బ్లాక్‌బెర్రీ కొత్త స్మార్ట్‌ఫోన్ విశేషాలేంటి..?

By Prashanth
|

BlackBerry 10

కెనాడకు చెందిన ప్రముఖ కంపెనీ రిసెర్చ్ ఇన్ మోషన్ (రిమ్) సరికొత్త ఆవిష్కరణలకు ముస్తాబవుతోంది. తన సరికొత్త ఆపరేటింగ్ సిస్టం బ్లాక్‌బెర్రీ 10 (బీబీ10)తో పాటు ఆధునిక వర్షన్ స్మార్ట్‌ఫోన్‌లను ఈ నెల 30న విడుదల చేసేందుకు సన్నద్ధమవుతోంది. ఈ నేపధ్యంలో రిమ్ సరికొత్త వర్షన్ స్మార్ట్ర్‌ఫోన్‌ల పై ఉత్కంఠ వాతావరణం నెలకుంది. ఈ సరికొత్త బ్లాక్‌బెర్రీ హ్యాండ్‌సెట్‌లు ఐఫోన్5, సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3, గెలాక్సీ నోట్2 వంటి అధిక ముగింగు స్మార్ట్‌ఫోన్‌లతో తలపడగలవని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. ఈ నేపధ్యంలో బీబీ10 స్మార్ట్‌ఫోన్‌ల స్పెసిఫికేషన్‌ల పై ఫోకస్...

<strong>ది బెస్ట్ 10 మొబైల్ ఫోన్‌లు (2012)</strong>ది బెస్ట్ 10 మొబైల్ ఫోన్‌లు (2012)

బ్లాక్‌బెర్రీ ఇతర మోడళ్లతో పోలిస్తే సరికొత్త బీబీ10 స్మార్ట్‌ఫోన్‌లో ఏర్పాటు చేసిన ఫిజికల్ కీబోర్డ్ ఫీచర్ ఆకట్టుకుంటోంది. సరికొత్త టచ్‌స్ర్కీన్ కీబోర్డ్ వేగవంతమైన టైపింగ్‌కు ఉపకరిస్తుంది. బ్లాక్‌బెర్రీ 10 డివైజుల్లో హోమ్ బటన్ ఉండదు. అయితే, గెస్ట్యర్ ఆధారిత డిజైన్ ఆకట్టుకుంటోంది. సరికొత్త బీబీ10 బ్రౌజర్ వేగవంతమైన బ్రౌజింగ్‌ను చేరువ చేస్తుంది. ఫోన్ కెమెరాకి సంబంధించి ఏర్పాటు చేసిన టైమ్‌షిఫ్ట్ ఫీచర్ అత్యుత్తమ ఫోటోగ్రఫీ అనుభూతులకు లోను చేస్తుంది.

‘బ్లాక్‌బెర్రీ జడ్10’ స్పెసిఫికేషన్‌లు!

బ్లాక్‌బెర్రీ కొత్త స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన తాజా సమాచారం వెబ్ ప్రపంచంలో హల్‌చల్ చేస్తోంది. ప్రముఖ వెబ్ పోర్టల్ ఫోన్ యరీనా సంబంధిత వివరాలను పేర్కొంటూ ఓ శీర్షికను ప్రచురించింది. రిసెర్చ్ ఇన్ మోషన్ (రిమ్) బ్లాక్‌బెర్రీ ఫోన్‌లకు రూపకల్పన చేస్తున్న విషయం తెలిసింది. సదరు సైట్ ద్వారా సేకరించిన వివరాల మేరకు బ్లాక్‌బెర్రీ కొత్త స్మార్ట్‌ఫోన్ ‘జడ్10’ స్పెసిఫికేషన్‌లు ఈ విధంగా ఉన్నాయి.

తెలుగు హిరోల సెల్‌ఫోన్‌లు (గ్యాలరీ)!

- బ్లాక్‌బెర్రీ 10 ఆపరేటింగ్ సిస్టం,

- 3జీ ఫోన్,

- 1.5గిగాహెట్జ్ టీఐ వోఎమ్ఏపి 4470 ప్రాసెసర్,

- 4.2 అంగుళాల స్ర్కీన్,

- 2జీబి ర్యామ్,

- 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్,

- స్వాపబుల్ మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,

- 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఆటో ఫోకస్),

- 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

- 1800ఎమ్ఏహెచ్ రిమూవబుల్ బ్యాటరీ.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X