిక సంబంధాల అనుసంధాన వేదిక ఫేస్‌బుక్, ప్రముఖ మొబైల్ మెసెంజర్ సర్వీస్ వాట్స్ యాప్ (WhatsApp)ను 19 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేయనున్నట్లు బుధవారం ప్రకటించింది. ఈ ఒప్పందంలో భాగంగా 4 బిలియన్ డాలర్లను క్యాష్ రూపంలో, 12 బిలియన్ డాలర్లను షేర్ల రూపంలో చెల్లిస్తున్నట్లు ఫేస్‌బుక్ యాజమాన్యం ప్రకటించింది. మిగిలిన 3 బిలియన్ డాలర్లను పరిమిత స్టాక్ యూనిట్ల రూపంలో నాలుగు సంవత్సరాల తరువాత క్యాష్ చేసుకునే విధంగా వాట్స్‌యాప్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఫేస్‌బుక్ వెల్లడించింది. ఈ డీల్‌ను టెక్నాలజీ ప్రపంచంలోనే అతిపెద్ద కొనగోలుగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.
వాట్స్ యాప్ సర్వీసులును కాలిఫోర్నియా ముఖ్య కేంద్రంగా 2009లో ప్రారంభించారు. వేగవంతంగా విస్తరిస్తున్న ఈ మొబైల్ మెసెంజర్ సర్వీసుకు ప్రపంచవ్యాప్తంగా 450మిలియన్ల యూజర్లు ఉన్నారు. ఇండియాలో వాట్స్‌యాప్‌ను వినియోగించుకునే వారి సంక్య 35 మిలియన్లు. వాట్స్‌యాప్ మొబైల్ మెసేజింగ్ సర్వీసులకు యూరోప్, లాటిన్ అమెరికా ఇంకా ఇండియాలో మంచి ఆదరణ లభిస్తోంది.
ఆకర్షణీయమైన ఐఫోన్ కేస్‌ను గెలుచుకునే ఆఖరి అవకాశాన్ని గిజ్‌బాట్ కల్పిస్తోంది. త్వరపడండి!!
వాట్స్‌యాప్ మెసెంజర్ అప్లికేషన్, యాపిల్.. ఆండ్రాయిడ్.. బ్లాక్‌బెర్రీ.. విండోస్..సింబియన్..ఆషా వంటి ప్లాట్‌ఫామ్‌లను సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్‌లను వినియోగించే వారు వాట్స్‌యాప్ అప్లికేషన్ సాయంతో స్నేహితులకు, బంధువులకు మెసేజ్‌లు, పిక్షర్స్, వీడియో సేందేశాలను ఏ విధమైన ఛార్జీలు లేకుండా అపరిమితంగా పంపుకోవచ్చు. 3జీ ఇకా వై-ఫై నెట్‌వర్క్‌ల పై ఈ యాప్ స్పందిస్తుంది. అంటే మీ స్మార్ట్‌ఫోన్‌కు ఇంటర్నెట్ సదుపాయం ఉంటే చాలు వాట్స్‌యాప్ సర్వీసులను ఉపయోగించుకోవచ్చు. మొదటి ఏడాది ఈ సేవాలను ఉచితంగా పొందవచ్చు. మొబైల్ నెంబరు ఆధారంగా ఈ యాప్ పనిచేస్తుంది. గ్రూప్ చాటింగ్ సౌకర్యాన్ని కూడా వాట్స్‌యాప్ కల్పిస్తోంది.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.