హైక్వాలిటీ ఫీచర్లతో Honor 7x, అదిరిపోయే పాజిటివ్ పాయింట్స్

|

ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ప్రస్తుతం మిడ్‌రేంజ్ ఆండ్రాయిడ్ ఫోన్‌ల హవా కొనసాగుతోంది. రోజుకో బడ్జెట్ పోన్ మార్కెట్లో లాంచ్ అవుతోన్న నేపథ్యంలో కొత్త ఫోన్ ఎంపిక కాస్తా తర్జన భర్జనగా మారిపోయింది. ఈ నేపథ్యంలో బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ హానర్ బ్రాండ్ అందుబాటలోకి తీసుకువచ్చిన హానర్ 7ఎక్స్ ఫోన్ మార్కెట్లో పెను సంచలనం రేపుతోంది.

 
హైక్వాలిటీ ఫీచర్లతో Honor 7x, అదిరిపోయే పాజిటివ్ పాయింట్స్

రూ.12,999 ధర ట్యాగ్‌తో లభ్యమవుతోన్న ఈ స్మార్ట్‌ఫోన్‌లో అనేక పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి. ఎడ్జ్ టు ఎడ్జ్ స్ర్కీన్, డ్యుయల్ లెన్స్ కెమెరా సెటప్ వంటి విప్లవాత్మక ఫీచర్లు ఈ ఫోన్‌కు ప్రధాన హైలైట్స్‌గా నిలిచాయి. గతంలో ఇటువంటి ఫీచర్లు హై-ఎండ్ ఫోన్‌లలో మాత్రమే కనిపించేవి.

స్లీక్ ఇంకా మోడ్రెన్ డిజైన్

స్లీక్ ఇంకా మోడ్రెన్ డిజైన్

స్లీక్ ఇంకా మోడ్రెన్ డిజైన్ కారణంగా హానర్ 7ఎక్స్ స్మార్ట్‌ఫోన్ బడ్జెట్ ఫ్రెండ్లీ ధర సెగ్మెంట్‌లో బెస్ట్ స్లిమ్ ఫోన్‌గా అవతరించింది. గతంలో లాంచ్ అయిన హానర్ స్మార్ట్‌ఫోన్‌ల తరహాలోనే ఈ డివైస్ కూడా పూర్తి యునిబాడీ మెటల్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఎడ్జ్ టు ఎడ్జ్ 18:9 యాస్పెక్ట్ రేషియో స్ర్కీన్ ఈ ఫోన్‌కు మరో ప్రధాన హైలైట్‌గా నిలుస్తుంది. హోమ్ బటన్స్ అలానే ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను కచ్చితమైన ప్లేస్‌మెంట్స్‌లో ఉంటాయి.

ఎడ్జ్ టు ఎడ్జ్ ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే

ఎడ్జ్ టు ఎడ్జ్ ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే

హానర్ 7ఎక్స్ స్మార్ట్‌ఫోన్ 5.93 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ప్లస్ (2160 x 1080 పిక్సల్స్) ప్యానల్‌తో వస్తోంది. ఎడ్జ్ టు ఎడ్జ్ 18:9 యాస్పెక్ట్ రేషియో కారణంగా ఈ డివైస్ గ్రాఫికల్ కంటెంట్‌ను స్టన్నింగ్ విజువల్స్‌తో అందిస్తుంది. మరింత ప్రకాశవంతంగా కనిపించే హానర్ 7ఎక్స్ స్ర్కీన్‌ను డైరెక్ట్ సన్‌లైట్‌లో కూడా ఆపరేట్ చేసుకునే వీలుంటుంది. స్మార్ట్ మొబైలింగ్‌తో పాటు మల్టీ మీడియా అవసరాలను తీర్చుకునేందుకు ఈ ఫోన్‌ను ఒక బెస్ట్ ఆప్షన్‌గా చెప్పుకోవచ్చు.

డ్యుయల్ కెమెరా సెటప్
 

డ్యుయల్ కెమెరా సెటప్

హానర్ 7ఎక్స్ 16 మెగా పిక్సల్ + 2 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ కెమెరా సెటప్‌తో వస్తోంది. ఈ కెమెరాలు bokeh షాట్స్‌ను మరింత వేగంగా క్యాప్చుర్ చేయగలుగుతాయి. ఈ కెమెరాలు ఆఫర్ చేస్తోన్న డెప్త్ ఆఫ్ ఫీల్డ్ ఇంకా వైడ్ వ్యూవింగ్ యాంగిల్స్ హైక్వాలిటీ పనితీరుకు అద్దం పడతాయి. ఫోన్ ముందు భాగంలో అమర్చిన 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నాణ్యమైన సెల్ఫీలను ప్రొవైడ్ చేస్తోంది.

ఇక నుంచి ఆ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు!ఇక నుంచి ఆ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు!

శక్తివంతమైన బ్యాటరీ బ్యాకప్

శక్తివంతమైన బ్యాటరీ బ్యాకప్

హానర్ 7ఎక్స్ ఫోన్ 3,340ఎమ్ఏహెచ్ ఇన్‌బిల్ట్ బ్యాటరీతో వస్తోంది. సింగిల్ ఛార్జ్ పై రోజుంతా వచ్చే ఈ బ్యాటరీ హెవీ యూసేజ్‌కు వినియోగించుకోవచ్చు. ఈ ఫోన్‌‌తో ఇన్‌బిల్ట్‌గా వస్తోన్న పవర్ సేవింగ్ అలానే అల్ట్రా సేవింగ్ మోడ్స్ ద్వారా బ్యాక్‌గ్రౌండ్ యాప్ యాక్టివిటీలను కంట్రోల్‌లో ఉంచటంతో పాటు స్ర్కీన్ విజువల్ ఎఫెక్ట్స్‌ను కూడా తగ్గించుకునే వీలుంటుంది. దీంతో బ్యాటరీ పవర్ మరింతగా ఆదా అయ్యే వీలుంటుంది.

ఫీచర్ రిచ్ EMUI 5.1 యూజర్ ఇంటర్‌ఫేస్

ఫీచర్ రిచ్ EMUI 5.1 యూజర్ ఇంటర్‌ఫేస్

హానర్ 7ఎక్స్ డివైస్‌లోని ఎడ్జ్ టు ఎడ్జ్ డిస్‌ప్లే మల్టీ టాస్కింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను కొత్త లెవల్‌కు తీసుకువెళుతుంది. ఆండ్రాయిడ్ నౌగట్ స్ప్లిట్ స్కీన్ ఫీచర్‌ను ఉపయోగించుకోవటంలో హానర్ 7ఎక్స్ పూర్తిస్థాయిలో సఫలమైంది. ఈ డివైస్‌లో ఇన్‌స్టాల్ చేసిన ఫీచర్ రిచ్ EMUI 5.1 యూజర్ ఇంటర్‌ఫేస్ సాఫ్ట్‌వేర్ విభాగాన్ని మరింత స్మూత్‌గా హ్యాండిల్ చేస్తుంది. ఈ ఇంటర్‌ఫేస్ సహాయంతో ఫోన్ హోమ్ స్ర్కీన్‌ను కావల్సిన స్టైల్ లో కస్టమైజ్ చేసుకునే వీలుంటుంది.

స్మార్ట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్

స్మార్ట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్

హానర్ 7ఎక్స్ స్మార్ట్‌ఫోన్‌లో నిక్షిప్తం చేసిన ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను కేవలం సెక్యూరిటీ అవసరాలకు మాత్రమే కాకుండా ఫోటోలు క్యాప్చుర్ చేసుకునేందుకు, వీడియోలను రికార్డ్ చేసుకునేందుకు, కాల్స్ ఆన్సర్ చేసేందుకు ఉపయోగించుకోవచ్చు. ఇక కనక్టువిటీ ఫీచర్స్ విషయానికి వచ్చేసరికి హానర్ 7ఎక్స్ స్మార్ట్‌ఫోన్‌ను వై-ఫై రౌటర్‌లా ఉపయోగించుకోవచ్చు. ఏకంగా నాలుగు డివైస్‌లను ఈ ఫోన్‌తో కనెక్ట్ చేసుకునే వీలుంటుంది. ఈ ఫోన్‌తో లభించే హువావే క్లౌడ్ సర్వీసెస్ ద్వారా ఫోన్‌లోని డేటాను హువావే క్లౌడ్ సర్వర్‌తో సింక్ చేసుకునే వీలుంటుంది.

స్మూత్ ప్రాసెసింగ్ ఇంకా మల్టీ టాస్కింగ్..

స్మూత్ ప్రాసెసింగ్ ఇంకా మల్టీ టాస్కింగ్..

హానర్ 7ఎక్స్ డివైస్‌లోని ఎడ్జ్ టు ఎడ్జ్ డిస్‌ప్లే మల్టీ టాస్కింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను కొత్త లెవల్‌కు తీసుకు వెళుతుంది. ఈ ఫోన్‌లో నిక్షిప్తం చేసిన హువావే హైసిలికాన్ కైరిన్ 659 2.5గిగాహెట్జ్ ఆక్టా-కోర్ ప్రాసెసర్ కఠినమైన టాస్కులను సైతం సునాయాశంగా పూర్తి చేయగలుగుతుంది. ఇక స్టోరేజ్ విషయానికి వచ్చేసరికి హానర్ 7ఎక్స్ 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్ సపోర్ట్‌తో వస్తోంది. మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా హానర్ 7ఎక్స్ స్టోరేజ్‌ను 256జీబి వరకు విస్తరించుకునే అవకాశాన్ని కల్పించారు.

Best Mobiles in India

English summary
Honor 7X has many interesting features that make it one of the most sought after mid-range Android smartphone.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X