ఉత్కంఠకు తెరదించిన నోకియా!!

Posted By: Super

 ఉత్కంఠకు తెరదించిన నోకియా!!

 

నోకియా ఎట్టకేలకు తాను రూపొందించిన స్మార్ట్‌ఫోన్ ‘ప్యూర్ వ్యూ 808’ను భారతీయ విపణిలో విడుదలచేసి అభిమానుల ఉత్కంఠకు తెరదించింది. కార్ల్ జిస్ ఆప్టిక్స్ టెక్నాలజీతో కూడిన 41మెగాపిక్సల్ కెమెరా ప్రధాన అంశంగా తుది మెరుగులు దిద్దుకున్నఈ డివైజ్ గరిష్ట చిల్లర ధర రూ.33,899. ఈ హై మెగా పిక్సల్‌తో కూడిన కెమెరా టెక్నాలజీ సౌలభ్యతతో యూజర్ అనేక రిసల్యూషన్‌లలో ఫోటోలు ఇంకా వీడియోలను చిత్రీకరించుకోవచ్చు. ముందుగా ప్రకటించిన గడువు ప్రకారం ‘ప్యూర్ వ్యూ 808’ను మేలోనే విడుదల చెయ్యాల్సి ఉంది. పలు కారణాలు రిత్యా ఈ ఆవిష్కరణ జూన్‌కు వాయిదా పడింది. ఈ డివైజ్ ధరకు సంబంధించి నిన్నమొన్నటి వరకు వ్యక్తమైన అనేక పుకర్లాను నోకియా వర్గాలు ఖండిస్తూ వచ్చిన విషయం తెలిసిందే. అంతిమంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ రూ.30,000 స్ట్రీట్ ధరకు విక్రయించవచ్చు.

హ్యాండ్‌సెట్ ఫీచర్ల విషయానికొస్తే నోకియా సింబియాన్ బెల్లీ ఆపరేటింగ్ సిస్టం పై ఫోన్ రన్ అవుతుంది. 4 అంగుళాల ఆమోల్డ్ టచ్‌స్ర్కీన్ క్రిస్టల్ క్లియర్ క్లారిటీతో కూడిన విజువల్ అనుభూతికి లోను చేస్తుంది. అమర్చిన గొరిల్లా గ్లాస్ 2 టెక్నాలజీ పగుళ్ల నుంచి డిస్‌ప్లేను దూరంగా ఉంచుతుంది. పొందుపరిచిన 1.3గిగాహెట్జ్ సామర్ధ్యం గల ప్రాసెసర్ మొబైల్ ప్రాసెసింగ్ వేగాన్ని మరింత బలోపేతం చేస్తుంది. ఇంటర్నెల్ మెమెరీ 16జీబి కాగా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమెరీని 32జీబికి పొడిగించుకోవచ్చు.

కెమెరా పనితీరుకు సంబంధించి వివరాలను పొందుపరిచిన వీడియోలో చూడొచ్చు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot