ఎంత నాజూకో....ముద్దొచేస్తుంది!

చైనాకు చెందిన మొబైల్ ఫోన్‌ల తయారీ కంపెనీ ‘Oppo’ ప్రపంచపు అత్యంత పలుచటి స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. పేరు ‘Oppo Finder’. ఈ ఫోన్ మందం కేవలం 6.65 మిల్లీమీటర్లు. ఇప్పటి వరకు ఈ రికార్డు హువావీ రూపొందించిన ఎసెండ్ పీ1 (మందం 6.68మిల్లీ మీటర్లు) పేరు మీద ఉంది.
హ్యాండ్‌సెట్ స్పెసిఫికేషన్‌లకు సంబంధించి పూర్తి సమాచారం అధికారికంగా తెలియాల్సి ఉంది. అనధికారికంగా తెలిసిన సమాచారం మేరకు.. డివైజ్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది.
స్ర్కీన్ పరిమాణం 4.3 అంగుళాలు,
ఆమోల్డ్ ప్లస్ డిస్‌ప్లే,
1.5గిగాహెడ్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
ర్యామ్ సామర్ధ్యం 1జీబి,
16జీబి ఇన్‌బుల్ట్ స్టోరేజ్,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా
1.2 మెగా ఫ్రంట్ కెమెరా,
వై-ఫై,
బ్లూటూత్,
హై క్వాలిటీ ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్.
జూన్ 6 నుంచి ఈ సూపర్‌స్లిమ్ స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి రానుంది. ధర అంచనా రూ.35,000. తక్కువ బరువు కలిగి ఆకర్షణీయమైన శ్రేణిలో డిజైన్ కాబడిన ఈ డివైజ్ ఉత్తమ మొబైలింగ్ అనుభూతులను యూజర్‌కు అందిస్తుంది.
హువావీ ఎసెండ్ పీ1:
ఉత్తమమైన మొబైలింగ్‌ను అందించే నాజూకైన స్మార్ట్‌ఫోన్‌ను హువావీ ( Huawei) సంస్ధ డిజైన్ చేసింది. ప్రపంచపు నాజూకైన స్మార్ట్‌ఫోన్‌లలో రెండోదిగా గుర్తింపు తెచ్చుకన్న ‘హువావీ ఎసెండ్ పీ1’ జనవరిలో నిర్వహించిన కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ షో ద్వారా పరిచయమయ్యింది. ఈ డివైజ్ హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ కాన్ఫిగరేషన్‌లను పరిశీలిస్తే... హ్యాండ్‌సెట్ మందం కేవలం 6.68మిల్లీమీటర్లు,
ఫీచర్స్:
* 4.3 అంగుళాల ఆమోల్డ్ టచ్‌స్ర్కీన్, * 1.5GHz సామర్ధ్యం గల డ్యూయల్ కోర్ ప్రాసెసర్, * ఆండ్రాయిడ్ v4.0 ఆపరేటింగ్ సిస్టం, * 1జీబి ర్యామ్, * 2జీ, 3జీ నెట్‌వర్క్, * 8 మెగా పిక్సల్ కెమెరా, * 1080 పిక్సల్ హై డెఫినిషన్ వీడియో రికార్డింగ్, * ఇన్‌బుల్ట్ మెమరీ 8జీబి, * జీపీఆర్ఎస్, * ఎడ్జ్ సపోర్ట్, * వై-ఫై, * బ్లూటూత్, * యూఎస్బీ కనెక్టువిటీ, * మల్టీ మీడియా ప్లేయర్, * ఎఫ్ఎమ్ రేడియో, * గేమ్స్, * హెచ్టీఎమ్ఎల్ ఫ్లాష్ బ్రౌజర్.


Click it and Unblock the Notifications








