చైనాలో ఐపోన్ 5 రూ 1395 మాత్రమే..

Posted By: Super

చైనాలో ఐపోన్ 5 రూ 1395 మాత్రమే..

ఆపిల్ ఉత్పత్తులను ప్రపంచ నెంబర్ వన్‌గా నిలబెట్టినటువంటి ఐఫోన్ 5 ఇప్పుడు చైనాలో కేవలం రూ 1395కి మాత్రమే లభిస్తుంది. ఏంటీ ఆశ్చర్యపోతున్నారా ఐఫోన్ ధర అంత తక్కువా అని. కంగారు పడకండి ఈ ఐఫోన్ 5 ఆపిల్ కంపెనీ విడుదల చేసినటువంటి ఐఫోన్ కాదులెండి. ఆపిల్ సంస్థ ఐఫోన్‌-5 వర్షన్‌ను ఎప్పుడు విడుదల చేస్తుందో తెలియదుగానీ, చైనా మార్కెట్లో హెచ్‌'ఐఫోన్‌-5' పేరిట స్మార్ట్‌ ఫోన్లు 31 డాలర్లకే (సుమారు 1395 రూపాయలు) అమ్ముతున్నారు. పూర్తి ఐఫోన్‌ తరహాలోనే ఉండే ఈ ఫోన్లలో ఐఫోన్‌ 3, 4 వర్షన్‌లలో ఉన్న దాదాపు అన్ని ఫీచర్లూ ఉండడం గమనార్హం.

ఇది ఐఫోన్‌-5కు వంద శాతం డూప్లికేట్‌గా విశ్లేషకులు భావిస్తున్నారు. చైనాలోని టాప్‌ ఇ-కామర్స్‌ ఫ్లాట్‌ఫాం తావ్‌బోవాపై ఈ ఫోన్లను రోజుకు వేలకొద్దీ విక్రయిస్తున్నట్టు తెలుస్తోంది. నెట్‌ ప్రపంచంలో సుపరిచితమైన అలీబాబా గ్రూప్‌ ఈ వెబ్‌సైట్‌ను నిర్వహిస్తోంది. ఇదే ఫోన్‌ను షాంగై మొబైల్‌ మార్కెట్లో కొనుగోలు చేయాలంటే 800 యువాన్‌లను (సుమారు 124 డాలర్లు) చెల్లించాల్సి వుంటుందని, చౌకగా లభిస్తుందనే నెట్‌ మాధ్యమంలో కొనుగోళ్ళు జరుగుతున్నాయని చైనా దినపత్రిక మెట్రో ఎక్స్‌ప్రెస్‌ ప్రకటించింది. అతి త్వరలో భారత్‌ వంటి దేశాలకు రవాణా కానున్న ఈ సెల్‌ఫోన్‌ మొబైల్‌ రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతుందని అంచనా.

కాగా, ఆపిల్ సంస్థ ఐఫోన్‌-5ను ఇంకా బయటి ప్రపంచానికి చూపించలేదు. లీకైన, ఊహాజనితమైన ఇమేజ్‌లు మినహా మరే ఇతర సమాచారం ఆ ఫోన్‌ గురించి తెలియదు. అయితే, ఈ ఫోన్‌ చాలా తేలికగా, చిన్న ప్లాస్టిక్‌ బొమ్మలా ఉంటుందని సంస్థ ఉద్యోగులు కొందరు బయట వెల్లడించడం జరిగింది. ఇది ఇలా ఉంటే ఆపిల్ కంపెనీ ఆపిల్‌ ఐపోన్ 5ని సెప్టెంబర్‌‌లో లేదా ఆక్టోబర్ మొదటి వారంలో మార్కెట్లోకి విడుదల చేయనుందని మొబైల్ నిపుణుల అభిప్రాయం. ఈ నకిలీ ఐఫోన్ 5 నుండి అసలు కస్టమర్స్‌ని తప్పించడానికి ఆపిల్ ఏమి చేస్తుందో చూద్దాం.

ఐపాడ్‌ అమ్మకాలు ఆపిల్‌ కంపెనీని షేర్ మార్కెట్లో నెంబర్ వన్ స్దానానికి చేర్చాయి. బుధవారం నాటి స్టాక్‌ సెషన్‌లో ప్రపంచంలోనే అత్యధిక మార్కెట్‌ విలువను కలిగివున్న ఎక్సన్‌ మొబిల్‌ను ఆపిల్‌ అధిగమించింది. ఐపాడ్‌తో పాటు కంప్యూటర్‌ తదితర ఉత్పత్తుల్లో తాము పాటిస్తున్న నాణ్యత వినియోగదారులను ఎంతో ఆకర్షించిందని, అందువల్లే అమ్మకాలు గణనీయంగా పెరిగి ఈ స్థాయికి చేరామని సంస్థ తెలిపింది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot