రూ. 15 వేలకే యాపిల్ ఐఫోన్!

Posted By: Super

రూ. 15 వేలకే యాపిల్ ఐఫోన్!

యాపిల్ ఐఫోన్ అంటే ఎవరికి మాత్రం క్రేజ్ ఉండదు చెప్పండి. కంప్యూటర్ ఉత్పత్తుల తయారీలో ప్రపంచ వ్యాప్తంగా తనకంటూ ఓ ప్రత్యేక బ్రాండ్ ఇమేజ్‌ను ఏర్పరుచుకున్ను 'యాపిల్' వివిద దేశాల్లో అందిస్తున్న స్మార్ట్‌ఫోన్ 'ఐఫోన్‌' ఇకపై అందరికీ అందుబాటులో ఉండేలా సరసమైన ధరకే లభ్యం కానున్నట్లు సమాచారం. ఐఫోన్ అంటే అందరికీ ఇష్టం ఉన్నప్పటికీ.. ఆ ఫోన్ అధిక ధరను కలిగి ఉన్న కారణంగా సామాన్యులకు ఇది చేరువ కాలేకపోతుంది.

అయితే, ఇప్పుడు ట్రెండ్ మారింది. స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో పోటీ పెరిగి వేడి వాతావరణం నెలకొంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మొబైల్ తయారీదారులు ఐఫోన్‌లో ఉన్న ఫీచర్లను తమ ఫోన్లలో కూడా లభ్యమయ్యేలా చౌక ధరకే అందిస్తుండటంతో భారత మొబైల్ మార్కెట్లో ఐఫోన్ హవా అంతంత మాత్రంగా మారిపోయిందనే చెప్పాలి. ఏదేమైనప్పటికీ, ఐఫోన్‌కు పోటీగా మార్కెట్లోకి ఎన్ని బ్రాండ్‌లు వచ్చినా యాపిల్ పెద్దగా పట్టించుకోవడం లేదు.

ఎందుకంటే, ఈ విశిష్టమైన బ్రాండ్ పట్ల వినియోగదారుల్లో ఉన్న క్రేజ్ ఏంటో యాపిల్‌కు తెలుసు. కానీ, నోకియా, శాంసంగ్ వంటి ప్రముఖ మొబైల్ కంపెనీలు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్ఠమ్‌తో తక్కువ ధరకే అందిస్తున్న స్మార్ట్‌ఫోన్లకు గిరాకీ ఊపందుకోవడంతో యాపిల్ సమాలోచనలో పడింది. వినియోగదారుల సంఖ్యను పెంచుకునేందుకు కంపెనీ ప్రయత్నాలు మొదలు పెట్టింది. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ప్రవర్తించడం ప్రారంభించింది.

ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు ఇదే పెద్ద చర్చనీయాంశం అయింది. ఓ వెబ్‌సైట్ రిపోర్ట్ ప్రకారం.. యాపిల్ ప్రస్తుతం ఓ చౌక ఐఫోన్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఇది విడుదల కావచ్చనే కథనాలు కూడా ఉన్నాయి. యాపిల్ కొత్తగా విడుదల చేయనున్న చౌక రకం ఐఫోన్ 3జిఎస్ వేరియంట్ కావచ్చని భావిస్తున్నారు. ఇకపోతే దీని ధర సుమారు. 15,000 వరకు ఉండొచ్చని అంచనా. మరి ఐఫోన్‌ను సొంతం చేసుకోవాలనుకునే వారి కలను యాపిల్ నిజం చేస్తుందో లేదా వేచి చూద్దాం.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot