తెలివైన సెల్ఫీల కోసం ‘Oppo A83’

|

సెల్ఫీ సెంట్రిక్ స్మార్ట్‌ఫోన్‌ల విభాగంలో తనదైన పాపులారిటీని సొంతం చేసుకున్న ఒప్పో మిడ్-రేంజ్
సెగ్మెంట్‌ను టార్గెట్ చేస్తూ మరో సెల్ఫీ కెమెరా ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ఒప్పో ఏ83 (Oppo A83) పేరుతో విడుదలైన ఈ ఫోన్ రూ.14,000 బడ్జెట్‌లో బెస్ట్ కెెమెరా ఫోన్‌గా అవతరించింది.

 
తెలివైన సెల్ఫీల కోసం ‘Oppo A83’

బీజిల్-లెస్ డిస్‌ప్లేతో కూడిన ఫుల్ స్ర్కీన్ డిజైన్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సెల్ఫీ కెమెరా, ఫేషియల్ రికగ్నిషన్ వంటి స్పెషల్ ఫీచర్స్ ఈ హ్యాండ్‌సెట్‌లో ఉన్నాయి.

ఈ ఫోన్‌లో పొందుపరిచిన 8 మెగ పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ అలానే 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరాలు అత్యుత్తమ ఫోటోగ్రఫీ అనుభూతులను ఆఫర్ చేస్తాయి. ఏఐ బ్యూటిఫికేషన్ టెక్నాలజీ ఫోన్ ఫ్రంట్ కెమెరాను సరికొత్త లెవల్‌కు తీసుకువెళ్లగలుగుతుంది.

ఈ టెక్నాలజీ ఆఫర్ చేసే కస్టమైజిడ్ బ్యూటిఫికేషన్ ఎన్‌హాన్స్‌మెంట్స్‌తో గ్రూప్ సెల్ఫీలను మరింత ఆకర్షణీయంగా మలచుకునే వీలుంటుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌కు బదులుగా ఈ ఫోన్‌లో నిక్షిప్తం చేసిన ఫేషియల్ రికగ్నిషన్ సపోర్ట్ ఫోన్ సెక్యూరిటీని మరింత బలోపేతం చేస్తుంది.

ఏఐ టక్నాలజీనే ఎందుకు..?

ఏఐ టక్నాలజీనే ఎందుకు..?

సెల్ఫీ సెంట్రీక్ స్మార్ట్‌ఫోన్‌ల తయారీలో ఇప్పటికే అపారమైన అనుభవాన్ని సొంతం చేసుకున్న ఒప్పో, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఇంప్లిమెంటేషన్‌తో ఈ విభాగంలో మరో అడుగు ముందుకువేసినట్లయ్యింది ఒప్పో ఏ83 ఫ్రంట్ కెమెరాలో లోడ్ చేసిన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఏ మేరకు ప్రయోజానాలు ఉన్నాయనేదాని పై ఇప్పుడు చర్చించుకుందాం..

సెల్ఫీ షాట్స్ పై నిరంతర లెర్నింగ్..

సెల్ఫీ షాట్స్ పై నిరంతర లెర్నింగ్..

ఒప్పో వెల్లడించిన వివరాల ప్రకారం ఒప్పో ఏ83 స్మార్ట్‌ఫోన్‌లో నిక్షిప్తం చేసిన ఏఐ ఆధారిత ఫ్రంట్ కెమెరా మెచీన్ లెర్నింగ్ టెక్నాలజీ పై స్పందించగలుగుతుంది. స్కిన్ టోన్స్, కలర్, ఏజ్, జెండర్ ఇంక సబ్జెక్ట్స్ మధ్య తేడాలను ఈ కెమెరా క్షుణ్నంగా అధ్యయనం చేయగలుగుతుంది. ఈ ఏఐ టెక్నాలజీతో వచ్చే కాంప్లెక్స్ అల్గారిథమ్, ఫోటోను క్లిక్ చేస్తున్నది ఎవరో కూడా గుర్తించగలుగుతుంది.

ఈ కెమెరా మేల్ సబ్జెట్స్ అలానే ఫిమేల్స్ సబ్జెక్ట్స్ మధ్య తేడాలను గుర్తించి వారి వయసును బట్టి ఎఫెక్ట్స్‌ను అద్దుతుంది.పోర్ట్రెయిట్ మోడ్ ద్వారా చిత్రీకరించుకునే సెల్ఫీలకు బ్యాక్‌గ్రౌండ్‌లో Bokeh బోకెహ్ ఎఫెక్ట్స్‌ను అప్లై చేసుకునే వీలుంటుంది. ఈ కెమెరాలోని ఏఐ బ్యూటీ టెక్నాలజీ ఫేషియల్ రిలేటెడ్ బ్యూటీ పై ఎక్కువుగా శ్రద్ధ తీసుకుంటుంది.

క్రిస్ప్ క్వాలిటీ పోర్ట్రెయిట్స్..
 

క్రిస్ప్ క్వాలిటీ పోర్ట్రెయిట్స్..

ఒప్పో ఏ83లో నిక్షిప్తం చేసిన ఏఐ ఆధారిత ఫ్రంట్ కెమెరా డీప్ మెచీన్ లెర్నింగ్‌తో హైక్వాలిటీ రిజల్ట్స్‌ను ప్రొవైడ్ చేస్తుంది. ఈ టెక్నాలజీ వద్ద ముందుగానే స్టోర్ అయిన ఉన్న గ్లోబల్ ఇమేజ్ డేటా బేస్ మనుషుల ముఖాల పై పూర్తి అవగాహనను కలిగి ఉంటుంది. ఏ83 సెల్ఫీ కెమెరాలో ఎక్విప్ చేసిన ఏఐ బ్యూటీ టెక్నాలజీ కాంప్లెక్స్ లైటింగ్ కండీషన్స్‌‌లోనూ యూజర్ ముఖం పై ఫోకస్ ఉండేలా చూస్తుంది.

జియో కాయిన్స్‌ యాప్‌పై క్లారిటీ ఇచ్చిన కంపెనీ, ఎప్పుడు వస్తుంది..?జియో కాయిన్స్‌ యాప్‌పై క్లారిటీ ఇచ్చిన కంపెనీ, ఎప్పుడు వస్తుంది..?

కస్టమైజిడ్ బ్యూటీ ఎఫెక్ట్స్

కస్టమైజిడ్ బ్యూటీ ఎఫెక్ట్స్

ఒప్పో ఏ83 కెమెరాకు సంబంధించిన బ్యూటీ ఎఫెక్ట్స్‌ను కావల్సిన విధంగా కస్టమైజ్ చేసుకునే వీలుంటుంది. ఈ కెమెరా అన్‌న్యాచురల్ బ్యూటిఫికేషన్ ఎన్‌హాన్స్‌మెంట్స్‌ను పూర్తిగా నిరోధించగలుగుతుంది. మేల్ సబ్జెక్ట్స్‌లో ఫెమినైన్స్ ఎన్‌హాన్స్‌మెంట్స్ అనేవి ఏమాత్రం కనిపించవు. ఒక్కో సబ్జెక్టుకు సంబంధించి 200 ఫేషియల్ రికగ్నిషన్ స్పాట్ లను ఈ కెమెరా రికార్డ్ చేస్తుందని ఒప్పో చెబుతోంది.

ఫిల్టర్స్ ద్వారా సెల్ఫీలను మరింత అప్పీలింగ్‌గా మలచుకోవచ్చు...

ఫిల్టర్స్ ద్వారా సెల్ఫీలను మరింత అప్పీలింగ్‌గా మలచుకోవచ్చు...

ఒప్పో ఏ83 ఫ్రంట్ కెమెరాలో ఆర్టిఫీషియల్ సెల్ఫీ టెక్నాలజీతో పాటు అనేక ఫీచర్స్ కొలువు తీరి ఉన్నాయి. bokeh ఎఫెక్ట్స్‌ను ఈ కమెరా సృష్టించగలదు. ఈ ఫోన్ కోసం క్రాఫ్ట్ చేయబడిన ఫిల్టర్స్ ఫోటోలకు న్యాచురల్ ఫినిషింగ్‌ను అద్ది అత్యుత్తమ అవుట్‌పుట్‌ను ప్రొవైడ్ చేయగలుగుతాయి.

OPPO A83 స్మార్ట్‌ఫోన్‌కు ఫేషియల్ అన్‌లాక్ ఫీచర్ మరో ప్రధానమైన హైలైట్‌గా నిలుస్తుంది. ఈ ఫోన్‌లో టచ్ ఐడీ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌కు బదులుగా ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీని ఒప్పో పొందుపరిచింది. ఈ సెక్యూరిటీ ఫీచర్‌తో యూజర్ తన ముఖాన్నే పాస్‌వర్డ్‌గా సెట్ చేసుకుని ఫోన్‌ను అన్‌లాక్ చేసే వీలుంటుంది. ఈ సూపర్ హై-స్పీడ్ టెక్నాలజీ కేవలం 0.4 సెకన్ల వ్యవధిలో ఫోన్‌ను అన్‌లాక్ చేయగలుగుతుంది.

Best Mobiles in India

English summary
OPPO A83 is priced at Rs.13,999 and utilizes the power of Artificial Intelligence to enhance mobile user experience. The camera uses machine learning to deliver a reliable everyday performance to enhance your photography experience

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X